Latest Updates
-
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
భారతదేశంలోనూ విచిత్రమైన ఆహార పద్దతి ఉంది.!
మన ఇండియాలో ఆశ్చర్యకరమైన విషయాలను తెల్పడంలో ముందుంటుంది. ప్రకృతి దృశ్యం, ప్రజలు, ఆహార, సంస్కృతి వంటి వివిధ రకాలైన మరియు ప్రత్యేకమైనవి మనకు కనబరుస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఆహార విషయంలో, మన ఇండియాలో చాలా వెరైటీ డిషెష్ ఉన్నాయి.మన దేశంలో ప్రాంతాల వారిగా ప్రతి ప్రదేశంలోనూ ప్రత్యేకమైన రుచులను కలిగి ఉన్నాయి. కానీ, భారతదేశంలో తయారు చేసే అసాధారణమైన మరియు వింత రుచుల గురించి ఎంత మందికి తెలుసు?
భారతదేంలో అనేక ప్రదేశాల్లో ఒక అసాధారణ పద్ధతిలో ‘అసాధారణమైన వంటలను'వండుతారని మనం తెలుసుకోవచ్చు. మన ఇండియాలో మసాలా దోసె మరియు బట్టర్ చికెన్, పావ్ బాజీ, రోటీ, బిర్యానీలు మాత్రమే వండుతారు, ఇవే చాలా ఫేమస్ అనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇవే కాకుండా మన ఇండియానో కొన్ని ఆశ్చర్యకరమైన అసాధారణ, ఒక వింత వంటకాలను వండుతారంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి మీకు అంత పెద్ద ఆశ్చర్యం కలగాలంటే ఈ వింతైన ఆహారాల మీద ఓ లుక్ వేయల్సాంది..రండి ఆ వింత ఆహారాలేంటో ఒకసారి కళ్ళారా చూద్దాం...

మన భారతీయులు తినే వింత ఆహారాలు..!
బట్టర్ టీ: అవును ఈ టీని వెన్నతో తయారు చేస్తారు. పాలు ఉపయోగించరు! ఇది నిజానికి టిబెటన్ శరణార్థుల ద్వారా మన భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ టీని వెన్న మరియు చిటికెడు ఉప్పుతో తయారు చేస్తారు.

చికెన్ బ్లడ్ మరియు పంది పేగులు:
ఇది చాలా క్రేజీగా ఉంది కదూ! ఈ డిష్ ను జదో అనిపిలుస్తారు దీన్ని జైంతియా తెగ వారు, తయారు చేసి, తింటుంటారు. నార్త్ ఈస్ట్ లో బ్లడ్ చికెన్ మరియు పంది పేగులను ఉపయోగించే తయారు చేసే ఈ వంటకం ఒక విచిత్రమైనదే అయినా, రుచికరమైన ఒక పదార్థం.

కుక్క మాంసాం:
మీకు కుక్కలంటే పిచ్చి ప్రేమ, కానీ మీరు కుక్కలను తినరు కదా. కానీ నాగాలాండ్, కుక్కలను ఎక్కువగా ఇష్టపడుతారు. అలాగే వాటిని తింటారు కూడా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతర మాంసాహారం కంటే ఈ కుక్క మాంసం చాలా ఖరీదుగా ఉంటుంది.

బేబీ షార్క్ కర్రీ:
మనం షార్క్ ను చూస్తే చాలా భయపడిపోతుంటాం. కొంత మంది వీటికి భయపడటం మాత్రమే కాదు, వీటిని తింటారు కూడా. బేబీ షార్క్ కర్రీ గోవాలో చాలా అద్భుతమైన వంటకం. ఇది మెనూలో చాలా ఖరీదైనటువంటి ఆహార పదార్థం. కానీ ఈ కర్రీ యొక్క రుచి మనం పే చేసే డబ్బు కంటే అధికంగా ఉంటుందని చెబుతారు తినేవారు.

రెడ్ యాంట్ డిప్:
ఇది నిజంగా వింతే, ఎర్ర గండు చీమలతో చట్నీ లేదా వాటీ అవయావాలతో సాప్ ను తయారు చేస్తారు. ఈ చీమలను ఎండబెట్టి స్వీటెనర్లగాను మరియు సమాలాలతోను తయారు చేసి తింటుంటారు.

బ్లాక్ రైస్:
ఇది మణిపూర్ లో తయారు చేసేటటువంటి ఒక ప్రత్యకమైన పదార్థం. ఇది కలర్స్ మారడటం వల్ల దీన్ని‘మ్యాజిక్ రైస్' అనికూడా పిలుస్తారు. వీటిని చూడటానికి బ్లాక్ కలర్ లో కనబడ్డా, తయారు చేసేటప్పుడు ఇవి వంగపండు కలర్ లోకి మార్పు చెందుతాయి.

పింగ్స్ బ్రెయిన్:
మేఘాలయ ప్రజల రుచికరమైన వంటకం, doh khliehఇది పోర్క్ డిష్, పింగ్ బ్రెయిన్ తో గార్నిష్ చేసిన వంటకం ఇది. ఈ స్పెషల్ డిష్ ను రుచి చూడటానికి మీకు ధైర్యం ఉందా?

ఫ్రాగ్ లెగ్స్:
సిక్కింలో, విరేచనాలను మరియు కడుపు, ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి, కప్ప కాళ్ళను ఉపయోగిస్తారు. మనం వీటిని సాధారణంగా వర్షకాలంలో చూస్తుంటాం. చాలా చిరాకు పెట్టిస్తుంటాయి. వీటి కూడా తింటారంటే ఆశ్చర్యం కలగక మానదు.

పట్టు పురుగు యొక్క pupa:
ఎరి పొలు(Eri polu), అస్సాం డిష్, దీన్ని సిల్క్ వార్మ్(పట్టు పురుగుల యాక్క పుపా)తో తయారు చేసే ఒక డిష్. ఈ డిష్ చూడటానికి చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. నోట్లో పెట్టుకొంటే కరిగిపోయే డిష్ అని చెబుతుంటారు.



Click it and Unblock the Notifications
