Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
క్రిస్టమస్ పండుగ ఏర్పాట్లు ఎలా?

ఇంటిలో అప్పటివరకు దుమ్ములు పట్టి పేరుకుపోయిన అనవసర వస్తువులను తొలగించండి. కావలసినంత స్ధలం వస్తుంది. ఇక క్రిస్టమస్ చెట్టు, ఊయల, పూలదండలు వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలంకరణలో ప్రధానంగా క్రిస్టమస్ ట్రీ ఎక్కడ పెట్టాలి ఇతర పరికరాలు ఎక్కడ పెట్టాలనేది ముందుగా ఒక స్కెచ్ వేసి నిర్ణయించుకోండి. పుష్ప గుచ్ఛాలను పెట్టటానికి గాను రెండు లేదా మూడు మీటర్ల తెల్లటి శాటిన్ గుడ్డను కొనండి. గుడ్డ నీలం రంగు లేదా ఆకుపచ్చ పెట్టినా బాగుంటుంది.
ఇక ఇంటికి వచ్చే అతిధులకు ఏ రకమైన ఆహారాలు తయారు చేయాలో నిర్ణయించుకోండి. కేకులు, కుకీలు పానీయాలు మొదలైనవి ఒకటి లేదా రెండు రోజుల ముందే తయారు చేసుకోండి. మాంసాహారం అదే రోజు వండుకోవాలి. మీరు ఏర్పాటు చేయాలనుకున్న అలంకరణ వస్తువులు ఊయలలో ముందుగానే వుంచుకోండి. క్రిస్టమస్ ట్రీ కి లైట్లు, మీ చేతి వ్రాతతో గల కొటేషన్లను పెడితే బాగుంటుంది. లేదా మీ కుటుంబ సభ్యుల ఫొటోలు చెట్టుకు వేలాడదీసినా చూచేవారికి వినూత్నంగా కనపడుతుంది. క్రిస్టమస్ పండుగ ఏర్పాట్లు అంటే, ఇంటి అలంకరణే కాక, ఇతర విందు వినోద ఖర్చులు కూడా వుంటాయి. కనుక ముందుగా మీరు ఏ వస్తువులు కొనాలనుకుంటున్నారు అనే ప్రాతిపదికపై ప్రాధాన్యతలతో కూడిన వ్యయ పట్టికను సిద్ధం చేయండి.



Click it and Unblock the Notifications
