Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ప్రకృతిలో కనువిందు చేసే 5 రకాల కీటకాహార మొక్కలు
ఈ ప్రకృతిలో కనువిందు చేసే ఈ క్రిమికీటకాలను తినే మొక్కలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. వీటిని శాస్త్రవేత్తలు ఇన్సేకివోరస్ ప్లాంట్స్ అంటే మాంసాహార భక్షణ మొక్కలని పిలుస్తారు. నత్రజని లోపం ఎక్కువగా ఉండే ఈ మొక్కలు తమ ఎదుగుదలకు కావాల్సిన నత్రజని కోసం తమ పరిసరాలలో తిరుగాడే క్రిమికీటకాలపై ఆధారపడతాయి. ఈ మొక్కలపై వాలే క్రిమికీటకాలను బంధించి చంపడమే కాకుండా ఆ మాంసాన్ని జీర్ణింప చేసుకుని అందులోని నత్రజనిని తమ ఎదుగుదలకు వినియోగించుకుంటాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలలోని బురదగా ఉండే నేలల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కలు తమపై వాలే క్రిమి కీటకాలను తమ ఆకులనే బోనులుగా చేసుకుని కదలకుండా చేస్తాయి. ఆపై వివిధ రకాల ఎంజై ములను విడుదలచేసి వాటిని చంపి... జీర్ణం చేసుకుని ప్రోటీనులను విశేషించుకుంటాయి. ప్రకృతిలో మనకి కనిపించే కీటకాహార మొక్కల్లో అత్యంత ప్రధానమైనవి డ్రోసిరా, నెపెంధిస్, యూట్రిక్యులేరియా, డయోనియా, సర్రెసీనియా, ఆల్ డ్రోవాండా, వీనస్ ప్లై ట్రాప్, పిచ్చర్, సన్‌డ్యూ తదితరాలు..వీటిని ఓ సారి పరిశీలిస్తే....

సన్ డ్యూ
ఈ మొక్కలపై వాలే కీటకాలను తమ పత్రాలపై ఉండే జిగురు సాయంతో కదలకుండా చేస్తా యి.

నెపంథీస్ (పిచ్చర్
నెపెంథిస్ యొక్క ఆకు కూజా ఆకారంలో ఉంటుంది. ఆ కూజా నిర్మాణానికి ఒక మూత వంటి ఏర్పాటు కూడా ఉంటుంది

డయోనియా
ఈ మొక్క యొక్క ఆకు రెండు దొప్పల వలె ఉంటుంది. కీటకం వాటిలో వాలగానే, దొప్పలు రెండూ దగ్గరకు వచ్చి కలిసిపోతాయి

డ్రోసిరా
ఈ మొక్క ఆకులపై సర్శజ్ఞానం కలిగిన నాళికలు (గొట్టాలు) ఉంటాయి. ఈ నాళికలే కీటకాలను బంధిస్తాయి. నెపెంథిస్ యొక్క ఆకు కూజా ఆకారంలో ఉంటుంది

వీనస్ ఫ్లై ట్రాప్
ఆకుల అంచుల్లో సన్నని ముళ్లు, మధ్య భాగంలో నున్నని వెంట్రుకల్ని కలిగి ఉండె ఈ మొక్కలు తమపై క్రిమి కీటకాలు వాలగనే నెమ్మదిగా ముడుచుకోవటం ప్రారంభించి
సన్ డ్యూ : ఈ మొక్కలపై వాలే కీటకాలను తమ పత్రాలపై ఉండే జిగురు సాయంతో కదలకుండా చేస్తా యి. ఆపై ఆకులు చాపచుట్టేసి నట్లు చుట్టి కీటకాలను చంపేస్తాయి. తరువాత ఆకుల ద్వారా వివిధ రసాయనాలు వెలువరించి కీటకాలను జీర్ణం చేసుకోవటం ప్రారంభిస్తాయి.
నెపంథీస్ (పిచ్చర్ ):నెపెంథిస్ యొక్క ఆకు కూజా ఆకారంలో ఉంటుంది. ఆ కూజా నిర్మాణానికి ఒక మూత వంటి ఏర్పాటు కూడా ఉంటుంది. కీటకం ఆ కూజాలోకి దూరగానే మూత బిగుసుకుపోతుంది. యుట్రిక్యులేరియా ఆకులు తిత్తి వంటి బోనుగా తయారైవుండి కీటకాలను బంధిస్తాయి. ఆపై తిత్తిలో అడుగు భాగంలో ద్రవ పదార్దం ప్రభావంతో కీటకం చనిపోవటంతో దాన్ని జీర్ణం చేసుకుంటుంది.
డయోనియా: ఈ మొక్క యొక్క ఆకు రెండు దొప్పల వలె ఉంటుంది. కీటకం వాటిలో వాలగానే, దొప్పలు రెండూ దగ్గరకు వచ్చి కలిసిపోతాయి. తమకు కావలసిన మాంసకృత్తుల కోసం పురుగులనూ, కీటకాలనూ ఆహారంగా తీసుకోవడానికి ఆ మొక్కలకు పైవిధంగా రకరకాల ఏర్పాట్లున్నాయి.
డ్రోసిరా: ఈ మొక్క ఆకులపై సర్శజ్ఞానం కలిగిన నాళికలు (గొట్టాలు) ఉంటాయి. ఈ నాళికలే కీటకాలను బంధిస్తాయి. నెపెంథిస్ యొక్క ఆకు కూజా ఆకారంలో ఉంటుంది. ఆ కూజా నిర్మాణానికి ఒక మూత వంటి ఏర్పాటు కూడా ఉంటుంది. కీటకం ఆ కూజాలోకి దూరగానే మూత బిగుసుకుపోతుంది. యుట్రిక్యులేరియా ఆకులు తిత్తి వంటి బోనుగా తయారైవుండి కీటకాలను బంధిస్తాయి.
వీనస్ ఫ్లై ట్రాప్ : ఆకుల అంచుల్లో సన్నని ముళ్లు, మధ్య భాగంలో నున్నని వెంట్రుకల్ని కలిగి ఉండె ఈ మొక్కలు తమపై క్రిమి కీటకాలు వాలగనే నెమ్మదిగా ముడుచుకోవటం ప్రారంభించి, ఆ కీటకాన్ని బంధించి, చంపేసి, జీర్ణం చేసుకుంటాయి.



Click it and Unblock the Notifications
