Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.!
కుటుంబం అన్నాక ఒకరిపై ఒకరికి గౌరవం, సహకారం చాలా అవసరం. ఈ క్రమంలో కుటుంబంలోకి 'కోడలు’ రిలేషన్‌తో కొత్త వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాక మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. తన మాటను తప్పనిసరిగా ఏకీభవిస్తూ, పాటించాలనే అత్త డిమాండ్.. జనరేషన్ మార్పుతో వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునే కోడలు.. వీరిద్దరి మధ్యా కుటుంబంలో చాలా వరకు మనస్పర్థలు నెలకొంటాయి. అయితే అత్త చెప్పే ప్రతి దానికి కోడలు అంగీకరించాల్సిందేనా.. దీనిపై మనస్తత్వ నిపుణుల సలహాలు చూద్దాం..

ఫ్యామిలీలో అన్యోన్యత ఉండాలంటే ప్రతి మాటకు కట్టుబడి ఉండాలంటారు. కానీ ప్రతి విషయాన్ని గుడ్డిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవం, ఆరోగ్యం, భద్రత, చట్టపరమైన హక్కులు అనేవి కీలకం. వాటికి భంగం కలగకుండా మీ అభిప్రాయాన్ని, అసమ్మతిని గౌరవంగా తెలియజేయాలి.. అది కోడలైనా, అత్తయినా.. కుటుంబంలో ఎవరైనా సరే..
ప్రతిదానికీ ఏకీభవించడం తప్పదా..
ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది గౌరవం, అర్థవంతమైన సంభాషణ, పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడం, వాటిని అంగీకరించాలని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు. కుటుంబంలోని పెద్దలను గౌరవించడం ముఖ్యమే.. అందుకోసం మీ భావాలను, అవసరాలను, హక్కులను త్యాగం చేయాలని కాదు. మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా గౌరవంగా తెలియజేయాలి.
అయితే చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవడం కుటుంబంతో మీ బంధాన్ని బలపరుస్తుంది. కానీ మీ ఆరోగ్యం, ఆత్మగౌరవం, వృత్తి, వ్యక్తిగత విషయాలపై ఇతరులు ఏకాభిప్రాయం తీసుకుంటే మీ అభిప్రాయాలను మర్యాదగా, స్పష్టంగా తెలియజేయడం మంచిది. దృఢంగా ఉంటూనే మర్యాదగా వద్దు అని చెప్పడం చాలా కీలకం..

ఆత్మగౌరవం..
కుటుంబంలో మిమ్మల్ని దూషించడం, హేళన చేయడం, బహిరంగంగా అవమానించడం, గౌరవాన్ని దెబ్బతీయడం వంటి సందర్భాలు మీరు ఎదుర్కొంటుంటే.. మౌనంగా ఉండొద్దు. మీపై వారి ప్రవర్తన, మాట తీరు ఆధారంగానే మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలి.
ఆరోగ్యం..
మీ ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లో వాళ్లు ఉచిత సలహాలు ఇస్తుంటే వాటిని తీసుకోకండి. చికిత్స వద్దు అని చెప్పడం, గర్భధారణ, మెంటల్ హెల్త్, రెస్ట్.. ఇలా ఈ అంశాలపై మీరు డాక్టర్ సలహాకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయాల్లో కుటుంబీకులతో ఏకీభవించడం కంటే వైద్యుల సలహా మేలు..
విద్య, వృత్తి
ప్రతి వ్యక్తికీ చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు తప్పనిసరిగా ఉంటుంది. అయితే వృత్తిపరంగా మీ అభిప్రాయాలకు,. కుటుంబీకుల అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉంటే వారితో చర్చించి మీకు నచ్చే నిర్ణయాన్ని తీసుకోండి.
వ్యక్తిగత హద్దులు
ఎవరికైనా సరే పర్సనల్ టైం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే, అనవసరంగా జోక్యం చేసుకున్నా.. నిరభ్యంతరంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది మీ సంబంధంపై దుష్ప్రభావం చూపకుండా చూసుకోండి. అపార్థాలను తగ్గించుకోండి. మీ భద్రతకు, చట్టపరమైన హక్కులకు, నైతిక విలువలకు భంగం కలిగించే పనులు చేయాలని ఒత్తిడి చేస్తే నమ్మకస్తుల లేదా నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.



Click it and Unblock the Notifications
