Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
కిచెన్ గార్డెన్ తో ఆరోగ్యమే మహా భాగ్యం..

మార్కెట్ లో కూరగాయలు, పండ్లు ధరలు ఆకాశన్నంటుతన్ను ఈ సమయంలో అనుకూలమైనటువంటి, వాతవరణంలో కూరగాయలమొక్కలు, ఆకకూరలు పెంచుకోవచ్చు. ఏ మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో ఆ విత్తనాలను స్థానికంగా ఉన్న దుకాణాల్లో తెచ్చుకొని పండించుకోవచ్చు. కుంపట్లో చాలా త్వరగా పెరిగేటటువంటి విత్తనాలైన, కాకరకాయ, చిక్కుడు, బెండ, పచ్చిమిర్చి, టమోటో, వంకాయ వంటి విత్తనాలను చల్లుకొని ఏపుగా కూరగాయలను పండించుకోవచ్చు. అంతే కాకుండా మెంతాకు, తోటకూర కొత్తిమీర, పుదీనా వంటి ఆకు కూరలూ పండించుకోవచ్చు.
రసాయనిక ఎరువుల వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున, కేవలం పశువుల గెత్తం (ఎరువు), నల్లమట్టి కలిపి కుండీల్లో వేసుకోవచ్చు. నెలకోసారి కుండీల్లో అర అడుగు లోతున మట్టి తీసేసి, ఆ మేరకు కొత్తగా పశువుల ఎరువు, మట్టిని నింపుకోవాలి.
చీడపీడలు కనిపిస్తే వేపనూనె చల్లుకోవచ్చు. అలాగే బంతి ఆకులు లేదా పూలు, వెల్లుల్లి, పొగాకు కాడలు, వేపాకు, సీతాఫలం ఆకుల చిగుళ్లు.. రసం తీసి 4 రోజులు నిల్వ ఉంచి మొక్కలకు అప్పుడప్పుడూ చల్లుకోవచ్చు. దీని వల్ల చీడను నివారించి ఇంటి అవసరాలకు సరిపోయే మంచి నాణ్యమైన కూరగాయలు పండించుకోవచ్చు. దానివల్ల ఏడాది పొడువునా కూరగాయలు అందుబాటులో ఉండేలా చేసుకోవచ్చు. దాంతో మేడపై పచ్చదనం పరచుకోవడంతో ఇంట్లో కూడా చల్లని వాతావరణం నెలకొంటుంది. ఇంటిపైనే పండించుకున్న కూరగాయలు తింటూ ఆరోగ్యంగా గడపొచ్చు.



Click it and Unblock the Notifications
