Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బహుమతిగా ఇచ్చే మొక్క...మొక్కే పువ్వైతే...!

సముద్రం అడుగున పెరిగే పగడపు దిబ్బల్లా, అక్టోపస్ ఆకృతిలో... ఇలా సుమారు ఎనిమిది వందల రకాలుంటాయి. సాధారణంగా వీటిని ఇంటి అలంకరణకు ఉపయోగించే ల్యాండ్ స్కేపుల్లో ఎక్కువగా వాడతారు. అందులో మనకి ఎక్కువగా దొరికేవి క్రిప్ పాంథస్, ఇకివేరియా రకాలు. వీటిని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.
ఈ మొక్కలను పెంచుకోవడానికి మట్టి తయారి: చూడ్డానికి దళసరి ఆకులతో కనిపించే ఈ మొక్కలకు మట్టిని ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాడే ఇసుకని జల్లిస్తే వచ్చే గుండ్రని గులకరాళ్లని మట్టిలో ఉపయోగించాలి. కుండీల అడుగున ఈ రాళ్లు కలిపిన మట్టిని వేయాలి. ఆపైన తేమను నిల్వ ఉంచుకొనే మామూలు మట్టిని వేయాలి. ఈ రకంగా సిద్దం చేసుకున్న మట్టి ఈ మొక్కలు త్వరగా ఎదిగేందుకు ఉపకరిస్తుంది.
క్రిప్ పాంథస్: ఇది ఆక్టోపస్ ఆకృతిలో ఉంటుంది. వాతావరణంలోని తేమని ఆకుల ద్వారా పీల్చుకొనే ఈ మొక్క పొడిపొడిగా ఉండే మట్టిలో చాలా తేలిగ్గా ఎదుగుతుంది. దీని వెళ్లు పొట్టిగా ఆకులకు దగ్గరగా ఉంటాయి కాబట్టి నీళ్లు ఎక్కువ పోసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా మొక్కలూ కుళ్లిపోయే ఆస్కారం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లైనా సరే సరిపోతాయి. ఇలా రోజులో ఒక్కసారి నీటిని పెడితే సరిపోతుంది. చాలా అందంగా పెరుగుతుంది.
ఇకివేరియా: ఇది చూడ్డానికి గులాబీ పూవుని పోలిన ఆకుల అమరికతో ఉంటుంది. ఇందులో కొన్ని రకాలు పూవ్వులు కూడా పూస్తాయి. కొంచెం నీటిని అందిస్తే చాలు వేగంగా పెరుగుతుంది. దీనికి పెద్దగా క్రిమిసంహారక మందులు అవసంర లేదు. ఇంట్లో చేసే లీఫ్ మౌల్డ్ అంటే ఆకులు కుళ్లబెట్టి చేసిన ఎరువు చాలు. చిన్న మొక్కలకైతే సమపాళ్లలో ఉండే నత్రజని, పాస్ఫరస్, పొటాషియం తీసుకొని ఎరువుగా వేసినా చాలు. ఇది వేడిలో ఎంత బాగా పెరుగుతుందో చలిని కూడా అంతే బాగా తట్టుకొంటుంది.
ఇలా విభిన్నమైన సకులెంట్స్ ని ఒకే కుండీలో ఉంచితే కొన్ని రోజులకు చక్కని ఉద్యానవనంలా మారుతుంది. ఇవి ఆఫీసుల్లో ఉంచితే చూడచక్కన..కొత్త మొక్కని పెంచాలనుకొన్నప్పుడు కణుపు దగ్గర మొక్క ఆకుని తుంచి కోకోపీట్ లో ఉంచితే పదిహేను రోజులకి సన్నని వేళ్లతో కొత్త మొక్క వస్తుంది. మొక్క ముదిరితే పువ్వులు పూసి దాన్నుంచి విత్తనాలు వస్తాయి. అవి వేసినా కొత్త మొక్క సిద్ధం. ఇవి చాలా త్వరగా విస్తరిస్తాయి. మొక్క వందరూపాయిల వరకు ఉంటుంది.
ఒక వేళ ఎక్కడైనా వారం రోజుల పాటు వెళ్ళాసివస్తే వీటిని ఇంట్లో పెట్టేసి... కుండీ అడుగున ఓ పళ్లెంలో నీరు పోసి ఉంచేస్తే వారం తర్వాత కూడా తాజాగా ఉంటుంది. మొక్క మొదట్లో పెబెల్స్ ని వేయడం వల్ల ఆకులు కుళ్లకుండా ఉంటాయి. ఈ మొక్కలను పాతసీసాల్లోనూ పెంచుకోవచ్చు. టీ కప్పులు, కాఫీ మగ్గులు, అలాగే వ్యర్థ వస్తువులు అంటే పాడయిన పాత్రలు, పాతసీసాల్లో కూడా పెంచుకొనే వీలున్న ఈ మొక్కలకి ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పెరిగింది. ప్రత్యేక సందర్భాల్లో వీటిని కానుకలుగా ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు.



Click it and Unblock the Notifications