Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
కుండీలో పెరిగే 10 రకాల బ్యూటిఫుల్ మొక్కలు!
మీకు పెరడు లేదు కాబట్టి మీరు ఒక అందమైన తోట పె౦చలేరని ఏమీ లేదు. అపార్ట్మెంట్ లు లేదా నేల పరిస్థితులు బాగా లేని చోట్ల ఉండేవాళ్లకు కుండీలలో తోటలు పెంచడం సరైన పరిష్కారం. కుండీలు యే శైలికైనా నప్పే చాలా రంగులు, రూపాల్లో, పదార్ధాలు, సైజుల్లో లభిస్తాయి. పూలకు, కూరలకు, మూలికలకు వేర్వేరు తోటలు పెంచండి లేదా అన్నిటినీ కలిపి ఒక కొత్త శైలిలో పెంచండి.

ఇ౦పేషన్స్:
ఇ౦పేషన్స్ పెంచడం తేలిక కాబట్టి, రకరకాల రంగుల్లో దొరుకుతాయి కాబట్టి ఇవి చాలా ప్రసిద్ది పొందాయి. వీటిని కుండీలలో పెంచేటప్పుడు తోట మట్టిలో కాకుండా, మట్టి తక్కువగా వుండే మిశ్రమంలో పెంచడం మేలు. నిత్యం నీళ్ళు పోసి వారానికి ఒకసారి పోషకాలు ఇవ్వండి.

బెగోనియాస్ :
బెగోనియాస్ మామూలుగా తెలుపు, గులాబి, పసుపు, ఎరుపు వర్ణాల్లో దొరుకుతుంది, కానీ ఆకర్షణీయమైన పూలు, ఆకులు వుండడం వల్ల చాలా రకాల హైబ్రీడ్ లను పెంచుతున్నారు. బెగోనియాస్ ను ఉష్ణ, ఉప ఉష్ణమండల వాతావరనాల్లో ఏడాది పొడవునా బయటే పెంచవచ్చు, అయితే సమశీతోష్ణ వాతావరణాల్లో ఏడాది పొడవునా లేక ఇంటి మొక్కలుగా పెంచుతున్నారు.

బంతిపూలు:
బంతిపూలు విత్తిన నాటి నుంచి 45, 50 రోజులకు పుష్పిస్తాయి. వాటిని మార్చి చివర్లో గానీ, ఏప్రిల్ మొదట్లో గానీ ఇంటి లోపల విత్తి, మంచు తగ్గాక బయట పెట్టండి. మట్టి లో తేమ వుండాలి గానీ తడిగా వుండకూడదు, నిత్యం పుష్పిస్తూ ఉండాలంటే రాలిన పూలు తీసివేయాలి.

కాక్టై:
కాక్టై లోని వివిధ జాతులు పెంచి సృజనాత్మక కుండీల తోటను తయారు చేయండి. తేలిగ్గా నిర్వహించడానికి వీలుండే ఈ మొక్కలు వాటి పెంపకం గురించి తెలియని వారు కూడా చేయవచ్చు.

ఆకుకూరలు:
మీ కుండీ తోటలో ఆకుకూరలు పెంచేటట్లయితే ఎప్పుడూ చేతినిండా తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకోవచ్చు. ఆకుకూరలకు చల్లటి వాతావరణం కావాలి, ఆరు నుంచి ఎనిమిది అంగుళాల లోతైన మట్టి చాలు.

కారట్ లు:
సలాడ్ లు, సూపు లు, రసాలు, కేకులు ఇలా చాలా రకాల వంటకాల్లో కారట్లు వాడతారు. మొక్క వేరు లో వుండే ఈ కూరగాయకు కేవలం 10 అంగుళాల లోతైన మట్టి, పద౦గుళాల విస్తీర్ణం చాలు.

జలపెనో పెప్పర్స్:
కేవలం 2 నుంచి 3½ అంగుళాల సైజ్ వుండే చిన్న రకం మిరపకాయలను జలపెనో పెప్పర్స్ అంటారు, వీటిని పచ్చగా ఉండగానే తినేస్తారు. అప్పుడప్పుడు దీన్ని ఎర్రగా పండేదాకా ఉంచుతారు. ఎలాంటి మిరప రకానికైనా మీకు 16 అంగుళాల లోతైన మట్టి కావాల్సి వస్తుంది.

టమాటో:
పొట్టి రకం టమాటో లకైతే కేవలం 12 అంగుళాల లోతైన మట్టి సరిపోతుంది, సాధారణ రకాలకైతే 24 అంగుళాల లోతైన మట్టి కావాలి. మీకు కావలసిన రకం ఎంచుకుని సలాడ్ లలో వేసుకోండి.

రోజ్ మేరీ
రోజ్ మేరీ ని మిగతా మూలికలతో కలపకుండా విడిగా కుండీలలో ఉంచాలి, ఎందుకంటే నీళ్ళలో వుండే బదులు, నీళ్ళు ఇవ్వడానికి వుండే వ్యవధి లో ఎండడానికి ఈ మొక్క ఇష్టపడుతుంది. ఇది త్వరగా ఎండిపోతుంది కనుక శీతాకాలం లో ఎండ పడే కిటికీ పక్కకి జరిపి పెట్టుకోవచ్చు.

తులసి:
మీ తులసి మొక్కను, ఆకులను నిండా నీటి తో వుంచండి కానీ మంచు పడకుండా చూసుకోండి. ఈ కుండీ మొక్కకు దండిగా గాలి కావాలి.



Click it and Unblock the Notifications
