For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మి పూజ యొక్క ఆచారములు

By Staff
|

వరలక్ష్మి పూజ అనేది భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన వేడుకలలో ఒకటి. దీనిని ఉత్తరాదిలో మహాలక్ష్మి వ్రతం అని పిలుస్తారు. అయితే ఈ పూజ లక్ష్మి దేవికి అంకితం చేయబడింది. కుటుంబ సంపన్నత మరియు శ్రేయస్సు కొరకు లక్ష్మీ దేవిని పూజిస్తారు.
వర అనే పదం వరంను సూచిస్తుంది. కాబట్టి వరలక్ష్మి దేవి వరాలను మంజూరు చేస్తుంది. ఈ వ్రతమును కేవలం వివాహిత స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. ఈ వ్రతం ను ఆచరిస్తే, సంపద, భూమి, లెర్నింగ్, ప్రేమ, కీర్తి, శాంతి, ఆనందం మరియు శక్తి యొక్క అష్ట లక్ష్మి-ఎనిమిది దేవతలను పూజ చేసిన దానితో సమానమని నమ్ముతారు. దీనిని సాధారణంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము నాడు జరుపుకుంటారు.

వివాహిత మహిళలు గొప్ప విశ్వాసం మరియు భక్తి తో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వారు ఉదయాన్నే స్నానం చేసి,రోజులో సగ భాగం ఉపవాసం చేస్తారు. ఈ వ్రతాన్ని కుటుంబ సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం జరుపుకుంటారు. కొంత మంది ప్రజలు పిల్లల కోసం దీవెనలు పొందడానికి ఈ పూజను నిర్వహిస్తారు. కుటుంబ ఆశీర్వాదం కొరకు ఈ వ్రత సమయంలో లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో పూజిస్తారు. వరలక్ష్మి పూజకు సంబందించిన ఆచారాల గురించి తెలుసుకుందాము.

వరలక్ష్మి వ్రతం యొక్క మూలం

వరలక్ష్మి వ్రతం యొక్క మూలం

ఒక పురాణం ప్రకారం ఒకప్పుడు సర్మది అనే చాలా దైవభక్తి గల మహిళ ఉంది. ఆమె కలలో లక్ష్మీదేవిని సందర్శించేను. లక్ష్మి దేవి సర్మది భక్తి కి చాలా సంతోషంగా ఉందని చెప్పెను. ఆమె దీవెనలు పొందడానికి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పెను. కాబట్టి సర్మది తెల్లవారుజామున లేచి స్నానం చేసి లక్ష్మి దేవి దీవెనల కోసం వ్రతం ఆచరించెను. ఆమెకు లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సును దీవించేను. ఈ కల గురించి విన్న తరువాత,గ్రామంలోని మహిళలు కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఆ విధంగా వరలక్ష్మి వ్రతం ఉనికిలోకి వచ్చింది.

తెల్లవారుజామున స్నానం

తెల్లవారుజామున స్నానం

సాదారణంగా ఈ పూజను మహిళలు చేస్తారు. కాబట్టి తెల్లవారుజామున లేచి స్నానంచేయాలి. సంప్రదాయబద్ధంగా,వారు బ్రహ్మ ముహర్త సమయంలో లేచి,స్నానం చేసి పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేయాలి.

ముగ్గులు

ముగ్గులు

పూజ ప్రాంతం మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రపరిచిన తరువాత,మహిళలు అందమైన ముగ్గులను పూజ ప్రాంతంలో మరియు ఇంటి ద్వారం వద్ద వేయాలి. ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతించడానికి మరియు అదృష్టం తీసుకురావటానికి అని చెప్పుతారు.

కలశం సిద్దం చేయుట

కలశం సిద్దం చేయుట

కలశం లేదా కుండను సాధారణంగా కాంస్య లేదా వెండితో తయారు చేస్తారు. దీనిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత,దాని మీద స్వస్తిక్ చిహ్నంను గందంతో గిస్తారు. కలశం వండని బియ్యం లేదా నీరు,నాణెం, సున్నం,ఆకులు మరియు వక్కపొడి వంటి ఐదు రకాలతో నిండి ఉంటుంది. కొంత మంది కలశానికి పసుపు, దువ్వెన,అద్దం,చిన్న నల్ల గాజులు మరియు నలుపు పూసలు ఉంచుతారు. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకోని దానికి పసుపు రాసి కలశం మీద పెడతారు. సాధారణంగా కలశం పై బాగాన్ని ఎరుపు గుడ్డ లేదా మామిడి ఆకులతో మూస్తారు. కొబ్బరికాయ మీద,లక్ష్మీదేవి చిత్రం ఉంచి పూజలు చేస్తారు.
పూజ ప్రారంభం

పూజ ప్రారంభం

పూజ సాధారణంగా గణేషుని పేరును ప్రేరేపించడంతో ప్రారంభమవుతుంది. తర్వాత లక్ష్మీ దేవికి అంకితం చేసిన శ్లోకాలను చదివి పూజ చేస్తారు. తర్వత ఆరతి ఇచ్చి,రక రకాల స్వీట్లు మరియు పొంగలిని అమ్మవారికి నైవేద్యం పెడతారు. కొందరు మహిళలు వారి మణికట్టు మీద పసుపు దారాలను కట్టుకుంటారు. ఆ రోజు సాయంత్రం చుట్టూ పక్కల ఉన్న మహిళలకు తమలపాకు,సున్నం,వక్క పెట్టి తాంబూలం అందిస్తారు. తర్వాత సాయంత్రం కూడా హారతి ఇస్తారు.

పూజ పూర్తి

పూజ పూర్తి

మరుసటి రోజు శనివారం నాడు,స్నానం చేసిన తర్వాత కలశంను విచ్ఛిన్నం చేసి కలశంలో ఉన్న నీటిని ఇంటిలో చల్లుతారు. ఒకవేళ బియ్యం ఉంటే,వంట చేసే బియ్యంలో కలుపుతారు. ఈ పండుగ ఆచారాలు చాలా సులభముగా ఉంటాయి. మీరు ఏదైనా మర్చిపోతే ఏ ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక స్పష్టమైన మనస్సు తో ప్రార్థన చేస్తే లక్ష్మి దేవి మరింత సంతోష పడుతుంది.

English summary

Rituals Of Varalakshmi Puja

Varalakshmi puja is one of the most popular celebration in the Southern states of India. It is also known by the name of Mahalakshmi vrata in the North. However this puja is dedicated to the same deity, Goddess Lakshmi for the prosperity and welfare of the family.
Desktop Bottom Promotion