Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం?
మొబైల్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి నుండి Hmm లేదా ఓకే Ok అని రిప్లై వస్తే మీకు చిరాకు వస్తుందా? మీరు ఎంతో ఉత్సాహంగా, భావోద్వేగంగా ఏదైనా విషయాన్ని టైప్ చేసి చెబితే.. వారు కేవలం ఆ ఒక్క పదంతో ముగించేస్తే, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా? అయితే దాని వెనుక ఉన్న మానసిక సత్యాన్ని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రముఖ సైకాలజిస్ట్, రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ధృతి అంక్లేసరియా ప్రకారం.. ఈ చిన్న పదం వెనుక ఎన్నో లోతైన మానసిక కారణాలు దాగి ఉన్నాయి. దీనికి సంబంధించి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
'Hmmm' అనడానికి 4 ప్రధాన కారణాలు
గొడవలకు భయపడటం
ముఖ్యంగా పురుషులు వాదనలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. తాము ఏదైనా ఎక్కువగా మాట్లాడితే అది పెద్ద గొడవకు దారి తీస్తుందేమోననే ఆందోళనతో, సంభాషణను అక్కడితో ఆపేందుకు లేదా కంట్రోల్ చేయడానికి ఆత్మరక్షణగా hmm అని వాడతారు.
మానసిక అలసట
రోజంతా ఆఫీసు ఒత్తిడి, పనుల వల్ల మనిషి మానసికంగా అలిసిపోయినప్పుడు.. మెదడుకు మాటలు కూర్చే ఓపిక ఉండదు. దీన్నే బ్రెయిన్ ఫేడ్ అంటారు. అలాంటప్పుడు వారి చేతులు సులభంగా hmm అని టైప్ చేసేస్తాయి.
సైలెంట్ కోపం
అంతకుముందు మీతో చాలాసేపు మాట్లాడిన మీ భాగస్వామి, సడెన్ గా ప్రతిదానికీ hmm అంటున్నారంటే అది ఒక హెచ్చరిక కావచ్చు. వారు మీపై కోపంగా ఉన్నారు కానీ పైకి చెప్పట్లేదు. ఆ అసంతృప్తిని మీరే గ్రహించాలని వారి ఉద్దేశం.
ఇంట్రోవర్ట్స్
స్వభావరీత్యా తక్కువగా మాట్లాడేవారికి hmm అంటే ఉదాసీనత కాదు. అవును, నేను వింటున్నాను.. అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి వారు ఆ పదాన్ని ఒక వర్చువల్ తల ఊపులా వాడతారు.

మహిళలే ఎందుకు ఎక్కువగా బాధపడతారు?
దీని వెనుక ఉన్న సైన్స్‌ను డా. ధృతి వివరిస్తూ.. మన భావోద్వేగాలను నియంత్రించే అమిగ్డాలా అనే మెదడు భాగం స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా పనిచేస్తుందని తెలిపారు. మహిళల్లో ఇది చాలా చురుకుగా ఉంటుంది. అందుకే వారు మాట్లాడేటప్పుడు తక్షణ స్పందనను, ఎమోషనల్ కనెక్షన్ ను కోరుకుంటారు. తాము చెప్పేది అవతలివారు శ్రద్ధగా వినాలని ఆశిస్తారు.
కానీ పురుషుల అమిగ్డాలా నెమ్మదిగా ప్రాసెస్ అవుతుంది. అందుకే వాళ్ళు భావోద్వేగాలను మాటల్లో పెట్టడానికి సమయం తీసుకుంటారు. త్వరగా ఒక పరిష్కారం చెప్పి అక్కడితో విషయాన్ని ముగించాలని చూస్తారు. మహిళలు ఎప్పుడూ పరిష్కారం కోరుకోరు, తమ మనసులోని మాటను వింటే చాలు అనుకుంటారు అన్నది పురుషులు అర్థం చేసుకోవాలి.
ఈ దూరాన్ని ఎలా చెరిపేయాలి?
బంధంలో హ్మ్(hmm) వల్ల దూరం పెరుగుతుంటే డాక్టర్ ధృతి చెబుతున్న ఈ చిట్కాలు పాటించండి.
ప్రశ్నలు మార్చండి
కేవలం అవును,కాదు అని చెప్పేలా కాకుండా..భోజనం చేశారా? బదులు ఈరోజు నీకెలా గడిచింది? లాంటి ప్రశ్నలు అడగండి.
సమయం ఇవ్వండి
మీ భాగస్వామి అలసిపోయినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వాలని ఒత్తిడి చేయకండి. వారికి కాస్త స్పేస్ ఇవ్వండి.
మగవారికి సలహా
కేవలం హ్మ్(hmm)అని కాకుండా..సరే, ఆ తర్వాత ఏమైంది? లేదా నేను కొంచెం పనిలో ఉన్నాను, ఇంటికి రాగానే మాట్లాడతాను అని కాస్త వివరణాత్మకంగా చెప్పండి. ఇది మీ భాగస్వామికి భరోసా ఇస్తుంది.



Click it and Unblock the Notifications
