Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
సెంట్ సీసాలో సెంట్ వాసన పోకుండా ఉండాలంటే...?

1. వంటగది అరల్లో వక్కపొడి పలుకులు ఉంచితే బొద్దింకలు రావు. వంటింటి అరలని సర్ధడానికి ముందు బేకింగ్ సోడాని నీళ్లలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది.
2. వెల్లుల్లి వాసనలు పోవాలంటే కొద్దిగా ఉప్పుతో చేతులు కడుక్కోవాలి.
3. ఫ్రింజ్ లో ఉంచిన క్యాండిల్స్, బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి. పెన్సిళ్ళు రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచితే ఉదయాన్నే చెక్కడం సులభం అవుతుంది. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
4. నేతి గిన్నెలో చిన్న బెల్లం ముక్క వేసి వుంచితే నెయ్యి చాలాకాలం తాజాగా ఉంటుంది. పుట్టగొడుగులన్ని పేపర్ బ్యాగులో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
5. సేమ్యాను తరచూ ఎండబెడుతూ ఉంటే తాజాగా ఉంటుంది. అలాగే రవ్వ డబ్బాలో లవంగాలు ఉంచితే పురుగు పట్టవు.
6. పాత సాక్సులను శుభ్రం చేసి అందులో సబ్బు ముక్కల్ని వేసి దానితో వాష్ బేసిన్ శుభ్రం చేయవచ్చు.
7. సెంట్ సీసాను చీరలు ఉన్న ప్రదేశంలో పెడితే వాసనపోదు.
8. డస్ట్ బిన్( చెత్త డబ్బా) అడుగుబాగంలో ఉప్పు చల్లితే దుర్వాసన రాదు.
9. సిరంజి నీడిల్స్ ని గ్యాస్ స్టవ్ బర్నర్స్ క్లీన్ చేయడానికి ఉపయోగింవచ్చు.
10. కొద్దిపాటి నీటిలో కాస్త ఉప్పు వేసి దుస్తులు నానబెడితే రంగులు పోవు. అలాగే బట్టలపై బురద మరక వదలకపోతే చక్కాలుగా తరిగిన బంగాళ దుంప ముక్కతో రుద్ది ఆ తర్వాత ఉతికితే సరి. నూలు వస్త్రాల మీద తుప్పు మరకలు పడితే ఆ ప్రాంతంలో..నిమ్మచెక్కతో రుద్దితే అవి త్వరగా దూరమవుతాయి.
11. ఫ్లవర్ వాజలు నీళ్లతో నిల్వ ఉండటం వల్ల లోపల ఫంగస్ పేరుకుపోతుంది. దాని వల్ల పువ్వులు త్వరగా వాడిపోయే అవకాశం ఉంది అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ వాజులో కొద్దిగా నీళ్లు పోసి అర చెంచా బియ్యం వేసి అటు ఇటూ బాగా తిప్పి కడిగితే శుభ్రపడుతుంది.
12. అలాగే ఫ్లవర్ వాజ్ లో సాల్ట్ కలిపిన నీరు పోస్తే ఫ్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి.
13. తోటపనికి సంబంధించి కొన్ని ఇనుప పనిముట్లు ఉపయోగిస్తుంటాం. అవి తడి తగిలితే చాలు తుప్పు పడతాయి. అలాంటి వాటిని బ్లాక్ టీలో ముంచి తీయాలి. లేదంటే కాచి చల్లార్చిన బ్లాక్ టీలో పొడి వస్త్రాన్ని ముంచి ఇనుప వస్తువులను తుడవడం వల్ల తుప్పు వదిలిపోతుంది.
14. కొవ్వొత్తుల స్టాండ్ లో కరిగిపోయిన మైనం పేరుకుపోతుంది. అప్పుడేం చేయాలంటే, గ్లిజరిన్ లో దూది ముంచి వాటితో స్టాండ్ తుడిస్తే తొలగిపోతుంది. మిగిలిన స్టీలు సింక్ మీద చల్లి మెత్తని వస్త్రంతో తుడిస్తే తళతళ మెరుస్తుంది.
15. అలంకరణ కోసం పరిచిన తివాచీ మీద గ్రీజు మరకలు పడితే నడిచేటప్పుడు కాళ్ళకు అంటుకుపోతుంది. దాన్ని వదిలించాలంటే మరక మీద మొక్క జొన్న పిండి చల్లి వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరిస్తే సరి.



Click it and Unblock the Notifications