Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా?
ఆఫీస్ పాలిటిక్స్‌తో విసిగిపోయారా? ఎంత కష్టపడినా గుర్తింపు, తగిన జీతం దక్కడంలేదనే నిరాశ వెంటాడుతోందా? లేక వర్క్ ప్రెజర్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? కారణమేదైనా..ఈ జాబ్ వదిలేస్తే బాగుండు అనే ఆలోచన మీలో బలంగా మెదులుతుండవచ్చు. రోజూ రాజీనామా లేఖ రాయాలని అనిపించవచ్చు. కానీ ఎమోషన్ స్తో కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఆ రిజైన్ లెటర్ పై సంతకం చేసే ముందు మీ భవిష్యత్తు కోసం కచ్చితంగా ఈ ఐదు విషయాలు తెలుసుకొని తీరాలి.

ఉద్యోగమే మీ జీవిత లక్ష్యం కాదు
ప్యాషన్ ను ఫాలో అవ్వండి.. నచ్చిన పనే చేయండి అని మోటివేషనల్ స్పీకర్లు చెప్పే మాటలు వినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ వాస్తవ ప్రపంచంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగమే జీవితానికి పూర్తి సంతృప్తినిస్తుందని నమ్మడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. మీ ఉద్యోగం కేవలం మీ ఆర్థిక అవసరాలు తీర్చే ఒక మార్గం మాత్రమే. మీ జీవితానికి స్పష్టమైన లక్ష్యం దొరికేవరకు, ఒక భద్రత కోసం చేస్తున్న పని మాత్రమే అని గ్రహించండి.
హోదా కంటే మీ విలువే గొప్పది
మీ హోదా మీ వ్యక్తిత్వాన్ని ఏమాత్రం నిర్ణయించదు. ఆఫీస్ డెస్క్ మీద ఉండే బోర్డులు చూడటానికి గర్వంగా ఉండొచ్చు కానీ మీ అసలైన విలువ దానితో ముడిపడి లేదు. ఆఫీస్ లో పెర్ఫార్మెన్స్ రివ్యూలు తగ్గినా, టార్గెట్స్ రీచ్ కాకపోయినా మీరేదో జీవితంలో ఓడిపోయినట్లు కాదు. మంచి స్నేహితుడిగా, జీవిత భాగస్వామిగా, గొప్ప తల్లిదండ్రులుగా మీకు ఆఫీస్ బయట ఒక విశిష్టమైన స్థానం ఉంది. మీ ఆత్మగౌరవాన్ని ఉద్యోగంతో ముడిపెట్టడం ఆపేసినప్పుడే మీరు స్వేచ్ఛగా బతకగలరు.
మీకోసం మీరు సమయం కేటాయించుకోండి
రోజువారీ జీవితంలో ఆఫీస్ పనులతో ఏమాత్రం సంబంధం లేని చిన్న చిన్న అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోండి. ఉదయాన్నే ప్రశాంతంగా కాసేపు నడవడం, ఇష్టమైన పాటలు వినడం, పుస్తకాలు చదవడం లేదా ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకున్న కొత్త హాబీని మొదలుపెట్టడం లాంటివి చేయండి. ఇవి మీ మనసుకు అద్భుతమైన ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆఫీస్ ప్రపంచం దాటి మీకు ఒక సొంత ఐడెంటిటీ ఉందనే విషయాన్ని ఇవి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తాయి.

భద్రతను వదలకుండానే కొత్త దారులు వెతకండి
ఉద్యోగం మానేయడమే ఏకైక పరిష్కారం అని మీరు ఫిక్స్ అయితే చేతిలో ఉన్న పనిని వదిలే ముందు, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో ఉండగానే కొత్త ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోండి. మీ రంగానికి చెందిన నిపుణులతో మాట్లాడి నెట్ వర్క్ పెంచుకోండి. వీలైతే ఫ్రీలాన్సింగ్ అవకాశాలు పరిశీలించండి. చేతిలో ఉద్యోగం ఉన్నప్పుడే ఇలాంటివి చేస్తే ఆర్థికపరమైన టెన్షన్ ఉండదు.
ఆఫీస్ దాటిన ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోండి
మీ ఆఫీస్ ను మీరు ఎంతగా ప్రేమించినా లేదా ఎంతగా ద్వేషించినా.. ఆ నాలుగు గోడలు దాటిన తర్వాత మీకంటూ ఒక అందమైన జీవితం ఉండాలి. సంతోషాలను పంచుకునే మంచి స్నేహితుల బృందాన్ని ఏర్పరచుకోండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా లేదా వర్కవుట్స్ చేయండి. మీ ఆనందం అనేది కేవలం ఒక బాస్ ఇచ్చే ప్రశంసల మీద కాకుండా.. స్నేహితులు, కుటుంబం, మీ హాబీలపై ఆధారపడి ఉన్నప్పుడు ఆఫీస్ కష్టాలు మిమ్మల్ని ఏమాత్రం కుంగదీయలేవు.



Click it and Unblock the Notifications
