Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
ఎర్రని వైన్ మరకలు తొలగించే విధానం...!
విందు భోజనం ఏర్పాటు చేసే వారు, రెడ్ వైన్ ఇష్టపడేవారు ఏదో ఒక సందర్భంలో వైన్ వొలకడం అనే పరిస్థిని ఎదుర్కోవాల్సిందే. ఆ దుర్మార్గపు ద్రవం మీ బామ్మ గారి పాత తెల్లని టేబుల్ క్లాత్ నో లేక మీ తెల్లటి సోఫా మీదనో పడితే, ఖచ్చితంగా మరకలు తొలగించే విధానం కలిగి ఉండాల్సిన అవసరం చాలా వుంది. మరకలకు ఒక్కో రకం వస్త్రం ఒక్కోలా ప్రతిస్పందిస్తాయి కనుక మరకలు తొలగించే ఏ విధానం కూడా నూరు శాతం హామీతో రెడ్ వైన్ మరకలను తొలగించలేదు. ఐతే వెంటనే ప్రతిస్పందించడం, ఏ పదార్ధాలు వాడితే మరకలు పోతాయో తెలిసి వుండడం వల్ల మీ సోఫా శుభ్రం అవుతుంది.
ఫాబ్రిక్ పరీక్ష హెచ్చరిక: మీ మెత్తటి సోఫా మీద ఏ శుభ్రం చేసే పదార్ధాన్ని వాడినా, ముందు ఫాబ్రిక్ పరీక్ష నిర్వహించండి. ఆ సోఫా కవర్ లోని ఒక చిన్న పైకి కనబడని ప్రాంతంలో ఈ పదార్ధాన్ని పరీక్షించండి - దాని వల్ల మీరు వాడే పదార్ధం సోఫా మొత్తాన్ని రంగు పోగొట్టకుండా వుంటుంది. పరిక్షించాక ఒక రెండు మూడు గంటలు వేచి వుండి సోఫా మీది వేసిన కవర్(వస్త్రం) ఏమీ పాడుకాలేదని, దీర్ఘకాల దుష్ప్రభావాలు ఏమీ లేవని నిర్ధారించుకోండి. ఈ శుభ్రం చేసే ద్రవాల గురించి తయారీదారు ఇచ్చిన సమాచారం చదవండి.

వైట్ వైన్-ఉప్పు : వినడానికి వింతగా వున్నా, మీ వంటగది అరల్లోను, వైన్ ఫ్రిడ్జ్ లోను వుండే వస్తువులు మీ సోఫా మీద పడిన రెడ్ వైన్ మరకలను పోగొట్టడానికి పనికి వస్తాయి. వైట్ వైన్, సాదా ఉప్పు తో రెడ్ వైన్ మరకలను పోగొట్టవచ్చు. ముందు శుభ్రంగా వున్న, తెల్లని కాగితం నాప్కిన్ తో మచ్చను సాధ్యమైనంత వరకు అద్దివేయండి. తరువాత, చల్లటి వైట్ వైన్ లేదా చల్లటి నీళ్ళు మరకలపైన చల్లండి. ఇప్పుడు వైట్ వైన్ కి, మరకకు ఉప్పు అద్దండి. దాన్ని పీల్చుకునేందుకు అలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండనివ్వండి. తరువాత రెండు కప్పుల వేడి నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ సౌమ్యమైన లాండ్రీ డిటర్జెంట్ ను కలిపి మరకలు పడ్డ ప్రాంతాన్ని కడగండి. దాన్ని ఆరనిచ్చి, అవసరమైతే మళ్ళీ చేయండి.
డిష్ బార్(అంట్లు తోమడానికి ఉపయోగించే సబ్బు): ఒక్కోసారి మనం ఆ మరకను వెంటనే చూడక పోవచ్చు, విందు ఇచ్చిన వారు ఆ మరకను మర్నాడు చూడవచ్చు. అలాంటప్పుడు ద్రవ రూపంలో వున్న అంట్ల సబ్బును, చల్లటి నీటిని వాడి ఒక ద్రావకం తయారు చేయాలని గృహాలంకరణ నిపుణులు సూచిస్తున్నారు. రెండు కప్పుల చల్లటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అంట్ల సబ్బును కలిపి, ఒక స్పాంజ్ తో దాన్ని మరక మీద రాయండి. శుభ్రమైన, తెల్లటి కాగితం నాప్కిన్లు లేదా గుడ్డ ముక్కలతో మరక పూర్తిగా పోయే దాకా అద్దండి. వేడి నీటి తో కడిగి ఆరనివ్వండి.
డ్రై క్లీనింగ్ చేసే ద్రావకం: కొన్నిసార్లు సోఫాల మీది మరకలు వంటింటి చిట్కాలకు పని చేయవు. తయారీదారు డ్రై క్లీనింగ్ సూచిస్తే, డ్రై క్లీనింగ్ సాల్వెంట్ నే కొనండి. సాల్వెంట్ లేబుల్ చదివి అది మీ సోఫా మీద వున్న గుడ్డను, రెడ్ వైన్ మరకలను తొలగించగలుగుతుందో లేదో తెలుసుకోండి. లేబుల్ మీద వున్న సూచనల ప్రకారం ఉత్పత్తిని వాడండి.



Click it and Unblock the Notifications
