Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
పూల మొక్కలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా తాజాదనం..

ఎరువుల మోతాదును చూసుకోవాలి. తోటలోని కాలిబాటలు, పూలమడుగులు గ్రీన్ హౌస్ లను శుభ్రం చేయడం, ఎండిన పువ్వుల్ని, ఆకుల్ని, కొమ్మల్ని, కలుపు మొక్కల్ని ఏరివేయాలి. కంచెలు, బార్డర్లు చక్కగా కత్తిరించాలి. తోటలోని ప్రతిమూలను రోజూ పరిశీలించాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని గమనించాలి. ఆకులపై చీడపీడలు ఉన్నప్పుడు వాటిని కత్తిరించడం, ఆ మొక్కలపై వాటిపై తగిన మోతాదుల్లో మందుల్ని చల్లి కాపాడాలి.మొక్కలకు ఎక్కువ ఎండ, నీడ తగలకుండా సరైన మోతాదుల్లో ఎండ ఉండేవిధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైతే చుట్టూ కంచెను ఏర్పాటుచేసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇష్టమైన మొక్కలను పెంచుకోవచ్చు.
పూలమొక్కలను పెంచుకోవడం వల్ల తాజాపూలతో ఇంటిని అలంకరించుకోవాలని, పూజకు ఉపయోగపడుతాయని చాలా మందికి ఉంటుంది. కాకపోతే పూవులు అలంకరించిన కొద్ది గంటలకే వాడిపోయినట్లు కనిపిస్తాయి. అలా కాకుండా తాజాగా ఎక్కువ సేపు ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పువ్వులు సాయంత్రం పూటే కోసి అలంకరించుకొంటే తాజాగా ఉంటాయి. పువ్వులు కోయగానే నీటిలో ఉంచాలి. కాడలను మంచి నీటిలో ఉంచిన తర్వాతనే కత్తిరించాలి. అలా చేస్తే పువ్వులు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పూలమొక్కలతో ఇంటిఆవరణంలో అందంతోపాటు, ఇంటిలోపల పువ్వుల అలంకరణ చక్కని శోభనిస్తుంది.



Click it and Unblock the Notifications
