Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.!
ప్రాణం పోయడం ఎంత గొప్పో.. ఆ ప్రాణాన్ని ఆయుష్షు ఉన్నంతవరకూ ఆరోగ్యకరంగా నిలబెట్టడం కూడా అంతే గొప్ప. అందుకే అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం వెలకట్టలేనిది అంటారు. డోనార్స్‌ని ప్రాణదాతలుగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా ఆగష్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆర్గాన్ డొనేషన్ ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు దాని చుట్టూ ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. కాగా భారత్‌లో అవయవ మార్పిడి అవసరాలు, దాని లభ్యతకు మధ్య చాలా అంతరం ఉన్న నేపథ్యంలో.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.

ఇప్పటికీ ప్రజల్లో అవయవ దానం గురించి అనేక అపోహలు నెలకొన్నాయి. వాటిని నిజమని నమ్మి.. ఆర్గాన్ డొనేట్ చేయడానికి భయపడుతుంటారు. అయితే ఈ అపోహలు పూర్తిగా నిజం కాదు. మన దేశంలో ఆర్గాన్ డొనేషన్ ప్రక్రియ అనేది చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఈ క్రమంలో దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలు పరిశీలిద్దాం..
అపోహ 1- వయసు పై బడితే ఆర్గాన్ డొనేట్ చేయలేరు..
వాస్తవం- వయసు పెరిగితే అవయవదానానికి అర్హులు కారని చాలా మంది భావిస్తారు. అయితే ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. వయసు పెరిగినంత మాత్రాన వ్యక్తి ఆర్గాన్ డొనేషన్‌కి అనర్హుడు కాదు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్గాన్ క్వాలిటీ ఆధారంగా మార్పిడికి పనికొస్తాయా లేదా అనేది వైద్యులు నిర్ధారిస్తారు.
అపోహ 2- డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు..
వాస్తవం- దీర్ఘకాలికంగా మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నంత మాత్రాన వారు ఆర్గాన్ డొనేషన్‌కి అనర్హులు కారు. వారి శరీరంలో ఏ అవయవాలు లేదా కణజాలాలు నాణ్యతతో పాటు డొనేషన్‌కి అర్హత కలిగి ఉన్నాయో వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తారు. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

అపోహ 3- శరీర దహనం..
వాస్తవం- కొందరు తమ మరణానంతరం ఆర్గాన్ డొనేషన్ చేసేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. మరికొన్ని కేసుల్లో స్వచ్ఛందంగా, లేదా బ్రెయిన్ డెడ్ వంటి సందర్భాల్లో అవయవదానం చేస్తారు. అయితే వ్యక్తి మరణం తర్వాత ఆర్గాన్ డొనేట్ చేస్తే ఆ మృతదేహాన్ని దహనం చేయలేరని కొందరిలో అపోహ ఉంది. ఇది అవాస్తవం. అవయవాలు, కణజాలాలను వైద్యపరంగా తొలగిస్తారు. తర్వాత మృతదేహాన్ని గౌరవప్రదంగా కుటుంబానికి తిరిగి అప్పగిస్తారు. ఇది అంత్యక్రియల విధానాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదు.
అపోహ 4: కుటుంబ పాత్ర
వాస్తవం: మన దేశంలో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మరణానంతరం అవయవదానానికి ముందుగానే అప్పీల్ చేస్తారు. అయితే సదరు వ్యక్తి అనుమతి ఉన్నా.. మరణానంతరం కుటుంబం/చట్టబద్ధమైన వారసుల సమ్మతి చాలా కీలకమని గమనించాలి. అందుకే మీ ఆలోచనలను ముందుగానే కుటుంబీకులలతో చర్చించుకోవాలి.
అవయవ దానం అనేది కేవలం మీరు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు. ఆపదలో ఉన్న వ్యక్తికి కొత్త ఆశను ఇచ్చే అవకాశం. అందుకే మీరు దీనిపై ఎలాంటి పుకార్లు, అపోహలు నమ్మకుండా ఖచ్చితమైన సమాచారం తెలుసుకుని మీ అభిప్రాయాన్ని అమలు చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
