For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పుట్టిన తేదిని అనుసరించి మీ వివాహ సంబంధిత వివరాలను తెలుసుకోండి

అనేక సందర్భాలలో, వీరి సంబంధాలలో వాదనలు అధికంగా ఉంటాయి. ఈ అంకెకు చెందిన అనేక మంది వ్యక్తులు తమకు ఇష్టంలేని పని చేయడానికి సిద్దంగా ఉండరు. ఒత్తిళ్లను సహించలేరు., ఒకవేళ వారు ప్రేమలో ఉన్న ఎడల, ఆ

|

మీకు వివాహం ఎప్పుడు జరుగుతుంది, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లినా ? ఇటువంటి ప్రశ్నలు తరచుగా ఎదుర్కోవడం సహజంగానే ఉంటుంది. అవునా? కానీ, ఇటువంటి అంశాలలో సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించి, మీ పుట్టిన రోజు ఆధారితంగా కొన్ని సమాధానాలు లభిస్తాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెప్తుంటారు. మీ పుట్టిన తేది, మీ వ్యక్తిత్వంతో పాటుగా, మీ సంబంధాల గురించిన అనేక అంచనాలను కూడా అందివ్వగలదు.

అదేవిధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీ వివాహాది అంశాల గురించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చని తెలుపబడినది. మీ పుట్టిన తేదీని ఒకే అంకె వచ్చే వరకు లెక్కించి, వచ్చిన అంకె ఆధారితంగా మీ వివాహాది అంశాల గురించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

ఉదాహరణ : మీరు 16 వ తేదీన జన్మించినట్లయితే, మీ సంఖ్య 1 + 6 = 7.

క్రింద ఉన్న అంచనాలను చూడండి : మీరు పుట్టిని తేదిని అనుసరించి మీ వివాహ సంబంధిత వివరాలను తెలుసుకోండి

1 – (1, 10, 19 లేదా 28వ తేదీలలో పుట్టిన వారు)

1 – (1, 10, 19 లేదా 28వ తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 1 వచ్చిన తేదీలో జన్మించిన వ్యక్తులు సాధారణంగానే నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. ఎటువంటి విషయాలలో అయినా ముందుండి నడిపించే స్వభావం వీరి సొంతం. అంతేకాకుండా వీరు తమ తమ సంబంధాలలో కూడా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంటారు. అనేక సందర్భాలలో, వీరి సంబంధాలలో వాదనలు అధికంగా ఉంటాయి. ఈ అంకెకు చెందిన అనేక మంది వ్యక్తులు తమకు ఇష్టంలేని పని చేయడానికి సిద్దంగా ఉండరు. ఒత్తిళ్లను సహించలేరు.

ఒకవేళ వారు ప్రేమలో ఉన్న ఎడల, ఆ ప్రేమ సఫలీకృతం కాకుండా విడిచిపెట్టరు. ఎన్ని తగాదాలు, చిరాకులు పరాకులు ఉన్నా, భాగస్వామితో కలిసే ఉండాలన్న ధోరణిని ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా విశ్వసనీయతను అధికంగా ప్రదర్శించే వారిగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా ప్రేమ వివాహాలంటేనే ఎక్కువ మక్కువని ప్రదర్శిస్తుంటారు.

2 – (2, 11, 20 లేదా 29వ తేదీలలో పుట్టిన వారు)

2 – (2, 11, 20 లేదా 29వ తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 2 వచ్చిన తేదీలలో పుట్టిన వ్యక్తులు మూడీగా, సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు వారి భాగస్వామితో ఒక దృఢమైన మానసిక సంబంధాన్ని కలిగి ఉంటారు. కానీ, శారీరక సంబంధాల విషయంలో కాస్త తక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. మరియు భాగస్వామితో భావోద్వేగ సంబంధాన్ని రూపొందించడంలో మరింత దృష్టిని కేంద్రీకరించేవారిగా ఉంటారు. క్రమంగా వీరు ప్రేమ మరియు వివాహాది అంశాలలో సంతృప్తికరమైన జీవితాన్నే కలిగి ఉంటారని చెప్పబడింది. సంబంధాల విషయాలలో కుటుంబ సభ్యుల ఆలోచనలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారిలా ఉంటారు.

