Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
హాయిగా.. ఆనందంగా... షికారు చేయాలంటే ఇలా ఉండాలి...
ఇంటి వాతావరణానికి గార్డెన్ అనేది అందంతో పాటు ఆనందాన్ని.. ఆరోగ్యాన్నిఇచ్చేది. అటువంటి గార్డెన్ అందరి ఇల్లల్లోనూ ఉండాలని ఇష్టపడుతుంటారు. అయితే అందుకు కావల్సిన పరిసరాలను సమకూర్చుకోగలిగినప్పుడే చక్కటి గార్డెనింగ్ ను మెయింటైన్ చేసుకోవచ్చు. గార్డెన్ లో మెక్కలు నాటేస్తే సరిపోదు. వాటికి కావల్సిన సదుపాయాలు సమకూర్చాలి. వాతావరణం, గాలి, వెలుతురు, నీళ్ళు ఇలా అన్ని వనరులు సరిగ్గా ఉన్నప్పుడే గార్డెన్ చక్కగా పెరుగుతుంది. చూడటానికి అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. గార్డెన్ మరింత ఆకర్షనీయంగా కనబడాలంటే గార్డెనింగ్ పాత్ (తోటలో తిరగడానికి మార్గం లేదా దారి) కూడా అందంగా ఏర్పరుచుకుంటే ఆ గార్డెన్ కు అందం రెట్టింపు అవుతుంది. ఆ దారి ఎలా ఉండాలంటే మీ ఇంటికి, తోటలోకి వచ్చే వారికి స్వాగతించే విధంగా ఉండాలి. మీ అతిథులు ఆ మార్గం(దారి) నుండి షికారు చేస్తూ ఆనందించేలా చేయాలి. అందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలున్నాయి.

కాబట్టి గార్డెన్ ను సందర్శించే వారికోసం మీ తోట మార్గాన్ని ఆకట్టుకునేలా కొన్ని మార్గాలు..
ఫ్లోరెల్ గార్డెన్ పాత్: ఫ్లోరెల్ గార్డెన్ పాత్ ఎలా ఉండాలంటే ప్లోరల్ మొక్కలైన లావెండర్, గులాబీ, లేదా బంతి పువ్వుల మొక్కలను ఈ పాత్ కు రెండు వైపులా నాటుండాలి. అప్పుడే ఈ ఫ్లోరెల్ పాత్ చూడటానికి అందంగా పూల మొక్కల మద్య ఆకర్షనీయంగా కనబడుతుంది. ప్లోరెల్ గార్డెన్ పాత్ మీద నడుస్తుంటే రెండు ప్రక్కల ఆకర్షణీయమైన మరియు రంగురంగుల పువ్వులు దారి పొడవునా స్వాగతిస్తాయి. ప్లోరెల్ గార్డెన్ పాత్ మీ గార్డెన్ పాత్ అలంకరించడానికి అతి ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి. లావెండర్, గులబీ, బంతి పూల మొక్కల మద్యలో అక్కడక్కడా రెండు మూడు రకాల పూల మొక్కలను నాటుకోవాలి. లావెండర్, మల్లెచెట్టు లేదా తెలుపు మరియు ఎరుపు గులబీ కాంబినేషన్ ఇలా సెట్ చేసుకొంటే ప్లోరెల్ గార్డెన్ పాత్ మరింత అందంగా కనిపిస్తుంది.
పెబ్బల్స్(గుళకరాళ్ళు) : రెండో ఆకర్షణీయమైన గార్డెన్ పాత్ గుళకరాళ్ళతో దారి అలంకరించడం. ఇలా చేయడం చాలా సులభమైన పని. అందం కూడా. ఓవెల్ షేప్ లో ఉన్నగుళకరాళ్ళును తీసుకొన్ని గార్డెన్ మార్గం గుండా పరచినట్లైతే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ గుళకరాళ్ళను అలంకరించడం కూడా పాము వెళుతుంటే ఎలా ఉంటుందే ఆ నమూనా ప్రకారం గుళకరాళ్ళను అమర్చి చూడండి. అలా వద్దనుకొంటే మరో విధంగా ప్రయత్నించి చూడండి. సాధారణంగా గార్డెన్ పాత్ లోనే గుళకరాళ్లు అమర్చుకొండి. అది కూడా సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. ఇది చూడటానికి పాతకాలపు గుర్తులను తలపిస్తుంది.
స్టెప్పింగ్ స్టోన్స్: గార్డెన్ మార్గానికి మాత్రమే తయారు చేసేటటువంటి స్టోన్స్ ఫ్లాట్ రాళ్ళు లేదా పలకలను ఒక్క ఒక్క దానికి ఒక్కో అడుగు దూరంలో అమర్చుకొంటే ఇవి కూడా గార్డెన్ కు ఆకర్షణగానే నిలుస్తాయి. కొంచెం మోడ్రన్ గా కావాలనుకొంటే ఆ రెండింటి రాళ్ళ మూలల మధ్య క్లాసిక్ ఇటులకును జత చేసుకోవచ్చు. వాటికోసం మీరు తాబేలు లేదా పూలా ఆకారంలో ఉన్న టైల్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.
మొజాయిట్ టైల్స్: గార్డెన్ రహదారిని మొజాయిక్ టైల్స్ తో అమర్చినట్లైతే అందంతో పాటు వీటి వెల కూడా తక్కువగానే ఉంటుంది. సౌకర్యవంతంగాను ఉంటుంది. టైల్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో గార్డెన్ పాత్ కూ మీకు నచ్చినవి ఎంపిక చేసుకొని అందంగా అలంకరించుకోవచ్చు. పెబ్బల్ టైల్స్ మొజాయిక్ చాలా ఆకర్షనీయంగా కనబడుతాయి.
రాతి లేదా ఇటుకలతో గార్డెన్ పాత్: ఇంట్లో నుండి గార్డెన్ లో వెళ్ళడానికి రాళ్ళు లేదా ఇటుకలతో మార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నా చాలా క్లాస్ గా కనిపిస్తుంది.
కాబట్టి మీ గార్డెన్ పాత్ ను అలంకరించే ముందు అందుకు తగ్గ వాతావరణం, స్థలం ఇంటి అందం కూడా దృష్టిలో పెట్టుకొని ఆకృతికి తగ్గ అలంకరణతో గార్డెన్ ముస్తాబు చేయండి.



Click it and Unblock the Notifications
