Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇంటిగార్డెన్ ప్రశాంత నిలయంగా చూడాలంటే ఓ ప్రణాళిక తప్పనిసరి

మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు, నీడన పెరిగే మొక్కల గురించి అడిగి తెలుసుకోవాలి. తర్వాత స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ముళ్లపొదలు, గడ్డి ఇతర చెట్టు ఏవైనా ఉంటే తొలగించాలి. పారతో గడ్డిని సులువుగా తొలగించుకోవచ్చు. కాబట్టి గార్డెన్ కు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకోవాలి. వాటితో స్థలం చదును చేసుకుని మట్టిని వదులుగా తవ్వుకోవాలి.
స్థలం చదును చేసుకున్నాక మట్టి రకాన్ని పరీక్షించాలి. మొక్కలు ఎంపిక చేసుకునే ముందు మొక్కలు పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులనుకూడా దృష్టిలో పెట్టుకోవాలి. పూలమొక్కలు, పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్ లో పెంచుకోవచ్చు.
మొక్కలకు సరిపడా నీరు పట్టడం కూడా చాలా అవసరం. ఏ మొక్కకు ఎంత నీరుపట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటి వారంలో రోజూ నీరు పట్టాలి. రెండవ వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పడితే సరిపోతుంది. మొక్కలు బాగా పెరిగాక వారానికొకసారి నీరు పట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పట్టాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆహ్లాదాన్నందించే గార్డెన్ మీ సొంతమవటం ఖాయం.



Click it and Unblock the Notifications
