Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
వింటర్ డ్రెస్ గేమ్స్ లో ముందువరసలో ఉండాలని అనుకుంటున్నారా ? అయితే కత్రినా కైఫ్ ఏం చెప్తుందో చూడండి.
కత్రినా తన దుస్తులను, ఫ్లోవీ-సిల్హౌట్ మోడల్లో, భారీగా కనిపించేలా ¾ స్లీవ్స్ తో ఉండేలా ఎంచుకుంది. కాకపోతే ఆమె అలంకరణ అత్యంత సాధారణమైదిగా కనిపిస్తూ, ఆర్భాటాల జోలికి వెళ్ళనట్లుగా సహజసిద్దంగా కనిపించింది.
కత్రినాకైఫ్ దుస్తుల ఎంపికలో ప్రత్యేకంగా ఉండడమే కాక, ఫాషన్ ఐకాన్ వలె పేరెన్నికగల ప్రముఖులలో ఒకరు. సాంప్రదాయక దుస్తులైనా, పాశ్చాత్య వస్త్రధారణ అయినా కత్రినాకైఫ్ అనుసరిస్తే, అనతికాలంలోనే అదొక ట్రెండ్ సెట్టార్ అవుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ క్రమంలో భాగంగానే, ఇటీవలే వారాంతంలో ఆమె ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలిచాయి. అందానికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపించే కత్రినా, షారూఖ్తో కలిసి ఇచ్చిన ఈ పోస్చర్లోని దుస్తులు ప్రతిఒక్కరినీ తనవైపు చూసేలా చేశాయి.

కత్రినా తన దుస్తులను, ఫ్లోవీ-సిల్హౌట్ మోడల్లో, భారీగా కనిపించేలా ¾ స్లీవ్స్ తో ఉండేలా ఎంచుకుంది. కాకపోతే ఆమె అలంకరణ అత్యంత సాధారణమైదిగా కనిపిస్తూ, ఆర్భాటాల జోలికి వెళ్ళనట్లుగా సహజసిద్దంగా కనిపించింది. ముఖ్యంగా పింక్ మరియు నలుపు గీతలతో, ముదురు గోధుమ రంగు బెల్ట్ తో ఉండి, కొత్తరకం ఫాషన్ పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. వీటికి తోడుగా కత్రినా అంటేనే గుర్తుకువచ్చే, తన పొడవు కాళ్ళకు ధరించిన బ్లాక్ బూట్స్ కూడా దుస్తులకు నప్పేలా కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇక ఫాషన్ ఉపకరణాల కిందకు వస్తే, చెవి రింగులు ప్రధాన ఆకర్షణగా ఉండి, సహజసిద్దమైన సాదా మేకప్ టచ్ ఇచ్చి, పింక్ లిప్-షేడ్, స్మోకీ-కోహ్ల్ తో హైలైట్ చేయబడింది. చివరగా, ఆమె కుడి వైపున బుజాల మీద జాలువారినట్లున్న ఉంగరాల జుట్టుతో మేకప్ ముగించింది. మొత్తానికి క్లాసీ లుక్తో అలరించిన కత్రినా, ఎప్పటికప్పుడు కొత్త ఫాషన్ పోకడలతో అలరిస్తూ, అందరి దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది.



Click it and Unblock the Notifications