Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.!
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.!
సోషల్ మీడియాలో ప్రస్తుతం జూన్ థియరీ ట్రెండ్ అవుతోంది. రొమాంటిక్ రిలేషన్‌కి ఈ జూన్ థియరీ పర్ఫెక్ట్ సూట్ అవుతుందని మనస్తత్వ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసక్తికర ప్రేమ సిద్ధాంతం ద్వారా జూన్ నెలలో జంటల మధ్య ఊహించని సానుకూల మార్పు లేదా మలుపు చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అసలేంటి ఈ జూన్ థియరీ.. ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ చూద్దాం..

కొత్త బంధాలు
జూన్ థియరీ ప్రకారం ఈ నెలలో మీరు ఊహించని విధంగా మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తిని కలవగానే స్వల్ప వ్యవధిలోనే వారితో బలమైన భావోద్వేగం ఏర్పడుతుంది. ప్రేమ చిగురిస్తుంది. ఇంకా డేటింగ్ యాప్స్ లేదా సాధారణ పరిచయాలతోనే వారి బంధం బలపడుతుంది. ఇది క్రమంగా పెళ్లి వరకు దారితీయొచ్చు. లేదంటే ఈ సమయంలోనే నిశ్చితార్థం చేసుకోవచ్చు. మరింత అప్‌డేటెడ్‌గా సహజీవనం వరకూ వెళ్లే అవకాశమూ ఉంది.
పాత పరిచయాలు
జూన్ థియరీలో మీ రిలేషన్‌కి సంబంధించి పాత జ్ఞాపకాలు మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం మాజీ లవర్ సడెన్‌గా మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా వారు మిమ్మల్ని మళ్లీ కలిసే అవకాశం ఉంది. లేదంటే అనుకోకుండా వారిని కలుసుకోవచ్చు. దీంతో ఈ కాలం మీ గత జ్ఞాపకాలకు, భావాలకు పరీక్షా సమయం.
జూన్ థియరీ వెనుక ఏదైనా లాజిక్ ఉందా.?
కాగా, జూన్ థియరీ వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మన భావోద్వేగాలు, మానసిక ప్రవర్తన ఆధారంగానే ఈ థియరీని విశ్లేషించవచ్చని అంటున్నారు. సీజన్‌లో మార్పులు కూడా మరో కారణం కావచ్చు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సూర్యకిరణాల ప్రభావంతో బాడీలో సంతోషాన్ని ఇచ్చే సెరటోనిన్ హార్మోన్లు స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా శారీరకంగా, మానసికంగా ఉత్సాహం, ఉత్తేజం పెరుగుతుంది. ఫలితంగా సోషల్ రిలేషన్స్ పట్ల ఆసక్తి కనబరుస్తారు.
ఇదిలా ఉండగా.. జూన్ నెల రాగానే దాదాపు సగం ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం తీర్మానాల్లో భాగంగా కొందరు తమ జీవితంలోకి కొత్త రిలేషన్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇందులో భాగంగానే సగం సంవత్సరం పూర్తి కావడంతో లైఫ్‌లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించాలనే ఆలోచనతో డేటింగ్, లవ్‌పై ఆసక్తి కనబరుస్తారు.

మరోవైపు జూన్ వివాహాల పరంగానూ సరైన సమయం. మూడు ముళ్ల బంధంతో కొత్త వ్యక్తిని మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోమన్ కాలం నుంచి ఈ నెల వివాహాల నెలగా ఫేమస్. అందుకే రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌కి జూన్ థియరీ పర్ఫెక్ట్‌గా భావిస్తారు.
చివరిగా.. జూన్ థియరీ ప్రకారం కాలానుగుణంగానూ రొమాంటిక్ కపుల్స్‌కి అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో పగలు ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగా ఉండటంతో పార్ట్‌నర్‌తో కలిసి విహారయాత్రలు ప్లాన్ చేయొచ్చు. దీంతో ఒకరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరదాగా సాయంత్రాలు వాకింగ్‌కు వెళ్తూ సమయాన్ని గడపవచ్చు. మీరూ సింగిల్ లేదా కమిటెడ్ అయితే ఈ జూన్ థియరీని ట్రై చేసి అర్థం చేసుకునే భాగస్వామిని సంపాదించుకోండి.



Click it and Unblock the Notifications
