Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
బొద్దింకల నిర్మూలించేందుకు శాశ్వత పరిష్కార మార్గం!
అమ్మబాబోయ్ బొద్దింకలు ఇంటినిండా చేరాయి. కొంతమంది అయితే బొద్దింకలను చూసి భయపడతారు. ఎక్కడ మరుగు ఉన్నా అక్కడ అవి ప్రత్యక్షమౌతాయి. డ్రైనేజీ సమస్య వచ్చిందంటే మ్యానిహోల్స్ ఓపెన్ చేస్తేచాలు. తెరిచీ తెరవకముందే అన్నీ మన మీద విరుచుక పడి దాడిచేస్తాయి. వీటిని శాశ్వతంగా నిర్మూలించడానికి మార్కెట్లో అనేక పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్ అందుబాటులో ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లలో బొద్దింకలు లేకుండా, శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. అందుకు ఒక మంచి ఉపాయం కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. కానీ మార్కెట్లో లభించే రసాయనిక మందులు వాడకం వల్ల ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు మరియు పెంపుడు జంతువులకు హాని కలగవచ్చు. కాబట్టి బొద్దింక నివారణ చర్యలో భాగంగా కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ఉత్తమ మార్గం. మరి మీ ఇంట్లో బొద్దింకలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం చాలా సింపుల్ చిట్కాలు ఉన్నాయి. చిట్కాలు:-

దోసకాయ ముక్కలు:
బొద్దింకలను శాశ్వతంగా నివారించడానికి దోసకాయను ముక్కలుగా చేసి ఎండబెట్టి వాటిన కప్ బోర్డుల్లోనూ, అల్మారాలోనూ ఉంచితే బొద్దింకల బెడద నుండి తప్పించుకోవచ్చు. లేదా తాజాగా ఉండే దోసకాయ తొక్క తీసి బొద్దికలు తిరిగే ప్రదేశంలో స్టిక్ చేయాలి.

బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా మరియు పంచదార రెండింటిని మిక్స్ చేసి, బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం వల్ల, అవి పంచదారకు ఆకర్శించబడి, ఈ పదార్థాన్ని తినడం వల్ల బేకింగ్ సోడాతో వాటిలో గ్యాస్ అధికంగా ఏర్పడి చనిపోతాయి. ఇది ఒక సులభమైన వంటింటి చిట్కా.

బిర్యానీ ఆకు:
చాలా వరకూ ఫేమస్ ఇండియన్ డిషెష్ లో ఉపయోగించి ఈ బిర్యానీ ఆకుతో, బొద్దింకలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అందుకు చేయాల్సిందల్లా, ఈ బిర్యానీ ఆకులు పౌడర్ చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం వల్ల, ఆ వాసనకు అవి చనిపోతాయి.

సోప్ వాటర్:
సోప్ వాటర్ లో బొద్దింకలు చాలా సమయం ఉండలేవు. కాబట్టి కొద్దిగా నీళ్ళలో సోపు వేసి బాగా షేక్ చేసి, బొద్దింకల మీద చల్లడం వల్ల కూడా క్షణాల్లో చనిపోతాయి.

అమ్మోనియా మరియు నీళ్ళు:
అమ్మోనియం మరియు నీళ్ళ మిశ్రమం బొద్దింకలకు చాలా చిరాకు పెడుతుంది. దాంతో బొద్దింకలను శాశ్వతంగా నిర్మూలించడానికి సహాయపడుతుంది. అందుకు ఒక బకెట్ నీళ్ళలో అమ్మోనియం కలిపి ఆ నీళ్ళ కిచెన్ షింక్ , వాష్ బేషిన్, బాత్ రూమ్ లలో పోయాలి.

గోధుమ పిండి ఉండలు:
వంటింట్లో బొద్దింకల బెడద ఎక్కువగా వుంటే బోరిక్ పౌడర్ కొద్దిగా పంచదార కలిసి గోధుమ పిండిలో వేసి చిన్న చిన్న వుండలుగా చేసి వంటింట్లో అన్ని మూలలా పెడితే బొద్దింకలు మటుమాయం.



Click it and Unblock the Notifications
