Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వామ్మో.. వింత వ్యాధితో చనిపోతున్న ప్రజలు.. అది కూడా మన దేశంలోనే!
నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసానికి ప్రపంచం అంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ మహమ్మారి బారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఇది ఇలా ఉండగానే కొన్ని వింత, గుర్తు తెలియని వైరస్‌లు ప్రపంచం మీదకు దాడి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన డింగా డింగా వైరస్ కూడా ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్‌లో గుర్తు తెలియని వ్యాధి కారణంగా పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఎంతమంది చనిపోయారంటే?
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గల బాధల్ గ్రామంలో ఈ వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఏ విధంగా ఇది సోకుతుందో తెలియక రాజౌరి జిల్లా అధికారులతో పాటు ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా మదనపడుతున్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడం పైగా రెండు కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రజలంతా కంగారు పడుతున్నారు.

దీంతో విషయం తెలుసుకున్న రాజౌరి జిల్లా అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించబడంతో కేంద్రం బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీని రాజౌరికి పంపించింది. ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అక్కడి ప్రజలు చనిపోతున్నారు అనేది పరీక్షిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి? అనేది పరిశోధిస్తున్నారు.
మరో కరోనా అవుతుందా?
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వైరస్ ప్రమాదాన్ని తెలిసి ఎక్కడ మరోసారి ప్రపంచాన్ని విధ్వంసానికి గురి చేస్తుందో అని కంగారు పడుతున్నారు. ఈ వ్యాధి ఎలా సోకుతుందో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కంగారు పట్టుకుంటున్నారు. మరో కరోనా వైరస్ అవుతుందా అని భయపడుతన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకె విధానం తెలియక అయోమయంలో ఉన్నారు. మరి ఈ వ్యాధి దేనికి దారి తీస్తుందోనని కంగారు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications