Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి!
Insync
oi-Chintapalli Ramana
ఆగస్టు 15, 2026న భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడనున్నాయి. దేశభక్తి గీతాలను పాడుకుంటూ అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ జాతీయ పతాకాన్ని గౌరవంగా ఆవిష్కరించుకోనున్నాయి. గత 80 ఏళ్లుగా స్వేచ్ఛా ఊపిరులు పీల్చుకుంటున్న మన స్నేహితులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులకు ఈ ప్రత్యేకమైన రోజున దేశభక్తి సందేశాలు, శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు(Wishes and Messages)
- మన జెండా - మన గర్వం! దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మరణలో.. అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- భారతదేశానికి స్వేచ్ఛ అనేది ఊరికే రాలేదు. లక్షలాది మంది పోరాడి సాధించుకున్న అమూల్యమైన వరం ఈ స్వాతంత్ర్యం. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే!
- ఈ దేశం మనది. ప్రతిరోజూ, ప్రతిక్షణం భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడదాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్!
- విభిన్న మతాలకు నెలవు మన భారతదేశం. మన దేశం శాంతి, సమృద్ధి, సంతోషాలతో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ హ్యీపీ ఇండిపెండెన్స్ డే.
- భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలం. ఈ పవిత్రమైన రోజున మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. వందేమాతరం!
వాట్సాప్ స్టేటస్ కోట్స్
- భారత్‌కు సాతంత్ర్యం.. మన గుండెల్లో స్వేచ్ఛ, మన మాటల్లో విశ్వాసం, మన హృదయంలో గర్వం. హ్యాపీ పంద్రాగస్ట్
- ఒకే దేశం, ఒకే గర్వం, ఒకే త్రివర్ణ పతాకం. భారత్ మాతాకీ జై.. జై హింద్!
- నిన్నటి త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వందేమాతరం!జై హింద్! అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- భారత్ మాతా కీ జై! వందేమాతరం.. మన స్వేచ్ఛను కాపాడుకుందాం, దేశాన్ని గౌరవిద్దాం.
- ఈ ఆగష్టు 15 ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!
- మన రక్తంలో దేశభక్తి, మన గుండెల్లో భారత్‌మాత కీర్తి నిత్యం వెలుగొందాలని ఆకాంక్షిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- త్రివర్ణ పతాకం మన గౌరవం.. ఐక్యత మన బలం. జై హింద్, జై భారత్!దేశం కోసం ప్రాణాలొదిలి స్వాతంత్ర్యం అందించిన యోధులకు జోహార్లు. అందరికీ పంద్రాగస్ట్ శుభాకాంక్షలు!

దేశభక్తి సందేశాలు
- స్వేచ్ఛా భారతావనికి వందనం! మన దేశం ఎల్లప్పుడూ శాంతి, ప్రగతి పథంలో పయనించాలని కోరుకుంటూ..
- అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- త్రివర్ణ పతాక సాక్షిగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరణలో.. గర్వంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందాం!
- భారతీయుడిగా పుట్టడం నా గర్వం!
- కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడటమే అమరవీరులకు మనం ఇచ్చే నివాళి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!
స్పూర్తిదాయకమైన కోట్స్
- "స్వేచ్ఛ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే.. దానిని మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవాలి." అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
- మన పూర్వీకులు అందించిన స్వేచ్ఛా ఫలాలను నిస్వార్థంగా ఆస్వాదిద్దాం. భావి తరాలకు స్వచ్ఛమైన, ప్రగతిశీల భారతదేశాన్ని అందించడం మన కర్తవ్యం.
- మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుందాం. అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!
- మన జెండా మన గర్వం, మన దేశం మన ప్రాణం. దేశ ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే!
- ఎంతో మంది అమరవీరుల పోరాట ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజున మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత. భారత్ మాతాకీ జై.!
Comments
English summary



Click it and Unblock the Notifications
