Latest Updates
-
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్! -
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు
కరివేపాకని తీసి పడేయకండి..పెంచుకుంటే ఔషగుణాలెన్నో...
కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. సువాసన గల చిన్న వృక్షం. 4 నుండి 6 మీటర్ల ఎత్తు ఉండే ఈ చెట్టు ఆకులు సువాసన కలిగి ఉంటాయి . అందంగా, గుబురుగా, దృఢమైన సన్నని కాండంతో, శాఖలతో అలరారుతూ వుంటుంది. వీటి గింజలు (సీడ్స్) విష పదార్ధము కలిగి ఉంటుంది . ఎక్కువగా ఇండియా , శ్రీలంక లలో కనిపిస్తుంది . కూర , చారు , పులుసు వంటకాలలో సువాసనకోసం వాడుతారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే.
కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. చేదు అని కాకరని, వాసన అని ముల్లంగిని త్రోసిపుచ్చినా కరివేపాకుని వాడని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు కదా! కరివేపాకు వేసిన కూరలు కమ్మదనాన్నే కాక సువాసనని కూడ చేర్చి నోరూరింప చేస్తాయి. పెరటిలో బద్దకించక కరివేపాకు మొక్కని నాటుకుంటే అవసరమైనప్పుడంతా తాజా కరివేపాకును వాడే భాగ్యానికి నోచుకోవచ్చు. కరివేపాకు చెట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతంది. వాతవరణం 65డిగ్రీ సెంటీగ్రేడ్ లో చాలా త్వరగా పెరగుతుంది. ఈ చెట్టు విత్తనాలు నాటడం వల్ల లేదా కాండం నుండి పెరుగుతుంది. అయితే చెట్టు పెరగడానికి సరైన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. మీ గార్డెన్ లో కరివేపాకు చెట్టును పెంచుకోవాలనుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలు...

1. పెరట్లో ఈ మొక్కను నాటాలి: కరివేపాకు చెట్టుకు సూర్య రశ్మి అవసరం అవుతుంది. కాబట్టి ఈ మొక్క అవుట్ డోర్ లో పెరగడమే మంచిది. మీరు కను అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నట్లైతే, డైరెక్ట్ గా సూర్య రశ్మి పడేచోటును ఎంపిక చేసుకోవాలి. అయితే వేసవి కాలంలో మాత్రం అధికంగా ఎండతగలకుండా చెట్టును కాపాడుకోవాలి.
2. విత్తనాల నుండి మొలుస్తుంది: కరివేపాకు మొక్క మొదట విత్తనాల నుండి మొలుస్తుంది. పండిన గింజలు 20డిగ్రీ సెంటీగ్రేడ్ లో మొలకెత్తుట అవసరం. విత్తనాలను ఉపయోగించేటప్పుడు, అవి పెరగడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుందని గుర్తుంచుకోవాలి.
3. కాండం మొక్క: కరివేపాకు చెట్టును పెంచుకోవడానికి సులభ పద్దతి కాండం కట్ చేసి నాటుకోవడం. అయితే అది చాలా హార్డ్ గా లేకుండా చెక్కఏర్పడకుండా పక్వత దశలో ఉన్న కొమ్మని కట్ చేసుకోవాలి. ఈ కాండాన్ని కొన్ని సెంటీమీటర్ల లోతు వరకూ ఈ కొమ్మను నాటాల్సి ఉంటుంది.
4. రెగ్యులర్ గా ట్రిమ్ చేయాలి: వేగంగా..గుబురుగా పెరగడానికి తరచూ ట్రిమ్ చేస్తుండాలి. కరివేపాకు చెట్టు పెంచడానికి రసాయనాల వాడకం కంటే సహజ పద్దతులను ఉపయోగించడం చాలా అవసరం. ట్రిమ్మింగ్ సరిగా చేయన్నట్లైతే సరిగా పెరగదు.
5. కీటక నివారణ: సాధారణంగా కరివేపాకు చెట్టు పెరిగే కొద్ది ప్రారంభ దశలో ఆకులను తీసేస్తుండాలి. లేదంటే ఆకుల మీద తెగుళ్ళు ఆందోళన కలిగిస్తుంది. తెగుళ్ళ నివారణకు రసాయన పురుగుల మందులు వాడకం కంటే సహజ పద్దతలు పాటించడం ఉత్తమం. రెండు వారాలకొకసారి కరివేపాకు చెట్టు మీద ఉప్పు నీటిని చల్లకోవటం ఒక మంచి ఆలోచన.
6. నీళ్ళు : కరివేపకు చెట్టు బాగా వృద్ధి చెందాలంటే ఎక్కువగా ఖాళీ నేలను ఇష్టపడుతుంది. కాబట్టి, పొడినేలను అంటే నీరు పోసిన ప్రతి సారి త్వరగా ఇంకిపోయేటటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి. కరివేపాకు చెట్టుకు వేసవిలో నీరు పట్టడం చాలా ముఖ్య విషయం. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతమ వల్ల మట్టి చాలా త్వరగా ఎండిపోతుంది.
7. ఎరువులు: ఎరవుల విషయంలో కరివేపాకు మొక్కలకు బయోఫెర్టిలైజర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మొక్కలకు రెగ్యులర్ గా ఎరువులను వేయడం చాలా ముఖ్యం. చిన్న మొక్కలకు ఎరువులను తక్కువగా ఉపయోగించడాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం.



Click it and Unblock the Notifications