Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫ్యాషన్ జువెలరీ బాక్స్ తయారు చేసుకోండిలా

అటువంటి ఆభరణాల ధరలు అంభరాన్ని అంటుతున్న ఈ సమయంలో ఉన్న ఆభరణాలను జాగ్రత్త పరుచుకొని, ఫ్యాన్సీ ఆభరణాలపై మొగ్గుచూపుతున్నారు ఈ తరం అమ్మాయిలు. వాటి స్థానంలో గిల్ట్ నగలు, ఫ్యాన్సీ ఆభరణాలు, గోల్డ్ ప్లేటెడ్, సిల్వర్ క్లాడ్, ప్లాటినం క్లాడ్, మెటాలీక్ ఆభరణాలు, చెక్కతో చేసిన ఆభరణాలు, బాగా ప్రాపరుచుర్యం పొందుతున్నాయి. వీటికంతా ఎంతో ఖరీదు పెట్టి శ్రద్దగా కొనే వస్తులల్లో చెప్పుకోదగ్గవి, చెవులకు, చేతులకు సంబంధించినవే.
ఎంతో ఖరీదుపెట్టి కొన్న కర్ణాభరణాలు ఒకేచోట గుట్టలాగా పడేస్తే చిక్కుపడి పాడవుతుంటాయి. లోహంతో చేసినవయితే వన్నె తగ్గిపోయి చూసేందుకు అంతగా బాగుండవు. తర్వాత అలా ఎక్కడంటే అక్కడ వేసేయడం వల్ల అవసరమైనప్పుడు దొరకు. దొరికీ కొన్ని బాగుండక, కలర్ తగ్గిపోవడం, వాటి మూతలు లేకుండా ఉండటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ గ్లర్స్ వినియోగించి రకరకాల డిజైన్లు కలిగి వుండటం వల్ల వాటిని వేరు చేసేందుకు, వెతుక్కునేందుకు చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
మందపాటి అట్టను తీసుకొని నచ్చిన ఆకృతిలో కత్తిరించాలి. దానిపై మెత్తని వస్త్రాన్ని అదే సైజులో ఉంచి అతికించాలి. అలాగే దానికి అంచులు కుట్టినా సరిపోతుంది. ఇప్పుడు వీటికి కాస్త పెద్దసైజులో ఉన్న చొక్కా గుండీలను జిగురుతో అతికించాలి. ఇప్పుడు ష్యాన్సీ ఐటమ్స్, చెవులుకు అలంకరించుకొనేటటువంటివి ఈ గుండీలకు గుచ్చితే సరిపోతుంది. ఇలా చేస్తే వాటిని ఏ సమయంలోనైనా తీసుకునేందుకు అనువుగా ఉంటుంది. ఈ అట్టకు పెద్ద కవరు చుడితే, దుమ్ముపేరుకోకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా తీసి వాడుకోవచ్చు.
లేదా ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ లో బాక్స్ కు సరిపోయే విధంగా అట్టలను రెండు, మూడు కట్ చేసుకొని ఆ అట్టపైన చిన్న చిన్న అరలుగా తయారు చేసుకోవాలి. ఈ అట్టలపై తెల్లటి లేదా ఎర్రటి వస్త్రం పరిచి గమ్ తో అతికించాలి. తర్వాత ఈ అట్టలను ట్రేలులాగా బాక్స్ లో అమర్చుకోవాలి. ఇప్పుడు మీ ఫ్యాన్సీ ఆభరణాలన్నీ అట్టతో తయారు చేసిన ట్రేలల్లో ఒక్కో ట్రేలో ఒకటి పెట్టుకొంటే వెతుకొనే పనిలేకుండా అవసరం అయినప్పుడు వెంటనే తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications