Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
మీ ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి ఇవే సూచనలు, ఆడవారిని ఇబ్బందులు పెట్టకండి
వాస్తు దోషం ఉంటే ఇలాంటి సమస్యల్ని మీరూ రోజూ చూస్తుంటారు. అందువల్ల వెంటనే మీరు వాస్తుపై ద్రుష్టిపెట్టాలి. వాస్తు దోషం లేకుండా ఉండాలంటే మీరు ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ కొనే ముంద
వాస్తును కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరు. కానీ వాస్తు ప్రకారం నడుచుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. వాస్తు సరిగ్గా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు,చికాకులు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతుంటారు.
అలాగే అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగాలేదు అనడానికి సూచనలుగా చెప్పొచ్చు. కొందరి జాతకాలు బాగుంటాయి. కానీ వారు ఉండే ఇళ్లు మాత్రం సరైన వాస్తులో ఉండదు. దీంతో వారు నిత్యం ఇబ్బందులుపడుతుంటారు.

చాలా సంకేతాలు కనిపిస్తుంటాయి
ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి చాలా సంకేతాలు మనకు తరచు కనిపిస్తుంటాయి. ఎక్కువగా అప్పులు చేయడం, మానసికంగా ఆందోళన చెందడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావడం వంటివి మీ ఇంటి వాస్తు లేకపోవడం వల్ల కూడా రావొచ్చు.

వాస్తుపై ద్రుష్టిపెట్టాలి
వాస్తు దోషం ఉంటే ఇలాంటి సమస్యల్ని మీరూ రోజూ చూస్తుంటారు. అందువల్ల వెంటనే మీరు వాస్తుపై ద్రుష్టిపెట్టాలి. వాస్తు దోషం లేకుండా ఉండాలంటే మీరు ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ల్యాండ్ కొనే ముందే
మీరు ల్యాండ్ కొనే ముందే అన్ని రకాలుగా చూయించుకోవాలి. ఆ భూమికి ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. నేల అడుగున టెంపుల్స్, శ్మశనాలు, ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకకపోవడం మంచిది. అలాగే ల్యాండ్ కొనేటప్పుడే అన్ని రకాలుగా చూసుకోవాలి.

ఇంటి మెయిన్ డోర్లు అంటే
ఇక ఇంటి యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇంటి మెయిన్ డోర్లు అంటే సింహద్వారాలను ఏ దిక్కుకు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలో వాస్తు ప్రకారం చూయించుకోవాలి.

వాస్తుప్రకారం కట్టినా
అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తుప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బందిపెట్టినట్లే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి.

ఇబ్బందులే సంకేతాలు
ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్కే.

వాస్తు దోషాన్ని చెక్ చేయించుకుని
అలా ఉంటే వెంటనే ఇంటికి ఉన్న వాస్తు దోషాన్ని చెక్ చేయించుకుని మార్పులు చేర్పులు చేసుకోండి. దోష నివారణకు ఏం చెయ్యాలో మనం మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం. బోల్డ్ స్కై తెలుగును ఫాలో అవుతూ ఉండండి.



Click it and Unblock the Notifications
