Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత
హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది. అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము.
ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం.

హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా "జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర " వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు.
మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే 'మూడవ దోహా' ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది.
చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి.
14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి. మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు.
11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది.
16వ మరియు 17 ఛౌపయిస్ చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు.
20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.
24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.
చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.



Click it and Unblock the Notifications
