Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్!
భారత క్రికెట్ దిగ్గజం, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఆయన పేరు ఆట వల్ల కాకుండా ఒక పాత వివాదం వల్ల నెట్టింట మార్మోగుతోంది.
కొన్నేళ్ల క్రితం రోహిత్ శర్మతో ప్రేమాయణం నడిపినట్లు వార్తల్లో నిలిచిన బ్రిటన్ మోడల్, సింగర్, నటి, 2013 బిగ్ బాస్ హిందీ కంటెస్టెంట్ సోఫియా హయత్.. తాజాగా మరోసారి బాంబు పేల్చింది. ఏళ్ల నాటి పాత వ్యవహారాన్ని తవ్వుతూ ఆమె చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల స్ట్రెయిట్ టాక్ క్వీర్ విజ్డమ్ అనే ప్రముఖ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సోఫియా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు తనకు క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహన లేదని, అప్పట్లో కేవలం పాపులారిటీ కోసమే తన మేనేజర్ సలహాతో కొన్ని అబద్ధాలు ఆడానని ఆమె అంగీకరించింది.
అదే సమయంలో వరల్డ్ బెస్ట్ క్రికెటర్ రోహిత్ తో తాను డేటింగ్ చేశానని చెబుతూ..బెడ్ రూమ్ లో అతడితో తన అనుభవం ఏమాత్రం బాగాలేదంటూ, రోహిత్ పర్ఫార్మెన్స్ బెడ్ మీద పూర్ అంటూ అత్యంత వ్యక్తిగతమైన, బోల్డ్ కామెంట్స్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది.
అసలు వీరు ఎందుకు విడిపోయారంటే..
వీరిద్దరి వ్యవహారం గురించి వెనక్కి వెళితే.. 2012లో రోహిత్, సోఫియాల మధ్య ఓ లండన్ క్లబ్ లో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుమారు ఏడాది పాటు వీరు డేటింగ్ లో ఉన్నట్లు సోఫియా గతంలోనే స్వయంగా తెలిపింది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
ఒకానొక సందర్భంలో మీడియా ముందు రోహిత్ శర్మ.. సోఫియాను కేవలం తన అభిమానిగా మాత్రమే పరిచయం చేశాడు. తనను ప్రేమికురాలిగా కాకుండా ఫ్యాన్ అని పిలవడం సోఫియాను తీవ్రంగా కలచివేసింది. ఆ కోపంతోనే రోహిత్ ను సోషల్ మీడియా సహా అన్ని ప్లాట్ ఫామ్స్ నుంచి బ్లాక్ చేశానని, అక్కడితో తమ బంధానికి ముగింపు పలికానని ఆమె చెప్పుకొచ్చింది.
సంతోషంగా రోహిత్ ఫ్యామిలీ లైఫ్..
సోఫియా ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నాడు. 2015లో తన మేనేజర్ రితికా సజ్దేను రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2018లో సమైరా అనే ముద్దుల కుమార్తె జన్మించగా, 2024లో వీరు మరోసారి తల్లిదండ్రులయ్యారు.
ఇక క్రికెట్ పరంగా టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, ప్రస్తుతం వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యాడు. త్వరలోనే ఓ ప్రముఖ టీవీ షో ద్వారా సరికొత్త అవతారంలో అభిమానులను అలరించడానికి కూడా సిద్ధమవుతున్నాడు. కాగా, సోఫియా హయత్ చేసిన ఈ తాజా సంచలన ఆరోపణలపై రోహిత్ శర్మ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.



Click it and Unblock the Notifications
