Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
వింటర్లో సేంద్రీయపద్దతిలో కూరగాయలను పెంచడం ఎలా
శీతాకాలంలో క్యారెట్లు,ఆస్పరాగస్,మొలకలు,బచ్చలికూర,పాలకూర,ఉల్లిపాయలు వంటి కూరగాయలను పెంచవచ్చు. నేలలో పెరిగేందుకు లేదా అభివృద్ధికి తక్కువ సూర్యకాంతి అవసరం అవుతుంది. ఈ మొక్కలను వర్షాకాలం ముగింపు సమయం మరియు శీతాకాలంలో నాటతారు. ఈ మొక్కలను మీ తోట లేదా పెరటిలో పెంచవచ్చు.
వ్యవసాయ పద్ధతులలో కృత్రిమ లేదా రసాయన ఆధారంగా ఏమీ ఉపయోగించకుండా చేసే సేద్యంను సేంద్రీయ సేద్యం అని అంటారు. పంట మార్పిడి వంటి సహజ మరియు పర్యావరణం అనుకూలమైన వ్యవసాయ పద్ధతులు,సహజ ఎరువులు మరియు అదనంగా ఏదైనా కృత్రిమ అభివృద్ధిని తప్పించటం చేయాలి. ఈ రోజుల్లో ప్రజలకు పర్యావరణం మరియు ఆరోగ్యం మీద అవగాహన పెరుగుతున్నది. అందువలన సేంద్రీయ వ్యవసాయంనకు డిమాండ్ చాలా పెరిగింది. ప్రజలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి సేంద్రీయ ఆహారం మీద మొగ్గుచూపుతున్నారు.

శీతాకాలంలో కూరగాయలను కూడా సేంద్రీయ సేద్యం ఉపయోగించి పెంచవచ్చు.సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా సులభం మరియు చిన్న మరియు పెద్ద ప్రదేశాలలో చేయవచ్చు. శీతాకాలంలో సేంద్రీయంగా కూరగాయలను పెంచటానికి కొన్ని చిట్కాలు వివరించబడ్డాయి: -
1. సరైన మరియు ఎంపిక చేసిన పంటలను ఉపయోగించాలి
శీతాకాలాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ భాగంలోనూ భిన్నంగా ఉంటాయి. శీతాకాలాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రత తక్కువగాను మరియు కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రమైనవిగా ఉండవచ్చు. అందువలన,శీతాకాలంలో సేంద్రీయంగా పెరిగే కూరగాయలను ఎంచుకోవాలి. కూరగాయలు పండించే ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను మీరు తనిఖీ చేయాలి. ప్రతి కూరగాయ వేర్వేరు ఉష్ణోగ్రతను తట్టుకొంటాయి. ఉదాహరణకు ఉల్లిపాయల ఉష్ణోగ్రతలు చూస్తే చాలా స్థితిస్థాపకంగా మరియు -18 డిగ్రీల సెల్సియస్ ఉండే వాతావరణంను భరించలేవు.
2. రొటేషన్ విధానం ఉపయోగించాలి
సేంద్రీయ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పద్దతి ఏమిటంటే కూరగాయలు మరియు పంటలను రొటేషన్ విధానంలో పండించాలి. ఒకే కూరగాయను మళ్లీ మళ్లీ నాటినప్పుడు నేలలో పోషకాలు కోల్పోతాయి. అలాగే, కూరగాయలను మార్చడం వలన తెగుళ్ళ నష్టాన్ని నిరోధించవచ్చు.మీరు ప్రతి సీజన్ లో వేర్వేరు పంటలను ఖచ్చితంగా ఉపయోగించాలి.
3. అడ్డంకులను తయారుచేయాలి
శీతాకాలంలో కూరగాయలకు కఠినమైన మరియు పొడి గాలులు నుండి రక్షణ అవసరం. గాలి దిశను మార్చటానికి చెట్ల వంటి సహజ అడ్డంకులను వినియోగించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల మొక్కలకు పొదలు మరియు ఇళ్ళ యొక్క గోడలు ఒక అవరోధం వలె పనిచేస్తాయి. అయితే అవరోధం మాత్రమే పొడి గాలులను నిరోధిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో కనీస సూర్యకాంతి అందుబాటులో ఉండాలి.
4. సహజ ఎరువులను ఉపయోగించాలి
సేంద్రీయ సేద్యంలో సహజ ఎరువులు,పురుగుల నాశకాలు మరియు పురుగుమందులను ఉపయోగిస్తారు. సేంద్రీయ సేద్యంలో రసాయనిక ఆధారిత పురుగుమందులు మరియు ఎరువులను ఉపయోగించుట వలన నేలకు హాని మరియు అది త్వరగా దాని పోషకాలను కోల్పోతుంది. అందువలన,శీతాకాలంలో కూరగాయలను సేంద్రీయ సేద్యం పద్ధతులను ఉపయోగించి పెంచాలి. అందువలన మిగిలిపోయిన ఆహారం మరియు పశుగ్రాసం,జంతు మరియు మానవ మలం,ఇతర మొక్కల యొక్క పంట వ్యర్థాల వంటి సహజ ఎరువులను ఖచ్చితంగా ఉపయోగించాలి.ఈ ఎరువులు పర్యావరణంపై ఏటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపవు. అంతేకాక మొక్కల కొరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా,విష రసాయనాలకు బదులుగా ఇతర సహజ రసాయనాలు మరియు పురుగుల నాశకాలు వాడాలి.
5. రక్షణ పూత మరియు కంపోస్ట్
సేంద్రీయ వ్యవసాయంలో రక్షణ పూత మరియు పచ్చిఎరువు అనే రెండు పద్ధతులు ఉన్నాయి. రక్షణ పూత పద్దతిలో ఆకుపచ్చ ఆకులకు పలుచని పొర ఉంటుంది. పంటలను వేసే ముందు కూరగాయ వ్యర్థాలు మరియు మట్టి వేస్తారు. ఇది మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మ జీవులను పెంచుతుంది. శీతాకాలంలో పంటను వెచ్చగా ఉంచుతుంది. అంతేకాక కలుపు మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. అదే విధంగా, మొక్క పెరుగుదల కొరకు పచ్చిఎరువు ఉపయోగించి సేంద్రీయ సేద్యం చేయటం ఆవశ్యకమైనది. కంపోస్ట్ అనేది మొక్కల వ్యర్థాలు,జంతు పేడ మరియు ఇతర సేంద్రీయ పదార్దాల నుంచి తయారుచేసిన ఒక సహజ ఎరువుగా ఉంది.
శీతాకాలంలో సేంద్రీయంగా కూరగాయలను పెంచటానికి ఈవిధంగా కొన్ని చిట్కాలు ఉన్నాయి.సేంద్రీయ ఆహార సంప్రదాయ సాగులో ఆహారం ఎక్కువ పోషకాలు మరియు రుచి కలిగి ఉంటుంది. శీతాకాలంలో మీ పెరటి తోటకు ఈ చిట్కాలను ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
