Latest Updates
-
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.! -
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.! -
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే! -
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.! -
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.!
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు!
డిన్నర్ లోకి లేదా బ్రేక్ ఫాస్ట్ లోకి ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా ఏదైనా ఉంటే బాగుండు అని వెతుకుతున్నారా? అయితే మీకు రవ్వ రొట్టె బెస్ట్ ఆప్షన్.

దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. రవ్వ రొట్టెను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రవ్వ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెరుగు
-మిరియాల పొడి
-కరివేపాకు
-చిరోటి రవ్వ లేదా బొంబాయి రవ్వ
-ఉల్లిపాయ తరుగు
-అల్లం తరుగు
-క్యారెట్ తురుము
-సోయ కూర
-కొత్తిమీర
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-నూనె
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది!
రవ్వ రొట్టె తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు పెరుగు(పుల్లనిది అయితే ఇంకా బెటర్), 2 కప్పుల చిరోటి రవ్వ(రిఫైన్డ్ బొంబాయి రవ్వ), పావు టీస్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి రవ్వకు పెరుగుని బాగా రుద్ది రుద్ది పట్టించాలి. బాగా దగ్గరపడేలా కలుపుకోవాలి.
-ఒకవేళ మీకు చిరోటి రవ్వ అందుబాటులో లేకుంటే మాములు బొంబాయి రవ్వను మిక్సీలో వేసి పల్స్ చేస్తూ గ్రైండ్ చేసి తీసుకోండి.
-ఇప్పుడు కలుపుకున్న పిండిలో 3 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు, 3 టేబుల్ స్పూన్ల సోయ కూర(dill leaves), ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సన్నని అల్లం తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము, 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు తరుగు వేసి మళ్లీ పిండిని మొత్తం కలిసేలా బాగా చేత్తో ఒత్తుకోండి. ఒత్తుకునేటప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి బాగా ఒత్తుకోండి.
-ఒత్తుకున్న పిండిపై తడిగుడ్డ పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
-అరగంట తర్వాత పిండిని కొంచెం పెద్ద సైజులో బంతుల్లా చేసుకొని పెట్టుకోండి.
-తర్వాత తడిబట్టపై లేదా అరిటాకు లేదా విస్తరాకు నూనె రాసి దాని మీద ఈ పిండి బంతులను పెట్టి సర్వపిండి మాదిరి పల్చగా ఒత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం నూనె వేసి బాగా వేడి చెయ్యాలి. వేడెక్కాక పెనం మీద ఒత్తుకున్న రొట్టె వేసి మీడియం మంట మీద కాల్చుకోవాలి. అంచుల వెంట, పైన కాసింత నూనె వేసి నిదానంగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
-అంతే రవ్వ రొట్టె రెడీ. దీనిని మీకు నచ్చిన పచ్చడి లేదా చట్నీతో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications