Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఇలా గ్రాండ్‌గా చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
బయటకు వెళ్లడం కన్నా ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటే బడ్జెట్‌లోనే గ్రాండ్‌గా చేసుకోవచ్చు. కుటుంబసభ్యులతో కలిసి కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించవచ్చు. న్యూ ఇయర్ పార్టీని బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే గ్రాండ్‌గా
న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలు ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ పార్టీ చేసుకుందాం, ఎలా చేసుకుందాం ఇలాంటి చర్చలు ఫ్రెండ్స్ మధ్య జోరుగా జరుగుతుంటాయి. కొందరు లైవ్ కన్సర్ట్స్‌కు వెళ్తారు, మరికొందరు పబ్బులు, ఓపెన్ ఎయిర్ పార్టీలు, డీజేల హోరు ఇలా చాలానే ఉంటాయి న్యూ ఇయర్ అంటే. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు ఇంటి నుండి బయటకు వెళ్లలేరు. అలాంటి వారు న్యూ ఇయర్ పార్టీ మిస్ అవుతున్నామనే చింత అవసరం లేదు. ఇంట్లో కూడా గ్రాండ్‌గా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు.

బయటకు వెళ్లడం కన్నా ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటే బడ్జెట్‌లోనే గ్రాండ్‌గా చేసుకోవచ్చు. కుటుంబసభ్యులతో కలిసి కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించవచ్చు. న్యూ ఇయర్ పార్టీని బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే గ్రాండ్‌గా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

డెకరేషన్ ముఖ్యం గురూజీ:
పార్టీ ఏదైనా ముందు డెకరేషన్ ముఖ్యం. ఇంట్లో ఎలాంటి డెకరేషన్ చేయకపోతే పార్టీ అన్న మూడ్ రాదు. వాల్ పేపర్స్, న్యూ ఇయర్ బ్యానర్స్, లైటింగ్స్, బెలూన్స్ ఇలా చాలా వాటితో తక్కువ ఖర్చులోనే ఇంటిని అద్భుతంగా డెకరేషన్ చేయవచ్చు.

మ్యూజిక్:
పాటలు, మ్యూజిక్ లేని పార్టీ కూడా ఒక పార్టీయేనా. అస్సలే కాదు కదా. పార్టీ ఏదైనా ఉత్సాహాన్ని నింపాలంటే మ్యూజిక్ ఉండాల్సిందే. మంచి హుషారు కలిగించే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే పార్టీ మూడ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. సౌండ్ సిస్టం కూడా బాగుండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్నప్పుడు మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే పార్టీ జోరుగా సాగుతుంది.

డ్రింక్స్, డిన్నర్స్:
పార్టీ అంటే డ్రింక్స్ ఉండాల్సిందే. మొదట మంచి స్టార్టర్‌తో పార్టీని ప్రారంభించి పార్టీ చేస్తున్నప్పుడు డ్రింక్స్ తీసుకుంటేనే నిజమైన న్యూ ఇయర్ పార్టీ అవుతుంది. డ్రింక్స్‌ను కూడా అందంగా అలంకరించుకుంటే బయట న్యూఇయర్ పార్టీకి వెళ్లిన ఫీలింగే కలుగుతుంది. అలాగే డిన్నర్ ఎలాగైనా ఉండాల్సిందే. పార్టీ మూడ్‌ను తెప్పించే మంచి టేస్టీ ఫుడ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.

థీమ్ డ్రెస్సులు:
ఎప్పుడూ వేసుకున్న డ్రెస్సులే వేసుకుంటే పార్టీ అనే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఏదైనా థీమ్ సెట్ చేసుకోండి. అందరూ అలాంటి డ్రెస్సులే ధరించాలని కండిషన్ పెట్టుకోండి. కలర్ థీమ్, డ్రామా థీమ్ ఇలాంటివి ఏవైనా పార్టీ మూడ్‌ను తీసుకువస్తాయి.

గేమ్స్:
న్యూ ఇయర్ పార్టీ సాయంత్రం చీకటి పడ్డ తర్వాత మొదలవుతుంది. మరి ఉదయం నుండి సాయంత్రం వరకు సాధారణ రోజులాగే ఉంటే అందులో కొత్తదనం ఏముంటుంది. అందుకే కుటుంబసభ్యులు అందరూ పాల్గొనేలా మంచి గేమ్స్ ప్లాన్ చేయండి. బోర్డ్ గేమ్స్ ఆడొచ్చు, క్యారమ్స్ లాంటి గేమ్స్ మంచి సరదాగా సాగుతాయి. రోజంతా హుషారుగా సాగుతుంది.

కౌంట్‌డౌన్:
డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటలు అవుతున్నప్పుడు 10 అంకెలు లెక్కిస్తూ సరిగ్గా 12 గంటలకు క్రాకర్స్ కాల్చడం, కేక్ కట్ చేయడం, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికొకరు విష్ చేసుకోవడం సరదాగా ఉంటుంది. రాత్రి 12 గంటలు కావడానికి ముందు అలారం సెట్ చేయండి. అందరూ కలిసి లెక్కించేలా ప్లాన్ చేయండి.



Click it and Unblock the Notifications
