Latest Updates
-
పుల్లపుల్లగా, కారంకారంగా..నోరూరించే ఒడిశా స్పెషల్ అంబుల రాయ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - సోమవారం, 25 మే 2026 -
మిగిలిన అన్నంతో క్రీమీ రబ్డీ..తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
ఎండల నుంచి ఇట్టే ఉపశమనం ఇచ్చే గోవా స్పెషల్ డ్రింక్.. -
క్యారెట్ హల్వా ఇలా చేస్తే.. రెస్టారెంట్ రుచిని మించిపోతుంది! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? -
నెమ్మది నడక వెనుక ఉన్న అసలు కారణం బయటపెట్టిన సైంటిస్టులు!.. -
ఆంధ్రా స్టైల్ చింత చిగురు చికెన్ కర్రీ.. ఇలా వండితే ఒక్కో ముద్ద అమృతంలా.. -
మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టొచ్చా లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. -
అతిగా ఆలోచిస్తున్నారా? భగవద్గీతలోని ఈ 5 పాఠాలతో ఓవర్ థింకింగ్ కు చెక్ పెట్టండి! -
హెల్తీ టమాటో సూప్: రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఇలా చేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
వంట గదిలో ఇలా చేస్తే మీకు కష్టాలు తప్పవు. ఎట్టిపరిస్థితిలో ఈ పనులు మాత్రం చేయకండి
అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో నివసిస్తుందని మీకు కూడా తెలుసు. అందుకే వంటగదిలో కొన్ని తప్పులు చేస్తే అన్నపూర్ణేశ్వరి దేవికి కోపం వస్తుందని పెద్దలు అంటారు. కాబట్టి వంటగదిలో మీరు చేయకూడని తప్పులు ఏమిటో చూద్దాం.
ఇంటి నిర్మాణంలో కిచెన్ చాలా ముఖ్యమైనది. వంటగది బాగుంటేనే ఇల్లు, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండవచ్చని పెద్దలు, వాస్తు జ్యోతిష్యులు చెబుతుంటారు.

అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణేశ్వరి దేవి పార్వతీ దేవి రూపం. ఇంట్లో సుఖసంతోషాలు ఉండాలన్నా, పార్వతీ దేవి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండాలన్నా వంటగదిలో ఇలాంటి తప్పులు చెయ్యకూడదని గుర్తు పెట్టుకోవాలి. వంట గదిలో తెలీక చేసే తప్పులు వేరు. అయితే తెలిసి తెలిసి వంట గదిలో ఇలాంటి తప్పులు చేస్తే సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. వంటగదిలో మనం కొన్ని తప్పులు చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. కాబట్టి వంటగదిలో ఈ తప్పులు చేయకండి. వంట గదిలో పదేపదే ఇలాంటి తప్పులు చేస్తే పేదరికం ఖాయం అని పురాణాలు చెబుతున్నాయని వాస్తు జ్యోతిష్యులు అంటున్నారు..
* వంటగదిలో తినకూడదు
వంట గదిలో తరచుగా జరిగేది ఏమిటంటే చాలా మంది హడావిడిగా ఉన్నప్పుడు వంటగదిలో భోజనంతో పాటు ఆహారం తింటారు. ఇది చాలా పెద్ద తప్పు, ఇలా చెయ్యడం వల్ల ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి పోతుంది. వంట గదిలో నిలబడి తిన్నా, కుర్చుని తిన్నా మనకు మంచిది కాదని పురాణాలతో పాటు వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు.
* వంటగదిలో వాటర్ ట్యాప్ లీక్ అయితే ?
ప్రతి ఇంటిలోని వంట గదిలో పాత్రలు శుభ్రం చేసుకోవడానికి వాటర్ ట్యాప్ ఫిట్ చేస్తారు వంటగదిలోని పైపు పాడైపోయినట్లయితే, వెంటనే దాన్ని సరిచేయండి. ఎందుకంటే కిచెన్‌లోని ట్యాప్‌లో నుండి నీరు టపటపా అంటూ కారడం వలన అశుభం కలుగుతుంది. ప్రశాంతంగా ఉండే వంట గదిలో ఇలా గంగాదేవి బయటకు వెళ్లిపోవడం వలన అన్నపూర్ణేశ్వరి దేవికి కోపం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

* పదేపదే రుచి చూడకండి
వంట వండేటప్పుడు కొంతమంది పదేపదే ఆ వంట రుచి చూడడం, అదే ఎంగిలి చేసిన వేలితో మళ్లీ రుచి చూడటం, ఆ వంట పాత్రల్లో ఆ గెరిటలు పెట్టడం చేస్తుంటారు. ఎలాపడితే అలా రుచి పేరుతో చాలాసార్లు ఆహారాన్ని మళ్లీ మళ్లీ తింటూనే ఉంటారు. ఇలా చేయడంతో అన్నపూర్ణేశ్వరి దేవికి కోపం వస్తుంది. దీంతో ఇంట్లో పేదరికం మొదలవుతుంది.
* చెప్పులు వేసుకుంటే ధరిద్రం
వాస్తు ప్రకారం, వంటగదిలో చెప్పులు ధరించకూడదు. వంటగదిలో వంట చేస్తారు. అన్నం పరబ్రహ్మస్వరూపం అనే విషయం తెలిసిందే. వంట గదిలో చెప్పులు వేసుకుని అటూఇటూ తిరుగుతుంటే అన్నపూర్ణేశ్వరి దేవి కోపానికి గురవుతుంది, దీని వల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది. కొంత మంది ఆడవాళ్లు వాళ్ల హోదా చూపించుకోవడానికి, కొంత మంది ఫ్యాషన్ కోసం చెప్పులు వేసుకుని ఇంట్లోనే కాకుండా వంట గదిలో టింగుటింగున తిరుగుతుంటారు. ఇలా చేస్తే ఆన్నపూర్వేశ్వరి దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో కష్టాలు మొదలౌతాయని పురాణాలు చెబుతున్నాయి.
* భోజనం చేసి మిగిలిపోయిన ఆహారం, ఎంగిలి పాత్రలు
వంటగదిలో మిగిలిపోయిన వంట పాత్రలు, ఎంగిలి చేసిన పాత్రలు, భోజనం తిన్న పాత్రలను శుభ్రం చెయ్యకుండా అలాగే ఉంచకూడదు. ఆ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అప్పుడే అక్కడ లక్ష్మిదేవి నివసిస్తుంది.
మన ఇంటి మంచి కోసం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి, గంగాజలం నీటితో వంటగదిని శుభ్రం చేస్తే చాలా మంచిది. అంతే కాదు కుటుంబానికి వంట చేసిన ఆహారం వడ్డించే ముందు అన్నపూర్ణేశ్వరికి కొంచెం ఆహారం నైవేద్యాలు పెట్టడం మర్చిపోకూడదు.



Click it and Unblock the Notifications