Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పూల మొక్కలను పెంచి పోషించేందుకు చక్కటి సూచనలు...?

కన్నులకింపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే... అలా పుష్పించిన ఫ్లవర్ వేజ్ లో చూపులను ఆకట్టుకునేట్లు అలంకరించటం ఓ కళ. పూలతో ఇంటిని కరించాలనుకోవాలనుకుంటే మొదటగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం. పుష్పించే మొక్కలను గమనించినప్పుడు, కొన్ని ఓ ప్రత్యేకమైన సీజన్ లో మాత్రమే పుష్పిస్తే...మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి.
పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎండాకాలంలో పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ... అయితే ఎప్పుడూ సంవత్సరం పొడవునా పూయించే పూల మొక్కలను పెంచడం చాలా సులభంగా ఉంటుంది.
అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పుష్పించే మొక్కల పెరుగుదల ఉంటుంది. పూల మొక్కలను సారవంతమైన భూమిలో పెంచాలి. పూల మొక్కల చుట్టూ కలుపు మొక్కలను తీసేసి కంపోస్ట్ ఎరువును, మట్టిని పూల మొక్కలను వేయాలి. అలాగే పూల మొక్కలకు నీళ్ళు పట్టడం కూడా ఓ పద్దతి ప్రకారం నీళ్ళు పట్టాలి. పూల మొక్కలకు ఉదయం మరియు మధ్యహాన్నం(సాయ:సంద్యవేల నీరు పట్టడం వల్ల చెట్లకు కావలసిన నీరు ఆవిరైపోకుండా ఉంటాయి.
కొన్ని రకాల పూల మొక్కలను అప్పుడప్పుడు పోస్తే సరిపోతుంది. కొన్ని మొక్కలు ఎండలో పెరిగితేనే బాగా వికశిస్తాయి. అయితే ఫ్లవర్ గార్డెన్ కు పూర్తి సూర్య రశ్మి...నీళ్ళు తోటే కళకళలాడుతుంది. ప్రతి 30-60రోజులకు ఒక్కసారి పూలమొక్కలదగ్గరు రాలిపోయిన ఆకులు చెత్తచెదారం శుభ్రం చేయాలి. అలా చేయడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కలకు ఎండిపోయినటువంటి ఆకులు, నేలపై పెరిగి గెడ్డి, ఉపయోగించి మిగిలిన కూరగాయ పదార్థాలు మంచి కంపోస్ట్ గా ఉపయోగపడుతుంది..కాబట్టి చిన్నపాటి ఈ సూచనలు పాటిస్తే మీ ఇంట్లో అందమైనటువంటి..కలర్ ఫుల్ ఫ్లవర్ గార్డెన్ మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications
