Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Adipurush: ఆదిపురుష్ థియేటర్లలో హనుమాన్ కోసం ఒక ఖాళీ సీట్, దాని వెనక ఆసక్తికర కారణముంది
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా అత్యంత భారీ బడ్జెట్ తో డైరెక్ట్రర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదల అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు విదేసీ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలే నెలకొన్నాయి.

జూన్ 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది ఆదిపురుష్. ఈక్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి చిత్ర యూనిట్ ఓ లేఖను విడుదల చేసింది. అదిప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. ఆదిపురుష్ సినిమా థియేటర్లలో ప్రతి షోలో ఒక సీటు ఖాళీగా ఉంచనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఒక్క సీటును విక్రయించకుండా అలాగే ఉంచనున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. హనుమాన్ కోసం ఈ సీటు ఖాళీగా ఉంచనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ లెటర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
రామచరితమానస్ రచయిత గోస్వామి తులసీ దాస్ తో పాటు అనేక ఇతర గ్రంథకర్తలు, సాధువులు చాలా సందర్భాల్లో ఓ విషయాన్ని చెప్పారు. రామాయణం ఎక్కడ చదివినా, పఠించినా హనుమంతుడు కచ్చితంగా అదృశ్య రూపంలో వస్తాడని ఓ నమ్మకంగా బలంగా ఉంది. ఇది శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్న భక్తి. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్ లో హనుమాన్ కోసం ఓ సీటు కేటాయించాలని ఆదిపురుష్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.
ఇలాంటి ప్రచారాలు గతంలోనూ జరిగాయి:
1943లో భక్త పోతన సినిమా సమయంలోనూ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేశారు. బెంగళూరులో ఓ భారీ హనుమాన్ కటౌట్ తయారు చేసి పెట్టారు. అప్పట్లో ఈ భారీ హనుమంతుని కటౌట్ చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. అలా చేసిన ప్రచారం సూపర్ హిట్ గా నిలిచింది.
1955లో రోజులు మారాయి సినిమా సమయంలో ఓ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పెద్ద బొట్టు పెట్టుకుని, ఎర్ర చీర కట్టుకున్న ఓ మహిళ రిక్షా ఎక్కింది. రిక్షా అతను ఎక్కడ దిగాలి అంటే ఇంద్రకీలాద్రి కొండదగ్గర అని చెప్పిందట. కొండ వరకు రాగానే ఆమె రిక్షాలు లేదట. ఇంద్రకీలాద్రి మెట్ల వైపు చూస్తే మెట్లు ఎక్కుతూ కనిపించిందట. రిక్షా అతను డబ్బులు అడిగితే నీ తలపాగాలో చూసుకో అందట. బంగారు గాజు, పది రూపాయలు ఉన్నాయట.
1960లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, 1997 లో వచ్చిన అన్నమయ్య సినిమాల సమయంలో థియేటర్ల వద్ద హుండీలు, విగ్రహాలు పెట్టారు. అమ్మోరు సినిమాకు కూడా ఇలాగే అమ్మోరు విగ్రహాలు వెలిశాయి.



Click it and Unblock the Notifications