Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
మీ తప్పు లేకుండానే కొందరు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారో తెలుసా? చాణక్యుడి ఈ మాటలు వింటే షాక్ అవుతారు!
కొన్నిసార్లు మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా.. కొందరు మీ పట్ల కోపంగా, విసుగుగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకో తెలుసా? మీ వ్యక్తిత్వం వారికి ఒక అద్దంలాంటిది. ఆ అద్దంలో తమ సొంత లోపాలు కనిపిస్తాయనే భయం వారిది. సోషల్ మీడియా అభద్రతాభావాన్ని ఒక హాబీగా మార్చకముందే, చాణక్యుడు మానవ నైజాన్ని అద్భుతంగా విశ్లేషించాడు. ఎవరైనా మీ స్థాయిని చూసి లోలోపల కుంగిపోతే, నీ విజయం చూసి నాకు భయంగా ఉంది అని నిజాయితీగా చెప్పరు. బదులుగా వింతగా ప్రవర్తిస్తారు. మీ విజయాన్ని అదృష్టం అంటారు, మీ క్రమశిక్షణను ఆర్భాటం అంటారు, మీ మౌనాన్ని పొగరు అంటారు. ఇలాంటి వారిని సులభంగా ఎలా గుర్తించాలో,చాణక్యుడు ఏం చెప్పాడో ఇక్కడ చూడండి.

మీ విజయాలను తీసిపారేస్తారు
మీరు ఏదైనా శుభవార్త చెబితే, పాడైపోయిన సీలింగ్ ఫ్యాన్ లా వారి ముఖం మాడిపోతుంది. మీకు ప్రమోషన్ వచ్చిందంటే..అందులో ఏముంది, ఈరోజుల్లో అందరికీ వస్తున్నాయిలే అంటారు. మీరు రాత్రింబవళ్లు కష్టపడి పైకొస్తే..నీ టైమ్ బాగుంది బాస్ అని సింపుల్‌గా తేల్చేస్తారు. మీ కష్టాన్ని గుర్తిస్తే, వాళ్ళు జీవితంలో ఎక్కడ వెనుకబడి ఉన్నారో ఒప్పుకోవాల్సి వస్తుందన్నదే వారి అసలు బాధ.
మిమ్మల్ని కాపీ కొడుతూనే దొంగ నాటకాలు ఆడతారు
ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా బట్టలు వేసుకుంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు నిశితంగా గమనిస్తారు. ఎవరూ చూడట్లేదనుకుని అచ్చం మీలాగే అనుకరిస్తారు. కానీ ఇది కాపీ కదా అని ఎవరైనా అంటే మాత్రం.. తీవ్రంగా నొచ్చుకుంటారు. వాస్తవానికి బయట వ్యతిరేకంగా మాట్లాడినా.. లోపల మాత్రం మీరంటే వాళ్ళకి ఆరాధన. మీలా బతకడం చేతకాకనే ఇలా అనుకరిస్తుంటారు.
మీకు దక్కే ప్రశంసలను భరించలేరు
నలుగురిలో మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు, వారి ముఖకవళికలు గమనించండి. ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఇతరుల గెలుపును మనస్ఫూర్తిగా అభినందించగలరు. కానీ అభద్రతాభావంతో ఉన్నవారు.. మీకు దక్కే ప్రశంసను తమ వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. ఆ క్షణాన్ని పాడుచేయడానికి వెంటనే టాపిక్ మార్చేయడానికో, వెటకారం చేయడానికో ప్రయత్నిస్తారు.

మీ బలాలపైనే దాడి చేస్తారు
వారు విమర్శించేది మీ బలహీనతలను కాదు, మీ బలాలను. మీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఓవరాక్షన్ అంటారు. క్రమశిక్షణతో ఉంటే మూర్ఖత్వం అంటారు. లక్ష్యం వైపు పరుగెడుతుంటే అత్యాశ అంటారు. వారిలో లేని గొప్ప లక్షణం మీలో కనిపిస్తే, తట్టుకోలేక దానిపై బురద చల్లుతారు.
మీరు కింద పడితే వారి ఆనందం అంతా ఇంతా కాదు
మీరు ఎప్పుడైనా కింద పడితే లేదా ఓడిపోతే, వారు అకస్మాత్తుగా యాక్టివ్ అవుతారు. ఎక్కడలేని ప్రేమను కురిపిస్తూ ఉచిత సలహాలు ఇస్తారు. ఎందుకంటే మీ పతనం వారికి ఒక మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. "అమ్మయ్య, వీడు కూడా కింద పడిపోయాడు, నేనిప్పుడు సేఫ్ అన్నదే వారి సంతోషం. మీ ఓటమి వారికి ఆక్సిజన్ లా పనిచేస్తుంది.
చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే.. మిమ్మల్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ శత్రువులు కారు, మీ చుట్టూ ఉన్నవారంతా మీ ఆత్మీయులు కారు. అభద్రతాభావం ఎప్పుడూ లేని పోటీని సృష్టిస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, అనుకరించినా, అసూయపడినా అస్సలు కంగారు పడకండి. వెనకడుగు వేయకండి. ఎవరో గొప్పగా ఫీల్ అవ్వడం కోసం, మీరు మీ స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు.



Click it and Unblock the Notifications