3 – (3, 12, 21 లేదా 30 వ తేదీలలో పుట్టిన వారు)

3 – (3, 12, 21 లేదా 30 వ తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 3 వచ్చిన తేదీలలో జన్మించిన వ్యక్తులు 1 అంకె సమాధానంగా వచ్చిన వారితో లక్షణాలను సరిపోలి ఉంటారు. ప్రేమ మరియు వివాహాది అంశాలలో ఈ సారూప్యత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక ప్రత్యేకంగా ఈ 3 అంకె గలిగిన వారి విషయానికి వస్తే, వీరు సంబంధాల పట్ల ఆచరణీయాత్మక ధోరణిని కనపరుస్తుంటారు. అనగా వీరికి నచ్చిన వ్యక్తుల పట్ల నిబద్దతా భావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ ప్రేమలో ఉన్న ఎడల, తమ మీద కూడా వీరితో సమానమైన నిబద్దతను ప్రదర్శించే వ్యక్తి భాగస్వామిగా ఉన్న ఎడల, ఎట్టిపరిస్థితుల్లో వారిని విడిచిపెట్టే సాహసం చేయరు. ఎన్ని కష్టాలు ఎదురయినా ఎదుర్కొని, సమాజానికి ఎదురొడ్డి సాధించుకునే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు.

ప్రతిష్టాత్మకంగా, నిర్భయమైన జీవితాన్ని గడుపుతారు. మరోవైపు, వీరు వ్యక్తులు కూడా స్వీయ ఆలోచనలకూ లోబడి స్వంత చట్టాలను రూపొందించేవారిగా ఉంటారు. మానసిక భావోద్వేగాలతో పాటు, శృంగారంలో కూడా అందెవేసిన చేయిగా ఉంటారు. జీవితంలో ప్రతి క్షణాన్ని అందంగా మలచాలనే ఆలోచన కలిగి ఉంటారు. క్రమంగా వీరిని విడిచిపెట్టలేని స్థితికి భాగస్వామి చేరుకుంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. వీరిది ఎక్కువగా ప్రేమ వివాహమే అయి ఉంటుంది. అలాగని కుటుంబ సభ్యులకు విలువ ఇవ్వరు అనడం హాస్యాస్పదం. చివరగా తమ ఆలోచనలలో ఒక పరిపూర్ణత ఉండే వ్యక్తులుగా ఉంటారు., క్రమంగా వీరి భాగస్వామి ఎంపిక అద్భుతంగా ఉంటుంది.

4 – (4, 13, 22 లేదా 31వ తేదీలలో పుట్టిన వారు)

4 – (4, 13, 22 లేదా 31వ తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 4 వచ్చిన తేదీలలో జన్మించిన వ్యక్తులు, చాలా వరకు అసాధారణమైన వర్గానికి చెందిన వారిగా ఉంటారు. ఈ వ్యక్తులలో ఎక్కువగా శృంగారభరితమైన వ్యక్తులు కాజాలరు. వారు వివాహ సంబంధమైన అంశాల కన్నా, పక్క చూపులను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరిలో శృంగారం కోసమే సంబంధం అన్న ఆలోచనను కలిగిన వారే అధికంగా ఉంటారు. సాధారణంగా వీరి భావోద్వేగ స్థాయిలు కూడా తక్కువగానే ఉంటాయి. క్రమంగా వీరు తమ తమ సంబంధాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి.

Most Read :మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశాను #mystory392Most Read :మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశాను #mystory392

5 – (5, 14 లేదా 23 తేదీలలో పుట్టిన వారు)

5 – (5, 14 లేదా 23 తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 5 గా కలిగిన తేదీలలో జన్మించిన వ్యక్తులలో అనేక మంది, వారి వివాహానికి ముందే అనేక ఇతర సంబంధాలు కలిగి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీరు సాధారణంగా వారి పరిపూర్ణ భాగస్వామిని కనుగొనే కోరికతో భాగస్వాములను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. క్రమంగా వీరు ఏ సంబంధంలోనూ నిలకడ ప్రదర్శించలేరు. ఎప్పటికప్పుడు కొత్త భాగస్వాములను కలిగి ఉండే ఆలోచనలు ఉన్న కారణంగా వీరి సంబంధాలలో కలతలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి శృంగారం కీలకమైన అంశంగా ఉంటుంది. క్రమంగా కొద్దికాలానికే భాగస్వామి సంబంధంపట్ల విసుగు చెందే అవకాశాలు ఉంటాయి.

