ఒక కృత్రిమ క్రిస్మస్ ట్రీ శుభ్రం చేయడానికి చిట్కాలు

క్రిస్మస్ పండుగా అతి దగ్గరలో రాబోతోంది. ఈ అతి పెద్ద పండగ కోసం ఇంట్లో డెకొరేషన్ చేయడానికి మరియు శాంటాను ఆహ్వానించడానికి ఇదే మంచి సమయం. క్రిస్మస్ ట్రీ ప్రతి సంవత్సర కొనుగోలు చేయడానికి వీలుకాదు. అందువల్ల, చాలా మంది ఈ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ చాలా జాగ్రత్తగా కవర్ లో చుట్టి భద్రంగా స్టోర్ రూమ్ లో పెడుతారు. అదే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని వచ్చే సంవత్సరం కూడా ఉపయోగిస్తారు.

అంతవరకూ బాగానే ఉన్నా, ఈ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే క్రిస్మ్ ట్రీలోని ఆకుల్లో చేరిన కొంత దుమ్ము, ధూలిని తొలగించడానికి కష్టం అవుతుంది. ఒక వేళ నీళ్ళు పోసి కడగాలన్నా మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి, ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి చాలా జాగ్రత్తగా మరియు సింపుల్ క్లీనింగ్ ట్రిక్స్ ను ఉపయోగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకు ఇక్కడ కొన్ని సింపుల్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ను అనుసరించిన తర్వాత ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ చాలా అందంగా కొత్తదానిలా కనబడుతుంది. అయితే, ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి ముందు, ట్రీలో డెకొరేట్ చేసిన వస్తువులన్నింటిని తొలగించాలని గుర్తుంచుకోవాలి.

Tips To Clean An Artificial Christmas Tree

వెట్ కాటన్ బాల్స్: ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలో కొన్ని ప్రదేశాల్లో దుమ్ము, ధూళి చేరి పాతవాటిలా కనిబడుతుంటాయి. అటువంటి ప్రదేశంలో తప్పనిసరిగా కాటన్ బాల్స్ ను ఉపయోగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాటన్ బాల్స్ ను తడి చేసి లేదా సోప్ వాటర్లో డిప్ చేసి ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ మీద మురికిచేరిన ప్రాంతంలో తుడవాలి. లేదా పొడి వస్త్రంతో తుడవాలి. ఇంట్లో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి ఇది చాలా సింపుల్ చిట్కా.

వాక్యూమ్ క్లీనర్: ఒక వేళ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, వాటిని సరిగా శుభ్రం చేయాలనుకొన్నప్పుడు, వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించండి . బ్రిస్టల్ బ్రెష్ ను అటాచ్ చేసి, మొదట బేస్ ట్రీ క్రింది భాగంలో డస్ట్ తొలగించడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్ వాక్యూమ్ చేయకూడదు. అలా చేస్తే చెట్టు విరిగిపోయే అవకాశం ఉంది. వాక్యూమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మరో అటాచ్ మెంట్ ను ఉపయోగించండి. చెట్టు పై నుండి శుభ్రం చేయడం వల్ల చెట్టు శుభ్రపడుతుంది. దుమ్మ పైనుండి క్రిందికి పడిపోతుంది. కాబట్టి, చాలా ఓపికగా, నిదానంగా శుభ్రం చేయాలి . ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ యొక్క కొమ్మల మీద వాక్యూమ్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ యొక్క కొమ్మలు వాక్యూమ్ లో ఇరుక్కోవడం వల్ల మిషన్ పాడవుతుంది.

సోప్ వాటర్: మీ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి మరో అద్భుతంగా చిట్కా ఇది. నీళ్ళలో నాణ్యమైన సోప్ లేదా లిక్విడ్ ను వేసి శుభ్రం చేయాలి. కఠిన రసాయనాలను వాడిని సోపులను మరియు డిటర్జెంట్ పౌడర్లను ఉపయోగించకూడదు. ఇది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ కలర్ ను చెడగొడుతుంది మరియు దీన్ని నాశనం చేస్తుంది. కాబట్టి, సోప్ వాటర్ లో ఒక కాటన్ వస్త్రాన్ని నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి. డిప్ చేసిన క్లాత్ చాలా సులభంగా దుమ్ము, ధూళిని పీల్చుకొనే విధంగా ఉండాలి. సోప్ వాటర్ లో డిప్ చేసి, ఆకులను, కొమ్మలను నిధానంగా తుడవాలి. దాంతో క్రిస్మస్ ట్రీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

Story first published: Tuesday, December 10, 2013, 20:02 [IST]
Desktop Bottom Promotion