Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఆరోగ్యం, పొదుపు ధ్యేయంగా పెంచండి పచ్చని మొక్కలు!

1. గోంగూర - పచ్చగా వుండే ఈ ఆకు కూరకు పెద్దగా చేయవలసిన పని లేదు. విత్తనాలు వేస్తే చాలు వేగంగా పెరుగుతుంది. కొద్దిపాటి వెడంగా విత్తనాలు నాటండి. రెండు లేదా మూడు వారాలలో మొక్కలు వచ్చేస్తాయి. మొక్కల ఆకులను ఎప్పటికపుడు తుంచి కూడా వాడవచ్చు. ఆకులను వేడి నీటిలో శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. గోంగూరలో అనేక విటమిన్లు, ఐరన్ వుంటాయి.
2. తోటకూర - ఇది కూడా పచ్చగా వుండే ఆకు కూర. ఇది బాగా పెరగాలంటే తక్కువ ఉష్ణోగ్రత వుండాలి. తేమ అధికంగా వుండాలి. వీటిని మట్టి కుండీలలో కూడా పెంచవచ్చు. ఎండ వేడి అధికంగా వుంటే కూరకు రుచి తగ్గుతుంది. అధికంగా సూర్య రశ్మి పడని చోట ఈ మొక్కలను పెంచండి. వీటిని కొద్దిపాటి లేతదనం వుండగానే కోసి కూరగాను, లేదా సలాడ్లలోను లేదా పప్పులతో ఉడికించి వాడుకోవచ్చు.
3. వంకాయ - వంకాయ వంటి రుచి మరే ఇతర కూరకూ రాదంటారు. వంకాయ మొక్కలకు మధ్యస్ధమైన వేడి కావాలి. మరీ చలిగా వుంటే మొక్క ఎదుగుదల వుండదు. విత్తనాలను మట్టి కుండీలలో కూడా పెట్టి మొక్కలను పెంచవచ్చు. ఎక్కువ ఎత్తు ఎదగవు. ఈ మొక్కలకు సూర్యరశ్మి బాగా కావాలి. గాలి తక్కువగా వుంటే కాయలు రాలకుండా వుంటాయి.
4. చిక్కుడు తీగలు - చిక్కుడు తీగలను పెంచటం చాలా తేలిక. నాటే ముందు గింజలను నానపెట్టకండి. మొక్క బాగా ఎదగాలంటే, గింజలను ఎండలో పెట్టండి. ఆపై నాటండి. ఈ మొక్క వేళ్ళు బలహీనంగా వుంటాయి. వర్షాలనుండి కొద్దిపాటి రక్షణ కావాలి. వీటిని కూడా పెద్ద డబ్బాలలో లేదా పెద్ద కుండీలలో పెంచవచ్చు.
ఈ నాలుగు మొక్కలు మీ ఇంటి పెరటిలో వేసుకుంటే, నాలుగు రకాల కూరలు చాలా రోజులు ఉపయోగించి ఆరోగ్యకరమైన, పొదుపైన రీతిలో వాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications
