Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
బంగారం గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు...
పుత్తడి, పసిడి, కనకం, స్వర్ణం..ఇలా ఏ పేరుతో పిలిచినా బంగారానికి ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలంటే ఏంతో ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. స్వర్ణాభరణాలు ధరించనిదే చాలా మంది శుభకార్యాల్లో పాల్గొనరంటే అతిశయోక్తి కాదు.
మన దేశంలో ఆధ్యాత్మికంగానూ, బంగారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. కొన్ని దేశాల్లోనైతే బంగారాన్ని కరెన్సీ రూపంలో ఉపయోగిస్తుంటారట. ఒక్కోసారి పసిడి దేశ ఆర్థక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంత విశిష్టత ఉన్న బంగారం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!

గోల్డ్ మెడల్స్ రహస్యమదే...
సాధారనంగా ఒలింపిక్స్ మొదలుకుని అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరిగే వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి పతకాలు ఇవ్వడం మనకు తెలిసిందే. చదువులోనూ తమదైన ప్రతిభ కనబిచిన వారిని ప్రశంసిస్తూ పతకాలను అందజేస్తుంటారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో వారిని సత్కరిస్తూ ఉంటారు. వీటిలో బంగారు పతకానిది ప్రముఖ స్థానమనే చెప్పుకోవచ్చు.

గోల్డ్ మెడల్స్ రహస్యమదే...
అయితే ఒలింపిక్స్ లో క్రీడాకారుకలు ఇచ్చే పతకాలను పూర్తిగా బంగారంతో తయారుచేయరట. ఇందులో కేవలం 1.34శాతం మాత్రమే ఈ విలువైన ఖనిజం ఉంటుంది. మిగిలినది వెండి (92శాతం, రాగి 6.7శాతం )ఉంటాయట. ఒలింపిక్స్ మొదలైన తొలినాళ్లలో మొత్తం బంగారంతో తయారుచేసిన పతకాలే అందించేవారు. అయితే తయారీ వ్యయం పెరిగిపోతుండటంతో ఆ తర్వాత నుంచి ఇలా ఇస్తున్నారు.

బంగారు భోజనం:
కొన్ని రకాల స్వీట్లపై పలుచని వెండిరేకుని పూతలా వేస్తారు చూశారా? అదిగో అచ్చం అలాగే బంగార్ని కూడా చాలా పలుచని రేకులాగా చేసి స్వీట్లు...ఇతర ఆహారపదార్థలపై పూతలా వేసుకుని తింటారట. దీని వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని చాలా మంది నమ్ముతుంటారు.

బంగారు భోజనం:
పూర్వకాలంలో మనదేశంలోని శ్రీమంతులు వేడివేడి అన్నంలో చిన్న బంగారపు ముక్క కలుపుకుని తినేవారట. అందుకే వారు అంత స్ట్రాంగ్ గా ఉండేవారేమో...మనం బంగారం ఒంటి మీద వేసుకోవడానికి కొనాలంటేనే పర్సులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక తినడానికెలా లెండి...

మనేమే టాప్ :
సాధారణంగా అన్ని దేశాల్లోనూ బంగారం కొనడం మంచి పెట్టుబడి మార్గంగా భావిస్తారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ మంది బంగారం కొనడాన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. అంతే కాదు. దాని వల్ల సంపద వ్రుద్ది చెందుతుందని భావిస్తారు.

మనేమే టాప్ :
ఇక అక్షయ త్రుతీయ రోజు అయితే గ్రాము బంగారం కొన్నా చాలు..అనుకునే వారు ఎందరో ఉన్నారు. అందుకే బంగారానికి ఏ దేశంలోనూ లేని డిమాండ్ మన దేశంలో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని దేశాల్లో ఉన్న బంగారం కంటే 11శాతం ఎక్కువ పసిడి మన దేశం దగ్గరే ఉందట. అదీ మన ప్రత్యేకత.

అంతరిక్షంలోనూ.
బంగారం భూమ్మీదనే కాదు అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే శిరస్త్రాణంపై బంగారు పూతను పూస్తారట. ఇది సూర్యని నుంచి వెలువడే ప్రమాదకరమైన ఇన ప్రారెడ్ కిరణాలు పరావర్తనం చెందేలా చేస్తుంది. దీనివల్ల శిరస్త్రానం లోపలి భాగం చల్లగా ఉండటమే కాకుండా శరీరం ఇన్ ఫ్రారెడ్ కిరణాల ప్రభావానికి గురికాకుండా కాపడుతుంది.

మానవ శరీరంలో కూడా..
మానవ శరీరంలో 0.2మిల్లీగ్రాముల బంగారం కలిగి ఉంటుంది. దీనిలో ఎక్కువ భాగం రక్తంలో ఉండడం గమనార్హం.

మానవ శరీరంలో కూడా..
మనం వేలికి ధరించే ఉంగరంలో 6 మిల్లీగ్రాముల బంగారం ప్రతి సంవత్సరం కరిగిపోతుంది.

మానవ శరీరంలో కూడా..
కొంత మంది బంగారం చూడడానికి భయపడుతూ ఉంటారు. దీన్ని ఆరోఫోబియా అంటారు.

భూమ్మీద ఉన్న బంగారం..
ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం సుమారు 200మిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కలు భూమిని డీకొనడం వల్ల వచ్చినవే అట.

సముద్రంలో కూడా
సముద్రంలో కూడా సుమారు 20మిలియన్ టన్నుల బంగారం ఉందట. ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ పంచితే ప్రతి ఒక్కరీకి 4కిలోల చొప్పున వస్తుందట.



Click it and Unblock the Notifications
