కొత్త భాగస్వామితో మాజీ లవర్‌.. సోషల్‌ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.?

అభిప్రాయ భేదాలతో ప్రేమ జంటలు విడిపోవడం కామన్‌. బ్రేకప్‌ తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో నచ్చిన పనుల్లో బిజీబిజీగా గడుపుతుంటారు. అయితే ఎంత వద్దనుకున్నా మాజీ లవర్‌ ప్రస్తుతం ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని సైకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.

reasons why you secretly checking your ex s new partner on social media

ప్రేమ జంటలు విడిపోయాక.. ఎవరి దారులు వారు చూసుకుని వారి వారి లైఫ్‌లో బిజీగా గడుపుతూ పాత జ్ఞాపకాలను మరిచిపోతుంటారు. ఈ క్రమంలో మాజీ లవర్‌ వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నారని తెలిస్తే ఒక్కసారిగా వారి మానసిక స్థితిలో మార్పులు రావడం సహజం. తనతో విడిపోయిన మనిషి వేరే వ్యక్తితో మూవ్‌ ఆన్‌ అయ్యారని తెలిసే సరికి సదరు వ్యక్తి గురించి తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

నకిలీ ఖాతాలతో ఫాలో

ఈ క్రమంలో మాజీ లవర్‌ కొత్త భాగస్వామి గురించి తెలుసుకునేందుకు వారి సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ను తరచూ ఫాలో అవుతుంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. వారు ఎవరు, ఏం చేస్తున్నారు.. తమ ఇద్దరికీ మధ్య ఉన్న తేడాలు ఏంటి అని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దాదాపు 46 శాతం మంది తమ మాజీ లవర్‌ కొత్త పార్ట్‌నర్‌ గురించి సోషల్‌ మీడియాలో వెతికినట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వారి పర్సనల్‌ లైఫ్‌ తెలుసుకోవడం కోసం నకిలీ ఖాతాలను సృష్టించి వారిని ఫాలో అవుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

అయితే ఇది ప్రతి ఒక్కరిలో జరిగేదే. గతంలో మీ జీవితంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు వేరే వ్యక్తితో ఉన్నారని తెలిసి వారి జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. మాజీ లవర్‌ కొత్త రిలేషన్‌ గురించి తెలుసుకోవాలని, వారితో ఎలా ఉంటున్నారనే విషయాల్లో సోషల్‌ మీడియాను ఆసరాగా చేసుకుంటున్నారు.

కాగా, బ్రేకప్‌ సమయంలో లవర్‌తో విడిపోవడానికి తామే కారణమేమోనని కొందరు భావిస్తుంటారు. ఈ క్రమంలో ప్రియుడు లేదా ప్రియురాలు వేరే వ్యక్తితో ఉన్నారని తెలిసి.. తనకు, ఆ వ్యక్తి మధ్య పోలికలు, తేడాలు ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. తద్వారా తమ రిలేషన్‌ ఎలా బ్రేక్‌ అయిందో ఓ అంచనాకి రావచ్చని ప్రయత్నిస్తుంటారు.

reasons why you secretly checking your ex s new partner on social media

ఈ క్రమంలో మాజీ భాగస్వామి మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. దీంతో నిజాన్ని అంగీకరించి ఇద్దరి దారులు వేరని భావించి ఆ బంధం ముగిసిందని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని ఆ జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా వారు జీవితంలో ముందుకు సాగిపోగలరని నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా బ్రేకప్‌కి ముందు ప్రేమించిన వ్యక్తి తనతో ఎలా ఉన్నారు.. విడిపోయిన తర్వాత కొత్త బంధంతో సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇంకా మాజీ భాగస్వామి కొత్త రిలేషన్‌ ఎలా ఉందో కూడా ఓ అవగాహనకి వస్తుంటారు.

డైలామా

అయితే ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే ఒక్కోసారి మనస్తాపం, ఈగో కారణంగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత తాము తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే డైలామాలో ఉంటారు. విడిపోయిన తర్వాత పొరపాటు చేశామా అనే భావనలోనూ ఉంటారు. అందుకే మాజీ భాగస్వామి కొత్త రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని అంగీకరించలేరు. ఈ కారణంగా కూడా పదే పదే వారిని సోషల్‌ మీడియాలో ఫాలో అవుతుంటారని నిపుణులు చెబుతున్నారు.

అతి ఆలోచనలు వద్దు

కానీ ఇలా చేయడం వల్ల మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని సూచిస్తున్నారు. వారి కొత్త బంధాన్ని సోషల్‌ మీడియాలో చూడటం మీకు అసౌకర్యంగా అనిపిస్తే అలా చేయడం మానుకోవాలని అంటున్నారు. ఇది భావోద్వేగపరంగానూ వారి నుంచి దూరం కావడానికి దోహదపడుతుంది. మీ మాజీ భాగస్వామి కొత్త బంధం గురించి కూడా బయట ఆరా తీయాలని ఉత్సుకత ఉన్నా.. చాలావరకు మీకు మనశ్శాంతిని దూరం చేయొచ్చు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

Story first published: Thursday, June 11, 2026, 19:17 [IST]
Desktop Bottom Promotion