6 – (6, 15 లేదా 24వ తేదీన పుట్టిన వారు)

6 – (6, 15 లేదా 24వ తేదీన పుట్టిన వారు)

చివరి సమాధానం 6 గా కలిగిన తేదీలలో పుట్టిన ఈ వ్యక్తులు, ఎక్కువగా శాంతి మరియు సామరస్యాన్ని కలిగి ఉంటారు. సాధారణంగానే అందంగా ఆకర్షణీయంగా కనిపించే వీరు శృంగారభరితమైన వ్యక్తులుగా కూడా ఉంటారు. కానీ భావోద్వేగాల విషయంలో కూసింత దూరంగానే ఉంటారని నిపుణులు చెప్తుంటారు. మరోవైపు, వివాహేతర సంబంధాల మీద ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తుంటారు.

అంతేకాకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వీరు చేసే ప్రయత్నాలు భాగస్వామికి చిరాకు తెప్పిస్తాయి. కానీ, వీరు మానసికంగా భాగస్వామికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రం, ఎక్కువ నిబద్దతను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు లైంగికపరమైన అంశాలు అంతటి ప్రాధాన్యతను కలిగి ఉండవని చెప్పబడింది, కానీ వారు ఎక్కువగా బలమైన మానసిక సంబంధాలను కలిగిఉండేందుకు ఇష్టపడుతారు. అవి లభించని పక్షంలో మనసు చంచలంగా ప్రవర్తిస్తుంటుంది.

7 – ( 7, 16 లేదా 25 వ తేదీలలో పుట్టిన వారు)

7 – ( 7, 16 లేదా 25 వ తేదీలలో పుట్టిన వారు)

చివరి సమాధానం 7 గా కలిగిన తేదీలలో జన్మించిన ఈ వ్యక్తులు తక్కువ మాట్లాడేవారిగా ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశంలోనూ అధిక శ్రద్ధను కనపరుస్తూ, ఆచితూచి అడుగులు వేస్తుంటారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో సిద్దంగా ఉండలేని కారణంగా, కొన్ని అంశాలలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుంటారు.

శారీరిక సంబంధాల కన్నా, మానసిక సంబంధాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. క్రమంగా ఈ వ్యక్తులు, తమ వైవాహిక జీవితం విజయవంతం చేసుకోవాలని భావిస్తే, వారి భాగస్వామితో ఉత్తమమైన భావోద్వేగ సంబంధాలను కలిగి ఉండటం అవసరంగా ఉంటుంది. దీనితో పాటు, చిన్న సమస్యలను సైతం పెద్దగా చేయటానికి ప్రయత్నించే స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమంగా వీరి సంసారంలో కలతలు సాధారణంగానే ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీరు ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళవైపే మొగ్గు చూపుతుంటారు.

8 – (8, 17 లేదా 26వ తేదీలలో పుట్టిన వారు)

8 – (8, 17 లేదా 26వ తేదీలలో పుట్టిన వారు)

ఈ వ్యక్తులు ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉన్నా, అదే సమయంలో, భావోద్వేగాల గనిగా కూడా ఉంటారు. అంతేకాకుండా వీరు సంబంధాల్లో అత్యంత విశ్వసనీయత, నిబద్దత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు, సమాజానికి, కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, భాగస్వామికి కూడా తప్పుగా అర్ధమవుతుంటారు. కానీ వారు ఎల్లప్పుడూ తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారు. క్రమంగా, వారి భాగస్వాములను చేరుకునేందుకు ఈ వ్యక్తులకు అధిక సమయం పడుతుంది. ఎక్కువగా ప్రేమ వివాహాలపట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.

Most Read :ప్రేమ ముందు ఉన్న ప్రేమ.. ప్రేమలో ఉన్నప్పుడూ ఉండాలి, అబ్బాయిలంతా మోసగాళ్లే #mystory391Most Read :ప్రేమ ముందు ఉన్న ప్రేమ.. ప్రేమలో ఉన్నప్పుడూ ఉండాలి, అబ్బాయిలంతా మోసగాళ్లే #mystory391

9 – ( 9, 18 లేదా 27 వ తేదీన పుట్టిన వారు)

9 – ( 9, 18 లేదా 27 వ తేదీన పుట్టిన వారు)

ఈ వ్యక్తులకు సాధారణంగా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. కానీ వారు అత్యంత భావోద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ప్రపంచానికి కనపడకుండా భావాలను అణిచిపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరిలో ఎక్కువగా తమతో లైంగికపరంగా ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తితోనే చివరికి స్థిరపడతారు. అంతేకాకుండా ఎక్కువ శృంగార భరితమైన వ్యక్తులుగా ఉంటారు. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే వీరు, ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ వైపే మొగ్గు చూపుతుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సంఖ్యా శాస్త్ర, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Marriage Predictions Based on your Date of Birth

Marriage Predictions Based On Your Date Of Birth
Desktop Bottom Promotion