మన ఇంటి గార్డెన్ లో పెంచుకోదగ్గ టాప్ 10 గార్డెన్ మొక్కలు..!

మన దేశంలో ఉన్న వివిధ రకాల సంస్కృతుల్లాగే మొక్కలు కూడా అన్ని రకాలున్నాయి. మన దేశంలో కొన్ని మొక్కలను పవిత్రంగా భావిస్తారు. ఉదాహరణకు తులసి మొక్క హిందువులకు అతి పవిత్రమైనదిగా భావిస్తారు. మనగార్డెల్లో పెంచుకోవడానికి వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. అందుకు కాస్త ఓపిక...ఇష్టం ఉంటే చాలు. మనిషి రిలాక్స్ అవ్వాలంటే కొన్ని కష్టమైన పనులను కూడా అప్పుడప్పుడూ చేస్తుండాలి. శరీరానికి కష్టం తలగకుండా ఉన్న చోటనే పనులను చక్కబెట్టుకుంటారు. మనలో చాలా మంది చాలా సులభమైన పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. అది వారి హాబీ కూడా.. అయితే వాటితో ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది.

ఇంట్లో ఉండే వారికి మరీ బోర్ కొట్టకుండా ఉండాలంటే... మొక్క పెంచడంతో వారి మనస్సుకు ప్రశాంతతతో పాటు, శరీరానికి వ్యాయమం, ఇంటికి అందం చేకూరుతుంది. గార్డెన్‌లో పెంచే మొక్కలను పెంచడం కొంచెం కష్టమైన పనే అయినా, ఇంటిలోపల పెంచుకొనే మొక్కలు మెయింటెనెన్స్ సులభమే. అంతే కాదు ఇంటి అందం. ఇంట్లో వారికి ఆరోగ్యకరం. ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. కొంత మందికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా, సమయం లేక గార్డెనింగ్ మొక్కల జోలికి పోకుండానే గడుపేస్తుంటారు. అయితే ఎక్కడైన అందమైన మొక్కలు చూసినప్పుడు మన ఇంట్లో కూడా అలాంటి మొక్కలుంటే ఎంత బాగుండు అనుకుంటారు. అలాంటి వారి కోసం... కొన్ని సులభంగా పెంచుకొనే గార్డెన్ మొక్కలు.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

తులసి: మన ఇండియాలో సాంప్రదాబద్దంగా మన ఇళ్ళల్లో పెంచుకొనే మొక్క తులసి. పవిత్రతకు మారుపేరు ఈ తులసి మొక్క. ఈ మొక్కను మన ఇంటి ఆవరణంలో గార్డెన్ లో అతిసులభంగా పెంచుకోవచ్చు . ఈ మొక్కకు అధికంగా నీరు పట్టాల్సి ఉంటుంది. ఈ మొక్కలకు డైరెక్ట్ సన్ లైట్ పట్టకపోయినా వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

బంతి పూలు: కలర్ ఫుల్ గా ఉండే ఈ బంతి పూలను మనం నిత్యం పూజలు, కొన్ని కార్యక్రమాల్లో విరివిగా ఉపయోగిస్తాం. ఈ మొక్కలకు మంచి ఎరువు ఉంటే చాలు, ఎటువంటి రసాయనాలు అవసరం లేదు మన గార్డెన్ లో బాగా పెరుగుతాయి. అంతే కాదు సూర్య కాంతిలో మిరుట్లుగొలుపుతుంటాయి.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

మనీ ప్లాంట్: అతి సులభంగా మన ఇంట్లో పెరిగే మొక్క. మనీ ప్లాంట్ ను నీటిలోనూ లేదా మట్టిలో రెండింటిలో పెరుగుతుంది.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

మందారం: ఇండియాలో చాలా విరివిగా చాలా మంది ఇళ్ళల్లో పెంచుకొనే మొక్క. వివిధ రంగుల్లో ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్కకు రెండు రోజులకొకసారి నీరు అవసరం ఉంటుంది. అంతే కాదు సూర్య రశ్మి కూడా అవసరమే.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

గులాబీ: విటర్ సీజన్ లో ఎక్కువగా పూచే ఈ గులాబీ మొక్కలు సమ్మర్ చివర నుండి బాగా పెరుగుతాయి. మరియు పువ్వు కాయడానికి వింటర్ బెస్ట్ సీజన్. అంతే కాదు గులాబీ మొక్కలను పెంచుకోవడం అంటే చాలా మంది ఇష్టం. మరి ఈ మొక్కలను మీ గార్డెన్ లో నాటుకొని వింటర్ లో గార్డెన్ లో కొత్తకలను మెరిపించండి.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

నైట్ జాస్మిన్: మల్లె పూలంటే చాలా మందికి ఇష్టం. నైట్ జాస్మిన్ లో సువాసన ఎక్కువ. దీనికి తగినంత సూర్య రశ్మి మరియు నీరు పడితే చాలు బాగా పెరుగుతాయి.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

అరటి : గార్డెలో ఈ అరటిని మొక్కలు పెంచుకోవడం వల్ల గార్డెన్ కు ఓ కొత్త అందం వస్తుంది. ఈ అరటి మొక్కలు కూడా అందమైన ఆకారాల్లో పెరుగుతాయి.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

బోగన్ విలియా: తెలుగులో కాగితాలపూలు అంటారు. ఇవి గోడలకు అల్లుకొని లేదా గేట్లు వద్ద ఎక్కువగా పెరుగాయి. ఈ మొక్కలను అధిక నీరు ఎక్కువ నిర్వాహణ బాధ్యతలు అవసరం లేదు. ఎక్కువగా అల్లుకొనే తీగలతో పెరుగుతుంది కాబట్టి అప్పుడప్పు వీటిని కట్ చేస్తూ ఉండాలి. ఈ మొక్కల్లో వివిధ కలర్స్ లో పువ్వులుండి ఇంటి గార్డెన్ మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. గార్డె మాత్రమే కాదు ఇంటి ఆవరణమే మెరుస్తుంటుంది.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

ప్రొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్): సన్ ఫ్లవర్ ఒక ఐడియల్ గార్డె ప్లాంట్. ఈ మొక్కలకు తగినంత నీరు పడితే సరిపోతుంది. ఎక్కువగా నీరు పోయకూడదు . ఈ మొక్కలకు కాండం చాలా వీక్ గా ఉండటం వల్ల ఈ మొక్కలకు సపోర్ట్ చాలా అవసరం.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

పెర్న్(అడవి మొక్క): ఇండియాలో వెచ్చని వాతావరణం ఇటువంటి మొక్కలు సులభంగా పెరగడానికి సహాయపడుతుంది. అడవి మొక్కలైనా ఇంటి గార్డెన్ లో అందాన్ని పెంపొదిస్తాయి.

ఈ టాప్ 10 గార్డెన్ మొక్కలు..మీ గార్డెన్ లో ఉన్నాయా..?

తామర: తామర పువ్వు మొక్కలు మన ఇండియాలో ఎక్కువగా కనబడుతాయి. చాలా వరకూ కొలనులో అధికంగా ఉంటాయి. తామర పువ్వులను పూజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి మీ గార్డెన్ పూల్ ల్లో ఇటువంటి అందమైన మొక్క ఒకటి ఉంటే చాలు.

Story first published: Monday, April 1, 2013, 16:15 [IST]
Desktop Bottom Promotion