Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
కిచెన్ గార్డెన్ కి ప్రయోజనాలు చేకూర్చే కుంపట్లు...

ఇండోర్ ప్లాంట్స్‌లో పెంచే మొక్కలకు నేరుగా సూర్యరశ్మి కానీ, ప్రతి రోజూ కేర్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. అయితే చూసేందుకు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. ఇంటి డిజైనింగ్‌ను బట్టి, స్పేసింగ్‌ను బట్టి రకరకాల డిజైనర్ కుండీలలో మొక్కలను పెంచితే ఆ ఇల్లు పచ్చదనంతో కళకళ లాడుతుంది. అందుకు చేయాల్సిందల్లా నాణ్యమైన మొ క్కలను కొనాలి. ఆకులు పచ్చగా ఉండాలి. ఒడిలి పోయి నట్లు, మొక్క ఒంగి నట్లు వుండరాదు.
కుండీలలో మొక్కలు పెంచటం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది కొందరికి. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయట పడుతుంది. అప్పటికి మొక్కను తిరిగి బతికించే అవకాశముండదు. అలాంటప్పుడు ఏం చేయాలి....మొక్కకు ఏ మాత్రం నీరు పోయాలి అనేది ఆ మొక్కను మీరు ఎక్కడ ఉంచుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వేడి అధికంగా ఉండే గదిలో పెట్టే మొక్కకు ప్రతి రోజూ కొద్దిగా నీరు పోయాలి. ఆరు బయట కాక పోర్టికోలో వుండే మొక్కలకు రెండు రోజులకు ఒకసారి పోస్తే చాలు. కుండీని చేతితో ఎత్తి చూడడం ద్వారా లోపల నీరు ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు. కుండీ లోపల పెంకులు, ఇసుక మట్టి ఉంచితే కుండీలో పోసిన అధిక నీటిని పీల్చుకుంటుంది. కుండీ కింద మట్టి ప్లేటుంచితే అధికంగా పోసిన నీరు బయటకు వచ్చి అందులో చేరుతుంది.
స్థలం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వెడల్పాటి కుండీలో వేర్వేరు రకాలకు చెందిన అయిదారు మొక్కలను నాటుకోవడం మంచిది. మీరు మొక్కలు పెంచబోయే కుండీలలో రంగు రంగుల గోళీలు, చిన్న సైజు బొమ్మల వంటివి కూడా పెడితే చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే... మొక్కల్ని ఎప్పుడూ ఒకే చోట, ఒకే కోణంలో ఉంచకూడదు. ఒకటి, రెండు వారాలకోసారి వాటిని తిప్పుతూ ఉండాలి. కొన్ని ఇళ్లల్లో ఇండోర్ ప్లాంట్స్ ఆకులు రాలిపోతూ ఇంటి యజమానులకు తెగ చికాకును తెప్పిస్తాయి. మొక్కలకు నీరు ఎక్కువైనా.. తక్కువైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. కాబట్టి నీటి విషయంలో సమతుల్యం అవసరమని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications
