Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఏప్రిల్‌లో 4 రోజుల లాంగ్ వీకెండ్, బడ్జెట్‌లో గోవా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు
ఏప్రిల్ మొదటి వారంలో లాంగ్ వీకెండ్ వస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ గుడ్ ఫ్రైడే, రెండో శనివారం, ఆదివారం వస్తున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి ప్రభుత్వ సెలవు, ఏప్రిల్ 6వ తేదీన ఒక్క రోజు సెలవు పెట్టేస్తే మొత్తం ఐదు రోజులు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది విద్యార్థులకు పరీక్షల సమయం, ఎక్కడికి వెళ్లినా పెద్దగా రష్ ఉండదు. చక్కగా సమయం గడపవచ్చు. మీరు ఎప్పటి నుండో గోవాకు వెళ్లాలని ప్లాన్ వేస్తుంటే ఇది పర్‌ఫెక్ట్ టైం.
వేసవి కాలంలో గోవా వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. కానీ గోవా వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయం. ఏప్రిల్ మొదటి వారంలో లాంగ్ వీకెండ్ వస్తోంది. ఎండాకాలం వచ్చేసింది. ఈ సమయంలో సాధారణంగానే గోవాలో పర్యాటకులు తక్కువగా ఉంటారు.

ఈ సమయంలో వెళ్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ జనాలు ఉంటారు కానీ ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. పీక్ సీజన్‌లో గోవాకు వెళ్తే ఏదో జాతరకు వెళ్లిన ఫీల్ వస్తుంది. ఈ సమయంలో గోవా బీచుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
బీచుల్లో, రెస్టారెంట్లలో, పబ్‌లలో, ఔట్‌డోర్ గేమ్స్, వాటర్ ఫాల్స్, ట్రాన్స్ పార్టీలు, కోటలు, చర్చిలు, గోవా డిషెస్, నేచర్ ప్లేసుల్లో ఈ సమయంలో జనసంచారం తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో గోవాకు వెళ్లి ఎలా ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్‌లో విలాసవంతమైన హాలీడే:
గోవాకు వెళ్లడం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా మంది యూత్ ఇక్కడే వెనకాడుతుంటారు. అందుకే సంవత్సరాల తరబడి ప్లాన్‌లు వేస్తున్నా అవి వర్కవుట్ అవవు. మీరు అలాంటి సమస్యే ఎదుర్కొంటుంటే.. గోవాకు వెళ్లడానికి ఏప్రిల్ సరైన సమయం.
గోవాలో ఈ సమయంలో పర్యాటకుల తాకిడి చాలా తక్కువ. అందుకే అన్నింటి ధరలు తక్కువగా ఉంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లు అన్ని ధరలు తగ్గుతాయి. స్కూటీ రెంట్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ను తక్కువలోనే ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఒక్క కారణం చాలు ఏప్రిల్‌లో గోవాకు వెళ్లడానికి.
తక్కువ రష్:
ఏప్రిల్ నెలలో గోవాలో పర్యాటకులు చాలా తగ్గిపోతారు. మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఎక్కడికి వెళ్లినా అన్నింటిని తనివితీరా ఆస్వాదించవచ్చు. స్నేహితులతో బీచ్‌ల్లో, వాటర్ ఫాల్స్ వద్ద, లవర్స్ తో వెళ్తే ఒంటరిగా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపొచ్చు.
వివిధ చర్చిలు, కోటలు, ఇతర ప్రకృతి ప్రాంతాలు, మండోవి నది వెంట విహారయాత్ర చాలా బాగుంటుంది.
జలపాతాలు, జీవవైవిధ్యం ఇంకా ఎన్నో..:
గోవా అంటే కేవంల బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, ఆల్కహాల్ మాత్రమే కాదు. ఇక్కడ అబ్బురపరిచే జలపాతాలు, విభిన్న వృక్షజాలం, జంతుజాలం కనిపిస్తుంది. ఏప్రిల్ నెలలో జనాలు తక్కువగా ఉంటారు. కాబట్టి గోవాను పూర్తిగా ఆస్వాదించవచ్చు.
దూద్‌సాగర్ జలపాతం, నేత్రావళి జలపాతం, సుందరమైన పరిసరాల్లో ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. మొల్లెం నేషనల్ పార్క్, మహదేయ్ వన్యప్రాణుల అభయారణ్యం, బోండ్లా వన్యప్రాణుల అభయారణ్యం, భగవాన్ మహావీర్ సాంక్చురీ అన్నింటిని సందర్శించవచ్చు.
అవుట్‌డోర్ అడ్వెంచర్‌లు:
గోవా అంటే వాటర్ స్పోర్ట్స్ కు పెట్టింది పేరు. అడ్వెంచర్ స్పోర్ట్స్ లేకుండా గోవా ట్రిప్ పూర్తి కాదు. పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్కీయింగ్, డాల్ఫిన్ స్పాటింగ్, స్నార్కెలింగ్, బనానా బోట్ రైడ్ ఇంకా చాలా ఉంటాయి ఎంజాయ్ చేయడానికి.



Click it and Unblock the Notifications
