Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
తెల్లని మరియు స్యూల్ యూనిఫార్మ్స్ శుభ్రపరచడానికి చిట్కాలు
సాధారణంగా ఇంట్లో అందరి దుస్తులు శుభ్రం చేయడం ఒక ఎత్తైతే, చిన్నపిల్లల మరియు స్కూల్ వెళ్ళే పిల్లల దుస్తులు శుభ్రం చేయడం మరో ఎత్తు. ముఖ్యంగా స్కూల్ యూనిఫార్మ్స్ శుభ్రం చేయడం అదీ, వర్కింగ్ ఉమెన్స్ కు తలకు మించిన భారం అవుతుంది. స్కూల్ పిల్లల దుస్తుల మీద పడ్డ మొండి మరకులు వదిలించడానికి ఆర్డినరీ సోపులను ఉపయోగించడం వల్ల మరలకు వదలించడం కష్టం అవుతుంది. కాబట్టి, స్కూల్ కు వెళ్ళే పిల్లల యొక్క దుస్తులను శుభ్రం చేయడానికి ముందు, నీటిలో నానబెట్టుటకు ముందు ఆ నీటిలో కొన్నినేచురల్ పదార్థాలు వేయడం వల్ల కొన్ని మొండి మరకలతో పాటు కొన్ని బ్రౌన్ మడ్ కలర్ మరకలు కూడా చాలా సులభంగా తొలగిపోతాయి. యూనిఫార్మ్ ను శుభ్రం చేయడానికి కొన్నినేచురల్ పదార్థాలను ఈ క్రింది లిస్ట్ లో ఇవ్వబడ్డాయి. వీటిని ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
మీ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే, మొదట మీ పిల్లలు తీసేసే దుస్తులను నీటిలో నానబెట్టాలి. 15నుండి30నిముషాలుదాక నానబెట్టాలి. ఇలా నానబెట్టుట వల్ల మరింత బెటర్ రిజల్ట్ ను అంధిస్తుంది. ఈ చిట్కాలు స్కూల్ యూనిఫార్మ్స్ శుభ్రం చేయడానికి ముఖ్యంగా స్కూల్ షర్ట్ శుభ్రం చేయడానికి మంచిగా సమాయపడుతాయి..

1. నిమ్మరసం : స్కూల్ యూనిఫార్మస్ మీద పడ్డ మరకలను సులభంగా తొలగించాలంటే, మరకల మీద నిమ్మరసం పిండి, నిమ్మతొక్కతో రుద్దాలి. ఇలా రెగ్యులర్ గా రెండు మూడు సార్లు రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. వెనిగర్ : స్కూల్ యూనీఫార్మ్స్ మరియు తెలుపు దుస్తుల మీద మరకలను వదిలించడానికి ఇది గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకు అరకప్పు వెనిగర్ ను నీటిలో మిక్స్ చేసి అందులో స్కూల్ యూనిఫార్మ్స్ ను నానబెట్టాలి . ఒక గంట తర్వాత నీటిలో నుండి దుస్తులను బయటకు తీసి బ్రష్ తో బాగా రుద్ది శుభ్రం చేయాలి.
3. బేకింగ్ పౌడర్: దుస్తుల మీద పడ్డ మట్టి, దుమ్ము, ధూళి మరకలను వధిలించడానికి బేకింగ్ పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది అందుకు బేకింగ్ పౌడర్ ను ఉపయోగించాలి. బేకింగ్ పౌడర్ లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి మరకల మీద అప్లై చేసి, ఆ తర్వాత క్లోత్ క్లీనింగ్ బ్రష్ తో రుద్ది తర్వాత శుభ్రం చేయాలి.
4. బ్లీచ్: తెలుపు దుస్తులు శుభ్రం చేయడానికి బ్లీచింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది . అయితే మీరు గుర్తుంచుకోవల్సిన మరో విషయం. దుస్తులకు స్టిఫ్ నెస్ సరిగా ఉండదు. కాబట్టి చాలా ఎక్కువగా మరకల పడ్డ దుస్తులకు మాత్రమే బ్లీచింగ్ ను ఉపయోగించాలి.
5. టమోటో జ్యూస్: టమోటో జ్యూస్ ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి, తెల్లని స్కూల్ యూనిఫార్మ్స్ ను శుభ్రం చేయడానికి టమోటో జ్యూస్ ఉపయోగపడుతుంది. మరకలు పడ్డ ప్రదేశంలో టమోటో జ్యూస్ అప్లై చేసి తర్వాత శుభ్రంచేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవల్సిన మరో విషయం, టమోటో జ్యూస్ అప్లై చేయడానికి ముందు దుస్తులను నీటిలో నానబెట్టాలి.



Click it and Unblock the Notifications