Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
మనం ఎంపిక చేసుకొనే కలర్ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి..?
వర్ణ సమన్వయ౦ చాలా మందికి ముఖ్యం. ఒకే రంగు దుస్తులు వేసుకోవడానికి గానీ, వాణిజ్య ప్రకటనలకు గానీ అందరూ దాని కోసమే చూస్తారు. ఇమేజ్ పర్ఫెక్టుగా ఉంటె ఎన్ని రకాల దుస్తులైనా ధరించవచ్చు మీలో ఎంతమంది పర్ఫెక్టు ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ ఉండే ఉంటారు.? నిజానికి మనలో చాలామంది కొద్దిపాటి లోపాలతో భాదపడేవారే, లావుగా, పొట్టి, సన్నగా, ఇవన్నీ మనం ధరించే దుస్తులతో కవర్ అవ్వాలి. ఆ విధంగా దుస్తులు మన తగ్గ కలర్ లో డిజైన్ చేయించుకోవాలి. చిన్నచిన్న మార్పలతో మీ ఇమేజ్లో ఎంత మార్పు వస్తుందో మీకే ఆశ్చర్యంగా ఉంటుంది.
చర్యలు:
1. ఋతువుకి తగ్గట్టు బట్టలు వేసుకోండి. శీతాకాలం ఐతే లేత నీలి రంగు, తెలుపు లాంటి తేలిక పాటి రంగులు వాడండి. వర్షాకాలంలో వాతావరణానికి తగినట్టు తోపు, పచ్చ, ముదురు పసుపు, నారింజ లాంటి కంటికింపుగా వుండే రంగులు వాడండి. వసంత కాలం వస్తే పుదీనా రంగు, రాబిన్స్ ఎగ్ నీలం, రోజా గులాబి రంగు లాంటి వసంత ఋతువు లాగా సున్నితంగా వుండే రంగులు వాడండి. వేసవిలో పచ్చదనానికి పోలేటట్లుగా పసుపు, ముదురు నీలం లా౦టి ముదురు రంగులు వేయండి.
2. ఏది జనాదరణ పొందిందో గమనించండి. ‘స్టైల్' గా ఏవి వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి. ఉదాహరణకు, ప్రస్తుతం ఎవరూ వాడనటువంటి ముదురు పసుపు, ఎరుపు లాంటి రంగులు ఎప్పటికీ వాడకండి.

3. జనానికి కొన్ని వస్తువులను గుర్తుకు తెచ్చే రంగులు వాడండి. ఉదాహరణకు, లేత గులాబి, గోధుమ, తెలుపు రంగులు చూస్తే నియపోలిటన్ ఐస్ క్రీమ్ గుర్తుకువస్తుంది.
4. నమూనాకు సరిపోయే లాంటి రంగులు ఎంచుకోండి. ఉదాహరణకు గళ్ళ డిజైన్ వుండే డ్రస్ కి నిమ్మ పచ్చ, గులాబి వాడకండి.
5. రంగుల చక్రాన్ని వాడండి. ‘విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి' అనే మాట ఈ విషయంలో నిజం. ఉదాహరణకు, నలుపు తెలుపు కలయిక బాగుంటుంది. ఊదా రంగు, పచ్చ కలయిక కూడా చూడ్డానికి బాగుంటుంది. పరస్పర పూరకాలైన రంగులు వాడితే ఒక ప్రత్యేకమైన లక్షణం గానీ ప్రదేశం గాని కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
6. ఒక విలక్షణమైన రంగును లేదా రంగులను ఒక ప్రత్యేకమైన ఆహార్యానికి ధారాళంగా వాడ౦డి.
7. మీ చర్మం స్వభావం, రంగులను బట్టి సరిపోయే రంగులు వాడండి. మీ చర్మం మీద వివిధ రంగులను ప్రయత్నించి మీ శరీరానికి ఏవి బాగుంటాయో చూసుకోండి. నల్ల జుట్టు వుండే స్త్రీలకు పచ్చ రంగు, రాగి రంగు జుట్టు కలవారికి నీలి వర్ణం బాగుంటాయి. నల్లగా వుండే వారికి అన్నీ బాగుంటాయి - ఎందుకంటే నలుపు దే౦తో నైనా బాగుంటుంది, కానీ కొన్ని రంగులు కొన్ని రకాల మనుషులకే అని మాత్రం అనుకోకండి.
8.ఇంటర్నెట్ లో కొంతమంది చిత్రాలు శోధించి, ఎలా వు౦టాయోనని మీరు భయపడే వేర్వేరు రంగులు వాళ్ళ మీద ఎలా వున్నాయి చూడండి.
9. చివరిగా స్నేహితుడి నుంచో లేక కుటుంబ సభ్యుల నుంచో రెండో సలహా తీసుకోండి.
చిట్కాలు:
మీ స్వంత శైలి కలిగి వుండండి, ఎవరికి తెలుసు మీరే ఒక ఒరవడి సృష్టిస్తారేమో!
ప్రకాశవంతంగా వుండే రంగులను తటస్థంగా వుండే వాటితో కలిపి ఆహార్యానికి ఒక సమతౌల్యం తెండి.
ఉదాహరణకు: రోజా గులాబి రంగు తో లేత బూడిద రంగు, పచ్చ రంగుతో గోధుమ రంగు, ఇసుక పసుపుతో నీలం, పుదీనా పచ్చతో తెలుపు, రేగు వర్ణంతో నలుపు లాంటివి
హెచ్చరికలు:
ఎరుపు, పచ్చ లాంటివి శెలవు దినాల రంగులు, శెలవు దినాలైతే తప్ప, ఎప్పుడూ వాడకండి.
పసుపులాంటి ప్రకాశవంతమైన రంగులతో బూడిద రంగు వాడకండి.
కాలం చెల్లిన ఉపకరణాలు వాడకుండా జాగ్రత్త పదండి, కాలంతో ముందుకు కదలండి.



Click it and Unblock the Notifications