Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పండుగ తర్వాత పరిశుభ్రతలు!

వినాయక చవితి, ఈద్ పండుగలైపోయాయి. వీటితర్వాత ఇల్లు శుభ్రపరచాలంటే, ముందుగా ఎండిన పూలు, పత్రి మొదలైన పూజ సామాగ్రిని ఇతర పారవేయవలసిన వాటిని ఒక కవరులో వుంచండి. అలంకరణ లైట్లు జాగ్రత్తగా తీసి దాచి పెట్టండి. మిగిలిన తిండి పదార్ధాలను పారవేయటానికిగాను ప్రత్యేకించి ఒకచోట పెట్టి దుర్వాసన లేకుండా చూడండి. గిన్నెలను సబ్బు కలిపిన వేడినీటిలో నానపెట్టండి. తర్వాత శుభ్రం చేయటం తేలిక అవుతుంది.
లివింగ్ రూమ్, పూజా రూమ్ పరిశుభ్రత - పూజకు ఉపయోగించిన పూలను ఇతర అలంకరణలు తీసివేయండి. దీపాలలో వున్న ఆయిల్ ను పేపర్ టవల్ తో శుభ్రం చేసి అపుడు కడగండి. దేముడి ఫొటోలను మెత్తటి గుడ్డతో శుభ్రం చేయండి. తడిగుడ్డతో మంటపాన్ని లేదా పూజాగదిని తుడవండి.
డైనింగ్ గది శుభ్రత -
డైనింగ్ టేబుల్ గుడ్డ, నేప్ కిన్స్, ఫుట్ రగ్గులు మెషీన్ లో శుభ్రం చేయండి. కట్లరీ సింక్ లో వేయండి. మిగిలిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేయండి. టేబుల్ క్లాత్ కు మరకలైతే టాల్కం పౌడర్ వేయండి. తర్వాత నీటితో కడగండి. సింక్ లో పడవేసిన వస్తువులు నానితే తొందరగా శుభ్రమవుతాయి. అన్ని కడిగి శుభ్రం చేసి ఒకచోట బోర్లించండి.
కిచెన్ పరిశుభ్రం ఎలా చేయాలి-
మిగిలిపోయి మరల తినదగిన ఐటమ్ లు రిఫ్రిజిరేటర్ లో నిలువ వుంచండి. కూరల తొక్కలు, ఇతర ముక్కలు మొక్కలకు ఎరువుగా వేయండి. మిగిలిన బ్రెడ్ ముక్కలు వేయించి మళ్ళీ తినేందుకు సిద్ధం చేయవచ్చు. తరిగిన కూరలు మిగిలితే ఉడికించి గాలి చొరని డబ్బాలో వుంచండి. చెత్తనంతా ఒకచోట చేర్చి ఒక పెద్ద సంచిలో పడవేసి చెత్తకుప్ప వద్ద పెట్టండి. లేదా దానిని సేకరించటానికి వచ్చే వారికి అనువుగా ఒక ప్రదేశంలో వుంచండి. ఇంటిలో ఏదైనా ఒక పండుగ లేదా వేడుక అయిన తర్వాత ఇంటి పరిశుభ్రతకై చేయవలసిన చర్యలలో పైన చెప్పబడినవి ప్రధానమైనవి. ఆచరించి ఆనందించండి.



Click it and Unblock the Notifications
