Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా
నిగనిగలాడే చర్మం, పట్టుకుచ్చులు లాంటి జుట్టు, పసిపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల.. వీటన్నింటికీ ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం బాదం నూనె. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరికే బాదం నూనెలు ఎంతవరకు సురక్షితం? చాలావరకు బ్రాండ్లలో మినరల్ ఆయిల్స్, కృత్రిమ సువాసనలు, ప్రమాదకరమైన రసాయనాలు కలిసి ఉంటున్నాయి. ఇవి ప్రయోజనం కంటే హాని ఎక్కువగా చేస్తాయి.
పోనీ 100 శాతం స్వచ్ఛమైన ఆయిల్ కొందామంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. రసాయనాల్లేని 100 శాతం స్వచ్ఛమైన బాదం నూనెను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

బాదం ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు
బాదం పప్పులు: 2 కప్పులు
ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె: 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
బాదం ఆయిల్ తయారీ విధానం
-ముందుగా బాదం పప్పులపై ఉన్న దుమ్ము, మలినాలు పోయేలా శుభ్రం చేసుకోండి. వీటిని పూర్తిగా పొడిగా ఉన్న మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. మిక్సీని ఏకధాటిగా కాకుండా మధ్యమధ్యలో ఆపుతూ తిప్పాలి.
-మెత్తగా రుబ్బిన బాదం పొడిలో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా నువ్వుల నూనె కలపండి. ఇప్పుడు మళ్లీ మిక్సీ పట్టి, ఎక్కడా ఉండలు లేకుండా నున్నటి చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఈ బాదం పేస్ట్ ను ఒక శుభ్రమైన గాజు సీసాలో లేదా గిన్నెలో వేసి మూతపెట్టండి. దీన్ని 1 నుండి 2 వారాల పాటు కదల్చకుండా గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచండి. ఈ టైంలో బాదం నూనె నెమ్మదిగా విడిపోయి పైకి తేలుతుంది, ఘనంగా ఉండే పేస్ట్ అడుగుభాగానికి చేరుకుంటుంది.
-రెండు వారాల తర్వాత ఒక శుభ్రమైన పలుచటి కాటన్ లేదా మస్లిన్ వస్త్రాన్ని తీసుకుని, అందులో ఈ మిశ్రమాన్ని వేయండి. వస్త్రం అంచులు మడిచి గట్టిగా పిండుతూ ఉంటే.. స్వచ్ఛమైన కల్తీలేని బాదం నూనె చుక్కచుక్కగా గిన్నెలో పడుతుంది. ఈ నూనెను తడిలేని గాజు సీసాలో భద్రపరుచుకోండి.
-బాదం నూనెతో అద్భుత ప్రయోజనాలు
-రాత్రి నిద్రపోయే ముందు కేవలం రెండు చుక్కల నూనెను ముఖానికి రాసుకుని మృదువుగా మసాజ్ చేస్తే చాలు.. ముడతలు, సన్నని గీతలు, కళ్ల కింద నల్లటి వలయాలు మాయమై ముఖం సహజ కాంతితో మెరిసిపోతుంది.
ఈ నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టు రాలడం ఆగిపోతుంది. వెంట్రుకలు ఒత్తుగా, బలంగా పెరుగుతాయి.
-రసాయనాల జాడలేని ఈ నూనె పసిపిల్లల సున్నితమైన చర్మానికి అత్యంత సురక్షితమైనది. దీనితో రోజూ మసాజ్ చేయడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.



Click it and Unblock the Notifications
