Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ!
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.!
సోషల్ మీడియా.. ఇదొక అంతులేని ప్రపంచం. దీనికి ఒక్కసారి బానిస అయ్యారంటే ఆ ఊబిలోంచి బయటపడటం కష్టం. దీనినే నమ్ముకొని కోట్లు సంపాదిస్తున్న వారు కొందరైతే.. మరికొందరు తమ వెకిలి చేష్టలతో నవ్వులపాలవుతున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం ఎలా ఉంటున్నాం.. ఆ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నామనేది ముఖ్యం. దానికి వయసు, పరిమితులు కూడా ఉండాలి. ఆ హద్దులు దాటితే ఎన్నో విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది. దానికి ఈ తొమ్మిదేళ్ల బాలుడి ఉదంతమే ఉదాహరణ. యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వాలనే అత్యాశతో ఆ బాలుడు చేసిన పని నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్తగా ఏదైనా చేయడం, ప్రపంచాన్ని చుట్టేయడం, తమ స్కిల్స్‌ను ప్రదర్శించడం, లేదా ప్రాణాలను పణంగా పెట్టి సాహసోపేత రీల్స్ చేయడం ఇంకా ఎన్నో. ఇలా చేయడం ద్వారా వారు వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. డబ్బులు కూడా సంపాదిస్తుంటారు. అయితే ఇలాంటివి సాధించడం అంత సులభం కాదు. వేచి ఉండాలి. తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఈ బాలుడు ఎంచుకున్న రూట్ వేరు. సంపాదించడం కోసం, వైరల్ అవ్వడం కోసం ఈ పిల్లాడు చేసిన పని తండ్రిని ఆర్థిక కష్టాల్లో ముంచెత్తింది. పది, ఇరవై కాదు ఏకంగా రూ. కోటిపైన డబ్బు పోగొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే..
అమెరికాకి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు మైటీ మైక్ ప్లేస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. తన ఛానెల్ ద్వారా వైరల్ అయ్యేందుకు బాలుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వ్యూస్ రావడం లేదు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. కొడుకు పరిస్థితి గమనించిన తండ్రి వ్యూస్ రావడం కోసం యాడ్స్‌కి ట్రై చేశాడు. ఇందుకోసం 20 డాలర్లు అంటే రూ. 1600 ఖర్చు చేశాడు. అంతేకాకుండా డబ్బు చెల్లించి వ్యూస్ ఎలా సంపాదించాలో చూపించాడు.

కిటుకు తెలిసిన గిడుగు
ప్రకటనలకి ఖర్చు చేస్తే వ్యూస్ ఈజీగా సంపాదించవచ్చని భావించిన ఈ పిల్లాడు ఆ తర్వాతి నుంచి తాను చేసే ప్రతి వీడియోకి ప్రకటనలు వేయడం ప్రారంభించాడు. అదెలా అంటే.. తన తండ్రి క్రెడిట్ కార్డ్ సమాచారం అంతా గూగుల్ ఖాతాలో ఉండటంతో ఇక వరుసపెట్టి యాడ్స్ కొనుగోలు చేశాడు. ఇలా అవసరమైన ప్రతిసారి క్రెడిట్ కార్డును వాడుకున్నాడు. ఇలా మొత్తంగా 1,18,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 1.13 కోట్లు ఖర్చు చేశాడు.

క్రెడిట్ కార్డులో బిల్లు మోత మోగి పోవడంతో బాలుడి తండ్రిని ఆఫీసుకి పిలిచారు. తాను ఖర్చు చేసిన దానికి లెక్క చెప్పమని అడిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏం చేయాలో తోచక ఖంగు తినడం కుటుంబీకుల వంతైంది.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలకు ఏ వస్తువైనా వారి వయసుకి తగిన విధంగా ఇవ్వాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనించాలని సలహా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్, డెబిట్ కార్డులు లాంటి విలువైన సమాచారాన్ని గూగుల్ ఖాతాలో ఉంచకూడదని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications

