Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వెన్నెల్లో వికసించే పువ్వులు.....

1. క్వీన్ ఆఫ్ ది నైట్: ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది కాబట్టి ఈ పువ్వును క్వీన్ ఆఫ్ ది నైట్ అంటారు..ఇది వికసించే సమయంలో వచ్చేటటువంటి ఘాటైన పరిమళం మరే పుష్పం నుండి రాదు. ఇది పూల మొక్క కాదు. అయితే కాక్టేసి జాతికి చెందినటువంటి ఈ మొక్క సంవత్సరానికి లేదా కొన్ని సంవత్సరానికి ఒక్కసారే పుష్పాలు వికసిస్తాయి. సాధారణంగా దీన్ని సిర్రస్ కాక్టస్ లేదా క్వీన్ ఆఫ్ ది నైట్ అని పిలుస్తుంటారు. మంచి సువాసనలు కలిని ఈ పుష్పం తెల్లటి రేకులతో అందంగా వికసించే మొక్కను పెంచుకొంటే సమ్మర్ లో గార్డెన్ స్పెషల్ గా కనిపిస్తుంటుంది.
2. నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ (రాత్రిపూట వికసించే మల్లెపువ్వు): అన్ని రకాలైనటువంటి మల్లెపువ్వులు రాత్రిపూట వికసించవు అయితే కొన్ని మాత్రం వికసిస్తాయి. ఈ మల్లె చెట్టు తీగలుగా బాగా పైకి పాకి తీగలు ముదురు ఆకుపచ్చవర్ణంలో పువ్వులు తెల్లగా వికసించి రాత్రుల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంటాయి. సువాసనలతో పాటు గార్డెన్ కూ సౌందర్యాన్నిస్తాయి.
3. మూన్ ఫ్లవర్స్: రాత్రి పూట పూచే ఈ మొక్క ఫ్లవర్స్ కూడా మూన్ ఫ్లవర్స్ అంటారు. ఈ మొక్క లోని పువ్వులు చాలా విచిత్రంగా తెలుపు, వైలెట్ రంగుల్లో వికసిస్తాయి. ఈ మొక్క చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఫ్లవర్స్ ను ఎక్కువగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ మొక్క సాధారణంగా తీగలా అల్లుకుంటుంది కాబట్టి త్వరగా పెరిగిపోతుంది.
4. కొలంబినే: మరొక్క పువ్వు కొలంబినే. ఇది కూడా రాత్రి పూట మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు ఎక్కువ కలర్స్ లో వుంటాయి. అయితే వైలెట్, బ్లూ, వైట్ కలర్స్ లో ఎక్కువ వికసిస్తాయి. ఇది చాలా పొడవుగా ఉండే మొక్క. ఇది ఎక్కువగా వేసవికాలంలో పువ్వులు వికసిస్తుంటాయి. వికసించినప్పుడు వచ్చే సువాసనలు గార్డెన్ మొత్తం అల్లుకుపోతుంది.
5. ఈవినింగ్ ప్రింరోజ్: ఇది రోజా మొక్క కాదు. వేసవిలో వికసించే ఈవినింగ్ రోజ్..ఇది చాలా పెద్దగా వికసించి అలాగే ఉదయం వరకూ ఉంటుంది. ఈ పువ్వు ఎక్కువగా పింక్ కలర్ లో ఉంటాయి. ఈ మొక్కను గార్డెన్ లో పెంచడం చాలా సుభం. ఈ పువ్వునుండి వెలువడే పరిమళాలు ఎక్కువ సేపు అలాగే ఉంటాయి...



Click it and Unblock the Notifications