Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ముఖ కవళికలు, లక్షణాల ఆధారితంగా కూడా వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయా?
చైనీస్ ఫేస్ రీడింగ్ ప్రకారం, నుదురు పంచభూతాలలోని అగ్నికి సూచనగా ఉంటుంది. క్రమంగా, నుదురు ఎక్కువగా ముందుకు చొచ్చుకుని ఉన్నట్లు కనిపిస్తున్న పక్షాన వీరి ఆగ్రహావేశాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది. క్రమంగ
రాశి చక్రాలు, నక్షత్రాల ప్రభావాలతో పాటుగా, ముఖ కవళికలు, లక్షణాల వంటి అనేక ఇతరత్రా వ్యక్తిగత లక్షణాలు కూడా వివాహాల ఆలస్యానికి బాధ్యత వహిస్తాయని నిపుణులు చెప్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహాల ఆలస్యానికి ముఖ కవళికలు, లక్షణాలు కూడా ప్రధాన కారకాలుగా మారగలవు.

ఫేస్ రీడింగ్ చైనీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ క్రింద పొందుపరచబడిన, ముఖానికి సంబంధించిన లక్షణాలలో ఏవైనా వ్యక్తిలో ఉన్నట్లు కనుగొన్న ఎడల, వారి వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.

మందపాటి, దృడమైన మరియు తిన్నగా వంకరలు లేని వెంట్రుకలు ఉన్న ఎడల :
చైనీస్ ఫేస్ రీడింగ్ నిపుణులప్రకారం, ఒక వ్యక్తి యొక్క జుట్టు మందంగా ఉన్న ఎడల, ఆ లక్షణం ప్రత్యక్షంగా అతని రక్తానికి సంబంధించి ఉంటుంది. మందపాటి జుట్టుతో ఉన్న వ్యక్తులు అసంపూర్ణతతో ఉంటారు లేదా వారి వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వారి జుట్టు నేరుగా వంకరలు లేకుండా, మరియు దృడంగా ఉన్న పక్షంలో, చైనీస్ ఫేస్ రీడింగ్ నిపుణుల ప్రకారం, "పరిధిదాటిన వ్యక్తిత్వ పోకడలకు" (యాంగ్) చిహ్నంగా ఉంటుంది. మరియు ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది.

నుదురు ముందుకు చొచ్చుకుని వచ్చినట్లుగా ఉన్న ఎడల :
చైనీస్ ఫేస్ రీడింగ్ ప్రకారం, నుదురు పంచభూతాలలోని అగ్నికి సూచనగా ఉంటుంది. క్రమంగా, నుదురు ఎక్కువగా ముందుకు చొచ్చుకుని ఉన్నట్లు కనిపిస్తున్న పక్షాన వీరి ఆగ్రహావేశాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది. క్రమంగా వీరు మానసిక ఆందోళనలు, మరియు డిప్రెషన్ వంటి సమస్యలకు తరచుగా గురవుతుంటారని చెప్పబడింది. ముఖ్యంగా దీని ప్రభావం ఆడవారి మీద ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, ఇది వివాహం మరియు సంబంధాల పురోగతిపై ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంది.

నుదురు భాగం అధికంగా (పెద్దదిగా) ఉన్న ఎడల
అధిక నుదురు భాగం కలిగి ఉండటం కూడా అగ్నికి సంకేతంగా ఉంటుంది. మరియు, చంచల మనస్సుకు చిహ్నంగా చెప్పబడుతుంది. ఇటువంటి నుదురు కలిగిన వ్యక్తులు తెలివిగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, లేదా వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సన్నని లేదా తేలికపాటి కనుబొమ్మలు
చిన్న మరియు సన్నని కనుబొమ్మలను కలిగి ఉన్న వ్యక్తులు అత్యంత సాధారణమైన వ్యక్తులుగా, మానసిక ప్రశాంతతను అధికంగా కూడుకుని కనిపిస్తుంటారు. అంతేకాకుండా వారు సంబంధాల పట్ల, సోదరభావం అధికంగా గలవారై, పిల్లలు లేదా వివాహాది అంశాల ప్రకారం అత్యంత ఉదాసీనతను ప్రదర్శిస్తుంటారు. క్రమంగా వివాహాలు ఆలస్యమవుతుంటాయి.

మందపాటి కనుబొమ్మలు
అత్యంత మందపాటి కనుబొమ్మలను కలిగి ఉన్న వ్యక్తులు, తీవ్రమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీరికి చిన్న సమస్య, పెద్ద సమస్య అని ఉండదు., ప్రతి సమస్యనూ తీవ్రంగానే పరిగణిస్తుంటారు. క్రమంగా ఇతరత్రా ముఖ్యమైన అంశాల పట్ల దృష్టి సారించడం తగ్గుతుంది, ఫలితంగా, వీరు అనేక మంచి అవకాశాలను సైతం కోల్పోతూ ఉంటారు. ఇటువంటి పరిణామాలు వివాహాల ఆలస్యానికి కారణాలుగా మారుతుంటాయి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
