Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దుస్తులపై తుప్పు మరకలు..ఐరన్ మరకలు పోగటడం ఎలా...!

1. అన్ని రకాల బట్టలను ఒకేవిధంగా ఉతకకూడదు. ఉన్నితో తయారయిన బట్టలను బ్రెష్‌తో రుద్దకూడదు. బండకేసి బాదకూడదు. ఉలెన్ దుస్తులను తాడు లేదా వైర్‌మీద వ్రేలాడదీసి ఆరేసి క్లిప్పులు పెట్టడమన్నది సరైన పద్దతి కాదు. అలాచేసినట్లయితే, వాటి షేపు పాడయి ఊలు దుస్తులు సాగిపోతాయి. నేలను శుభ్రపరిచి వాటిని నేలమీద ఆరేయ్యాలి. ఊలు దుస్తులను పిండకూడదు. అలాగే ఐరన్ వైర్ లేదా ఐరన్ హ్యాంగర్ ల మీద వేలాడదీయ్యడం వల్ల ఐరన్ బట్టలకు అట్టుకొని మరకలవుతాయి. దాంతో చూడటానికి అసహ్యంగా ఉంటుంది.
2. సిక్కా, పాలియస్టర్ బట్టలను పిండకుండా, నీళ్ళ కారిపోయేలా ఉంచి, ఆ తర్వాత వాటిని ముడతలు లేకుండా దులిపి ఆరె య్యాలి., బట్టలను ఐరన్ చేసేటప్పుడు, బట్టల తరహాను బట్టి తగిన ఉష్ణోగ్రతతో చేయాలి. బటన్స్ మీద, ఎలాస్టిక్ మీద ఐరన్ బాక్స్‌ను ఉంచకూడదు.
3. బట్టల మీద ఏర్పడిన మరకలను అశ్రద్ధ చేయకుండా వెంటనే తొలగించాలి. అలా చేయకుంటే అక్కడ నీరు ఎక్కువగా వుండటం వల్ల అవి మురికి అక్కడే నిల్వ ఉండి తెలుపు బట్టలు పసుపు వర్ణంలోనికి మారుతాయి.
4. మాసిన బట్టలను ఇస్త్రీ చేయకూడదు. అలా చేసినట్లయితే, ఆ మురికి బట్టల్లోకి ఇంకి, మురికి పేరుకుపోయి బట్టలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి. రంగు మారి అసహ్యంగా కనబడుతాయి. దుస్తులను ఐరన్ చేసిన తర్వాత కూడా ఐరన్ ముడుతలు అలాగే ఉన్నట్లే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
5. బట్టలు ఆరగానే వాటిని చక్కగా మడత చేసి సర్దుకోవాలి. వాటిని తెచ్చికుప్పగా పడెయ్యకూడదు. అలా చేసే బట్టలు ముడతలు పడి, ధరించటానికి శుభ్రంగా ఉండవు., బట్టలు కొనే విషయంలో ధరించేటప్పుడు, ఉతికే సమయంలో సరైన శ్రద్ధ తీసుకుంటే, ఆ దుస్తుల వల్ల వారి అందం పెరుగుతుంది.
6. బట్టలనుండి ఐరన్ మరకలను వదించుకోవటం కోసం ప్రతి సారి మీరు బట్టలు ఉతికే సమయంలో ఆ నీటిలో వెనిగెర్ కొన్ని చుక్కలు వేసి నానబెట్టి ఉతకాలి. అప్పుడు తెల్లబట్టలు పాతబడినట్లు కలర్ తక్కువై కనిపిస్తుంటాయి. తెలుపు వర్ణం బట్టలు పసుపు వర్ణంలోకి మారుతాయి. అందువల్ల కొన్ని వెనిగర్ చుక్కలు వేసి ఉతకడం లేదా ఉతికిన బట్టలను కొద్దిగా వేడినీళ్లలో వెనిగర్ వేసి నానబెట్టి తర్వాత ఆరబెట్టడం మంచిది.
7. తెలుపు బట్టలు పసుపు రంగులోని మారడానికి కారణం నీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం. కాబట్టి బట్టల్లో తెలుపు వర్ణం తగ్గకుండా ఉండేందుకు, బట్టలను మంచి డిటర్జెంట్ సోప్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక బకెట్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు అలాగే నానబెట్టి తర్వాత ఆరబెట్టాలి.



Click it and Unblock the Notifications