Latest Updates
-
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు
బీచ్ లో పట్టపగలే బహిరంగ శృంగారం..తర్వాత ఏమైందంటే..
థాయ్ లాండ్ అనగానే అందమైన బీచ్ లు, మసాజ్ లు, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలు వెంటనే గుర్తుకొస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే కొందరు విదేశీయులు ఎంజాయ్ మెంట్ పేరుతో హద్దులు దాటుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఒక ఫ్రెంచ్ జంట ఏకంగా పబ్లిక్ గా శృంగారంలో పాల్గొని కటకటాల పాలయ్యారు.
అసలేం జరిగిందంటే
గత శుక్రవారం(ఏప్రిల్ 10,2026)ఉదయం థాయ్ లాండ్ లోని ఫుకెట్ ప్రాంతంలోని కతు జిల్లాలో ఉన్న లామ్ సింగ్ బీచ్ పర్యాటకులతో సందడిగా ఉంది. ఆ సమయంలో 24 ఏళ్ల వయసున్న ఒక ఫ్రెంచ్ జంట అక్కడికి చేరుకుంది. చుట్టుపక్కల స్థానికులు, ఇతర పర్యాటకులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వారు బహిరంగంగానే శృంగారంలో మునిగితేలారు.

పట్టపగలు అందరూ చూస్తుండగానే వారు ఇలా చేస్తున్న సమయంలో అక్కడున్న కొందరు ఈ తతంగాన్ని తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఆ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో.. ఆ జంట తీరుపై నెటిజన్ల నుంచి, స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్రమైన పర్యాటక ప్రదేశంలో ఇలాంటి పనులేంటని మండిపడ్డారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఫుకెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కమలా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ లెఫ్టినెంట్ విచిత్ హోయీ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు.
చివరికి అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో పటోంగ్ ప్రాంతంలోని ఒక హోటల్ లో వారు బస చేస్తున్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విచారణ అనంతరం, పబ్లిక్ ప్లేస్ లో అసభ్యంగా ప్రవర్తించడం, తమ శరీరాలను బహిర్గతం చేయడం వంటి ఆరోపణల కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం జరిమానాతోనే ఈ వ్యవహారం ముగిసిపోలేదు. ఈ జంట చేసిన పని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫుకెట్ పర్యాటక ఇమేజ్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు భావించారు.
తదుపరి కఠిన చర్యల కోసం ఈ కేసును ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. వారి టూరిస్ట్ వీసాలను రద్దు చేసి, థాయ్ లాండ్ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications
